మాడభూషి సంపత్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Prof. Madabhushi Sampath Kumar
ఆచార్య మాడభూషి సంపత్ కుమార్
జననంఆచార్య మాడభూషి సంపత్ కుమార్
గ్రామం : కమ్మపల్లె, మండలం : శ్రీరంగరాజపురం, జిల్లా : చిత్తూరు
నివాస ప్రాంతంఆంధ్రప్రదేశ్ భారత దేశము భారతదేశం
వృత్తితెలుగు ఆచార్యులు
ఉద్యోగంమద్రాసు విశ్వవిద్యాలయం
ప్రసిద్ధికవి, సంపాదకులు, పరిశోధకులు
మతంహిందూ
తండ్రిశ్రీనివాసాచార్యులు
తల్లిపట్టమ్మ
వెబ్‌సైటు
http://madabhushisampatkumar.blogspot.in//

ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ (Prof. Madabhushi Sampath Kumar) కవి, సంపాదకులు, పరిశోధకులు. ఈయన తెలుగు శాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం లో ఆచార్యులుగా పనిచేస్తున్నారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆధునిక తెలుగు కవుల్లో మాడభూషి సంపత్ కుమార్ గారు కవిగా, విమర్శకులుగా, అనువాదకులుగా సాహిత్యలోకంలో ప్రసిద్ధిచెందారు. వీరు 1959లో సెప్టెంబర్ 17వ తేదీన శ్రీనివాసాచార్యులు, పట్టమ్మ దంపతులకు చిత్తూరు జిల్లా దేవళంపేట, కమ్మపల్లె గ్రామంలో జన్మించారు.

విద్యాబ్యాసం[మార్చు]

మాడభూషి సంపత్ కుమార్ బోడిదేవరపల్లెలో ప్రాథమిక విద్యను, కొత్తపల్లెమిట్టలో హైస్కూల్ విద్యను అభ్యసించారు.చిత్తూరు పి.సి,ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్, పి.వి.కె. ఎన్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసారు. ఆ తరువాత మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు చదివి అక్కడే జి.వి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఎరుకల తమిళ బంధువాచకాలు- సామాజిక భాషాశాస్త్ర విశ్లేషణ అన్న అంశంపై 1986 లో ఎం.ఫిల్ డిగ్రీ పట్టభద్రులయ్యారు. ఆచార్య చల్లా రాధాకృష్ణ శర్మ పర్యవేక్షణలో ఎరుకల భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రాసి మధురై కామరాజు విశ్వవిద్యాలయం నుంచి 1990లో డాక్టరేట్ పొందారు. అక్కడే మధుర రామనాథపురం జిల్లాలో తెలుగు భాషా, జానపద సాహిత్యంఅనే అంశంపై యూ.జి.సి.ప్రాజెక్టు కోసం పరిశోధన చేశారు. తెలుగు శాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 2015లో అత్యాధునిక ఆధునిక తెలుగు కవితా దృక్పథాలు' అన్న అంశంపై పరిశోధనచేసి డి.లిట్ పట్టాను పొందారు.

సాహిత్య ప్రస్థానం[మార్చు]

ఉద్యోగం ఆచార్యులే అయినా ఆయనలో ఉన్న కవితా పిపాస అడుగంటిపోలేదు. అదే ఆయన ప్రవృత్తి. సమాజంలో ఏ చిన్న విషయాన్ని చూసినా వెంటనే స్పందించి కాగితం మీద కలం పెట్టి అక్షరరూపం అమర్చేవారు. దేశ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై ఆలోచన మెండు. అందువల్లనే తనభావాలను కవితల రూపంలో వెలువరించేవారు. పేదల కష్టాలు, సామాన్యుల సమస్యలు, స్త్రీల దుఃఖాలు, సమాజంలో జరిగే దోపిడీలు, దేశభక్తి ఇలా చెప్పుకుంటూపోతే పలువిషయాలను కలంతో చెక్కేవారు. అలతి అలతి పదాలతో అనంత అర్థాలు వచ్చేవిధంగా చేసేవారు. బూదరాజు రాధాకృష్ణ, ఎ.బి.కె. ప్రసాద్, భద్రిరాజు కృష్ణమూర్తి తదితర భాషావేత్తల సాంగత్యం తెలుగు భాషను ఉన్నత శిఖరాలవైపు మరల్చేటట్లు చేసింది.

