వేపూరు హనుమద్దాసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Vepuru Hanumaddaasu
వేపూరు హనుమద్దాసు
ఇతర పేర్లుహనుమద్దాసు
జననంవేపూరు,కల్వకుర్తి నాగర్‌కర్నూల్ జిల్లా
మరణంవేపూరు, కల్వకుర్తి నాగర్‌కర్నూల్ జిల్లా
వృత్తివాగ్గేయకారుడు

వేపూరు హనుమద్దాసు (19వ శతాబ్దం) భక్తకవి.[1] ఆయన గ్రామీణ ప్రాంత సంకీర్తన కవి. ఆయన బతుకమ్మ పాటగా రామాయణం రచించాడు. మొత్తానికి రామాయణం ఎంత సనాతనమో అంత నిత్య నూతనంగా ఉంటుంది.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆసఫ్‌జాహీల కాలంలో (1724-1948) మన్నెంకొండ హనుమద్దాసు, రాకమచర్ల వేంకటదాసు, వేపూరు హనుమద్దాసు ఈ కాలంలోని సంకీర్తన త్రిమూర్తులుగా పరిగణించబడతారు.[3] హనుమద్దాసు మహబూబ్ నగర్ జిల్లా జిల్లా - కల్వకుర్తి తాలూకా వేపూరు గ్రామనివాసి. ‘ముతరాసి’ కులం, తల్లిదండ్రులు బారమ్మ - అచ్చయ్య... సంజన్న...వెంకట నారాయణలు అన్నతమ్ములు.[4] వీరుగాక ముగ్గురు అప్పజెళ్ళెల్లు. హనుమద్దాసు తాత తిప్పరామన్నకి సంగీతంలో మంచి పరిజ్ఞానం ఉండేది! అదే మన వాడికి అబ్బింది! ఎప్పుడు జూసినా రామనామ గానమే! ‘హనుమద్దాసు’ రచనలూ, ఆయన గానం ఎంత ప్రసిద్ధాలై పోయాయంటే.. ఆయన 35 ఏటే...ఊళ్లలో చాలామంది హనుమద్దాసు వేషం వేసి...కీర్తనలు అవీ పాడేస్తూ తామే నిజమైన హనుమద్దాసులం అని చెప్పుకునేవారట. (అంటే డూప్లికేటు హనుమద్దాసులు బైలుదేరారు) అంత ప్రాచుర్యం పొందాడాయన.

హనుమద్దాసుని రచనలు[4]

[మార్చు]
  1. రామభక్త కీర్తనలు ముద్రితము
  2. శారద రామాయణము ముద్రితము
  3. వేపూరు బతుకమ్మ పాటలు అముద్రితము
  4. లవకుశల అముద్రితము
  5. వాలివధ అముద్రితము
  6. సీతాకళ్యాణం అముద్రితము
  7. బొబ్బిలి పాటలు ముద్రితము
  8. హనుమద్దాసు పద్యాలు ముద్రితము
  9. వేపూరు కృష్ణ లీలలు అముద్రితము
  10. యయాతి చరిత్ర అముద్రితము
  11. బొబ్బిలికథ అముద్రితము
  12. సమాజ్ పుస్తకం ఉర్దూరచన

హనుమద్దాసుని కీర్తనలు

[మార్చు]

పాలమూరు జిల్లాలో రాకమచర్ల వేంకటదాసుగారి తర్వాత చెప్పుకోదగిన కీర్తనకారుడు ‘వేపూరు హను Hanuman Da Bhojpuri Hanuman Das Shri Ram bhajan kirtan lists bhajan keerthanalu Hanuman Das bajana kirtan listమద్దాసు’.

  • యెంత బూకటి వాడు నీమగడూ- శ్రీకాంత వినుమా
  • యెవరిదగ్గర లేదు ఇంతగడు- యెంత బూకటి వాడె
  • యాదవ వెలదులిండ్లకు నేగిపాల్ పెరుగంత దొంగిలి
  • నీవేనానీవేనా రఘు రామ దూతవట
  • రామా నీ దయ రాక పోయెన
  • దండములివిగో రామ
  • గోవిందా సదానంద గోవింద
  • ఎవరు దగ్గర దీతురు
  • ఘల్లు ఘల్లున పూలు జల్లుదమా
  • ఎందుకు జన్మించితి కలియుగమూనా

హనుమద్దాసు మహిమలు

[మార్చు]

హనుమద్దాసుని గురించిన అనేక కథలూ - గాథలూ ప్రచారంలో ఉన్నాయ్! ఒకసారి ఊళ్లలో విషజ్వరం ఏదో ప్రబలింది. ఊళ్ళు ఊళ్ళు జ్వరం వాతపడి జన హడలిపోతున్నారు. హనుమద్దాసు యోగ సమాధిలో కూర్చుని ధ్యానం చేసి. ఒక కాషాయ జెండా తీసికెళ్ళి...ఊరి పొలిమేరలో పాతి విషజ్వరాన్ని ఈ జెండా దాటి రావడానికి వీల్లేదని ఆజ్ఞాపించారట! అంతే!! ఆ నాటినుంచీ జ్వరం వొస్తే ఒట్టు![5]

