బూర్గుల రంగనాథరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంతకం

కథా రచయితగా, కవిగా పేరుగాంచిన బూర్గుల రంగనాథరావు అక్టోబరు 12, 1917న జన్మించాడు. హైదరాబాదు ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు కుమారుడుడైన రంగనాథరావు బి.ఎ., ఎల్.ఎల్.బి. వరకు అభ్యసించారు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, మరాఠి, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం పొందారు. వీరు పలు గ్రంథాలు రచించడమే కాకుండా ఆకాశవాణి నుంచి వీరి చాలా కథలు, నాటికలు ప్రసారమయ్యాయి. సత్య సాయిబాబాపై రామకృష్ణారావు రచించిన శతకము "పుష్పాంజలి"లో పద్యాలు చేర్చి శతకం పూర్తిచేశారు.[1] రంగనాథరావు 2007లో మరణించారు.

మూలాలు[మార్చు]

  1. పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, రచన; ఆచార్య ఎస్వీ రామారావు, పేజీ 53