రచనల జాబితా[మార్చు]

మాడభూషి వారి రచనలు సాహిత్యానికి, సమాజానికి కాకుండా భావి పరిశోధకులకు ఉపయోగపడే విధంగా ఉంటాయి.

 • 2001 గడ్డిపరకతో విప్లవం
 • 2002 సామాజిక శాస్త్రవేత్త పెరియార్
 • 2008 అమ్మవాసన
 • 2008 జన్మభూమి
 • 2009 ఆంధ్రమహాభారతం - వివిధ శాస్త్రపరిజ్ఙానం
 • 2010 కవితా ! ఓ కవితా ! - వస్తువు, భాషా శైలి
 • 2012 మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ
 • 2013 జీవితం కవిత్వం
 • 2013 వ్యాస సంపద
 • 2013 వ్యాకరణ విజ్ఙానం
 • 2014 తెలుగు జానపద కళలు
 • 2014 అనువాద విజ్ఙానం
 • 2015 శత్రువుతో ప్రయాణం
 • 2015 ప్రజారోగ్యానికి పనికివచ్చే సూత్రాలు, సులభమైన మార్గాలు (అనువాదం)
 • 2015 ఒక విజేత (అబ్దుల్ కాలముకు తెలుగు వారి నివాళి)
 • 2015 ఆలోచనలు
 • 2016 పరిశోధన : నాడు, నేడు, రేపు
 • 2016 చివరకు నువ్వే గెలుస్తావు
 • 2017 మూడో మనిషి
 • 2019 వికారి
 • 2019 ధనికొండ హనుమంత రావు సాహిత్యం 21 సంపుటాలు

పై రచనలే కాకుండా వీరు వందలకు పైగా వ్యాసాలను వివిధ కోణాల్లో వెలువరించారు.

అందుకున్న పురస్కారాలు[మార్చు]

 • 2008 ఆంధ్రభాషా విభూషణ - హైదరాబాద్ లయన్స్ క్లబ్
 • 2012 అక్టోబర్ లో లిపిపై బ్యాంకాక్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పత్ర సమర్పణ చేసి తెలుగు లిపికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకోని వచ్చారు
 • 2014 శిక్షక్ సింధు సమ్మాన్ - తమిళనాడు హిందీ అకాడమీ, విశ్వ హిందీ దీవస్
 • 2014 విశిష్ట సన్మానం - మల్లవరపు జాన్ మధుర సాహితీ భారతి, తెలుగు సాహిత్య సేవ సంస్థ, ఒంగోలు
 • 2014 తెలుగు వాఙ్మయ ప్రగతిరత్న - భాషా పరిరక్షణ సమితి, పుంగనూరు
 • 2015 కరుణ శ్రీ జాతీయ పురస్కారం - భారతీయ తెలుగు రచయితల సమాఖ్య - చిత్తూరు
 • 2016 కవికోకిల - యూనివర్సల్ ప్రిస్ క్రాస్ - చిత్తూరు జిల్లా
 • 2016 సాహిత్య రత్న అవార్డు - యూనివర్సల్ ప్రిస్ క్రాస్ - చిత్తూరు జిల్లా
 • 2016 జీవిత సాఫల్య పురస్కారం - కళాభారతి ఫౌండేషన్, రేవతి ఫౌండేషన్ - వి.కోట
 • 2017 శ్రీకృష్ణదేవరాయల జాతీయ పురస్కారం - లలిత కల సాగర్ - చిత్తూరు జిల్లా
 • 2017 శ్రీ నర్రా నరసయ్య కోటమ్మల స్మారక సాహితీ ప్రతిభా పురస్కారం - కళామిత్ర మండలి - ఒంగోలు
 • 2019 తెలుగు వెలుగు అవార్డు - పెరంబూరు తెలుగు సాహితీ సమితి - చెన్నై
 • 2019 జీవిత కాల సాఫల్య పురస్కారం - ఆంధ్ర భాషా రంజని, తెలుగు శాఖ మద్రాస్ క్రైస్తవ కళాశాల - చెన్నై


మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]