Jump to content

చరిగొండ ధర్మన్న

వికీపీడియా నుండి
చరిగొండ ధర్మన్న

చరిగొండ ధర్మన్న పాలమూరు జిల్లాకు చెందిన కవి. చరికొండ గ్రామానికి చెందిన[1] ధర్మన్న జనన, మరణ సంవత్సరాలపై కచ్చితమైన ఆధారం లేదు కాని అతని రచనలు, మంత్రి పోషణల ప్రకారం జీవితకాలం సా.శ.1480-1530గా నిర్ణయించారు. పూర్వం చరిగొండ సీమగా పిలుబడి ప్రస్తుతం కల్వకుర్తి మండలంలో ఉన్న చారికొండ గ్రామానికి చెందిన ధర్మన్న "చిత్రభారతం" కావ్యం ద్వారా ప్రసిద్ధి చెందాడు. ఈ కావ్యాన్ని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన పెద్దన మంత్రికి అంకితం ఇవ్వడం వల్ల అతడిని ఆ జిల్లావాడుగా పరిగణించడం జరిగింది.[2] షితాబుఖానుగా పేరుపొందిన సీతాపతి మంత్రి ఎనుమలూరి పెద్దన పోషణలో ఉండి ఈ కావ్యాన్ని రచించాడు.[3] ధర్మన్న రచించిన చిత్రభారతం 8 ఆశ్వాసాల ప్రబంధం. ఇందలి కథ చిత్రవిచిత్రమైనది. అందుకే గ్రంథానికి ఆ పేరుపెట్టబడింది. చరిగొండ ధర్మన్న వంటి కవులను సాహిత్యకారులు పట్టింకోలేరు.[4] ధర్మన్న గంటకు వందపద్యాలు చెప్పగలిగే అవధాన విద్యాప్రవీణుడని అతని పద్యాలే చెబుతాయి. ధర్మన్న ‘శతలేఖిన్యవధాన పద్యరచనా సంధాన సురవూతాణ చిహ్నిత నాయుడు, శతఘంట సురవూతాణుడు’ అన్న బిరుదులు గలవాడు. గంటకు నూరు పద్యాలు అల్ల గలిగిన శతావధాని అని దీని అర్థం.[5] 17వ శతాబ్దిలో జ్యోతిష్యరత్నాకరం రచించిన చరిగొండ హోన్నయ్య కూడా ధర్మన్న వంశీయుడు. ఈయన రాసిన చిత్ర భారతము పద్యకావ్యం ప్రసిద్ధి చెందినది.

ప్రాచుర్యం

[మార్చు]
  • ధర్మన్న రచించిన చిత్రభారతం కావ్యాన్ని పళ్లె వేంకట సుబ్బారావు 1920ల్లో సంగ్రహం చేసి వచనంగా మలిచి ప్రచురించారు. దీనిని 1922లో నాటి విద్యాశాఖ విద్యార్థులకు పఠనీయ గ్రంథంగా, 1925 ట్రెయింగ్ స్కూళ్ల హైయర్ గ్రేడ్ పరీక్షకు పాఠ్యగ్రంథంగానూ నిర్ణయించారు.[6]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఎస్వీ రామారావు, పేజీ 58
  2. పాలమురు సాహితీ వైభవం, రచన ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 17
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-05. Retrieved 2013-05-19.
  4. సమగ్రాంధ్ర సాహిత్యం, ఆరుద్ర
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2013-05-19.
  6. చిత్రభారతము(రెండవకూర్పు పీఠిక):మూ.చరిగొండ ధర్మన్న, వచనం.పళ్లె వెంకట సుబ్బారావు:1923