నారదగిరి లక్ష్మణదాసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నారదగిరి లక్ష్మణదాసు (సెప్టెంబరు 15, 1856 - ఆగష్టు 20, 1923) పాలమూరు జిల్లాకు చెందిన కవి, వాగ్గేయకారుడు.

జననం[మార్చు]

ఇతను సెప్టెంబరు 15, 1856 న జన్మించాడు.[1] లక్ష్మణదాసు సోదరుడు సింహయ్య కూడా కవిపండితుడు. ఇతనికి చిన్నతనంలోనే భక్తిభాగం కలిగింది. వైరాగ్యం నుంచి దూరం చేయడానికి తండ్రి 13 సంవత్సరాల వయస్సులోనే వివాహం జరిపించగా పదేళ్ళకే భార్య మరణించింది. నాగర్ కర్నూల్ ప్రాంతంలో అప్పటికి వెంకటేశ్వర స్వామి ఆలయం లేకుండటచే తిరుపతి వెళ్ళి విగ్రహం వెంట తీసుకొని వచ్చి వట్టెంలో ప్రతిష్ఠించాడు. తాను స్థాపించిన స్వామిపైనే కీర్తనలు రచించాడు. వందలాది కీర్తనలు రచించిననూ ఇప్పుడు సుమారు 200 కీర్తనలు, 50 మంగళహారతులు, కొన్ని పద్యాలు మాత్రమే ఉన్నాయి.

మరణం[మార్చు]

లక్ష్మణదాసు ఆగష్టు 20, 1923 న మరణించాడు. లక్ష్మణదాసు శిష్యులు కూడా కవులుగా, సంకీర్తనాచార్యులుగా పేరుపొందారు.

మూలాలు[మార్చు]

  1. పాలమూరు జిల్లా వాగ్గేయకారులు