ఎలకూచి పినయాదిత్యుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎలకూచి పినయాదిత్యుడు
జననం ఎలకూచి పిన్నయ ప్రభాకరుడు
17 వ శతాబ్ది
మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు
ఇతర పేర్లు ఎలకూచి పిన్నయ ప్రభాకరుడు
ప్రసిద్ధి కవి
మతం హిందూ
తండ్రి కృష్ణ దేవుడు

ఎలకూచి పినయాదిత్యుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. ఇతను సుప్రసిద్ధ కవి ఎలకూచి బాలసరస్వతి కి స్వయాన తమ్ముడు [1] . ఇతని తండ్రి కృష్ణ దేవుడు, తాత భైరవార్యుడు. ఇతనికి ఎలకూచి పిన్నయ ప్రభాకరుడు అని మరో పేరు కూడా ఉంది. ఈ కవి క్రీ.శ. 17 వ శతాబ్దికి చెందినవాడు. మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు ప్రాంతానికి చెందినవాడు. అన్న ఎలకూచి బాల సరస్వతి ఈ సంస్థానంలోనే ఆస్థాన కవిగా కొనసాగాడు. పినయదిత్యుడు కూడా అన్న వలె విద్వత్కవే. ఆంధ్ర, గీర్వాణ విద్వాంసుడు. పలు రచనలు చేసినా, ఆదిత్య పురాణం అను గ్రంథం మాత్రం వెలుగులోకి వచ్చింది.

రచనలు[మార్చు]

  • ఆదిత్య పురాణం

ఇవీ చూడండి[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ముసునూరి వేంకటశాస్త్రి: విద్యార్థి కల్ప తరువు, రెండవ సంపుటం,వెంకట్రామ & కో. మద్రాస్,1967, పుట-635