మరో సంఘటన.. భక్తులంతా ఆలయంలో గుండ్రంగా కూర్చున్నారు. మధ్యలో హనుమద్దాసు గారు రామనామ సంకీర్తన జరుగుతోంది! హనుమద్దాసు గారు యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు. భజన జరుగుతోంది. మెల్లిమెల్లిగా హనుమద్దాసు పద్మాసనం వేసుకుని ఉండగానే శరీరం మెల్లిగా గాల్లోకి లేవడం ప్రారంభించింది. భక్తులు సంభ్రమాశ్చర్యాల్తో చూస్తున్నారు. హారతి ఇచ్చి గంట వాయించారు మెల్లిమెల్లిగా గాల్లోకెళ్ళిన హనుమద్దాసు గారి శరీరం కిందికి దిగింది.. భక్తులంతా పాదాలమీద పడ్డంతో హన్ ఉమద్దాసు లేచి మందహాసం చేసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు! హనుమద్దాసు రచనలో ఆధ్యాత్మికత - మార్మికత ఉంటాయ్! ఉదాహరణకి..షట్చక్రోపేతమైన దేహము... దానితత్త్వాన్ని ఇలా అంటారు.

అమ్మమ్మ... ఇది యేయే... ఆరు మేడలు పైన చూడరమ్మా - ముద్దు
గుమ్మా రీతిని లోపలి గుంటొకటున్నదీ...చూడరమ్మా
గుండుకు ఒక చోటా - గుండ్లలో లోపల చూడరమ్మా
గుండ్ల మధ్యన నక్క కూతా వేయిచుండూ చూడరమ్మా - అట్టి
కూతల నడుమాననూతొకటున్నది - చూడరమ్మా
నూతిమధ్యను నక్కి నాతి కూర్చున్నదీ చూడరమ్మా - ఆ
నాతిమీదను నొక్కకోతి చేరున్నది చూడరమ్మా
కోతి మీదను పరంజ్యోతి మేలైనదీ చూడరమ్మా - ఆ
కోతియే ముల్లోక మాతాగనైనదీ చూడరమ్మ...

అంటే ఆరు మేడలంటే - షట్చక్రాలనీ దానిపై గుండంటే శిరస్సనీ అందులో రెండుకండ్లూ - అందులోని నల్లగుడ్లూ అక్కడ భ్రూ మధ్యము...ఆ బ్ర్హూమధ్యలో పరంజ్యోతి ... ఇలా మార్మికంగా ధ్యాన విధానాన్ని భోదించారు... మరో తత్త్వంతో...
బూటకుండు - శివపూజ చేసిన బుద్ధిమంతుడగునా
కాడిగట్టి ఘనకళ్ళెము చేసినా గాడ్డె గుర్రమగునా
మనసు నిల్వకను భజన చేసినా మనిషి భక్తుడగునా
కనక పర్వతము నెక్కికూసినా కాకి కోకిలగునా

అలాగే హనుమద్దాసు...ఆ రోజుల్లో కొత్తగా ఏర్పడ్డ రైలు నెక్కి అయోధ్య వంటి పుణ్యక్షేత్రాల్ని దర్శించి.. రామేశ్వరం వచ్చి సముద్ర స్నానం చేసినట్లు తెలుస్తోంది..! ఆ యాత్రా విశేషాల్నే ‘పొగబండి’ అనే పేర తత్త్వాలు రాశారట. అవి అలభ్యం. వేపూరు హనుమద్దాసు లాంటి గ్రామీణ ప్రాంత సంకీర్తన కవి బతుకమ్మ పాటగా రామాయణం రచించాడు

వేపూరు హనుమద్దాసు కీర్తనలపై పరిశోధన

[మార్చు]

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ప్రాచీన కవుల రచనలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో దాస త్రయంగా ప్రసిద్ధి చెందిన పాలమూరు జిల్లా ప్రముఖ వాగ్గేయకారుడైనటువంటి వేపూరు హనుమద్దాసు కీర్తనలపై శ్రీవైష్ణవ వేణుగోపాల్ మద్రాసు విశ్వవిద్యాలయంలో ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారి పర్యవేక్షణలో పరిశోధన చేసి ఎం.ఫిల్ పట్టా పొందారు. ప్రస్తుతం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కాశీలో తెలుగు సాహిత్యంలో సరస్వతి అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేస్తున్నారు..

మూలాలు

[మార్చు]
  1. "తెలుగు భాషా బ్రహ్మోత్సవం(ప్రపంచ తెలుగు మహాసభలు ) | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2018-01-27.[permanent dead link]
  2. "సామాన్యులకూ అర్థమయ్యే రామాయణ సారం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2018-01-27.[permanent dead link]
  3. "Oman Telangana samithi, Telangana NRI,OMAN ,TElangana Jagruthi". www.omantelanganasamithi.com. Archived from the original on 2018-08-07. Retrieved 2018-01-27.
  4. 4.0 4.1 శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన, రచన: శ్రీవైష్ణవ వేణుగోపాల్, 2016, పేజీ 28
  5. శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన, రచన: శ్రీవైష్ణవ వేణుగోపాల్, 2016, పేజీ 27

బాహ్య లింకులు

[మార్చు]