మారన
Appearance
- మారన (ఆంగ్లము: Marana) తిక్కన శిష్యుడు,
- తెలుగులో తొలి పురాణమును అనువదించిన కవి.
- ఇతను తన మార్కండేయ గ్రంథాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని అయిన గన్నయనాయకునికి మాలిక్ మక్బూల్ అంకితమిచ్చాడు.
- ప్రతాపరుద్రుడు సా.శ.1295 నుండి సా.శ.1326 వరకూ పరిపాలించాడు.
- మారన కూడా ఆకాలం వాడే.
- మారన మార్కండేయ పురాణంని 2547 గద్యపద్యాలుగా రచించాడు.
- మారన ప్రాంతమును పూర్తిగా నిర్ధారించడానికి సరి అయిన ఆధారాలు లభించలేదు, కానీ ఆరుద్ర గారు మాత్రం తెలంగాణా ప్రాంతపు గోదావరి నదీ తీరం వాడని ఇతని రచనలోని ఓ పద్యాన్ని బట్టి ఊహించారు.
- హరశ్చంద్రోపాఖ్యానము కథయు, మనుచరిత్రమను కథయు మార్కండేయపురాణమునుండి గ్రహించినవే
- మారన కవిత్వం సలక్షణమయినదిగాను, మృదువుగాను ఉండును
- మారనకవి నాగయగన్ననిని నీతి యుగంధరుడు అని చెప్పెను
- మారన తనయాశ్వాసాంత గద్యములయందు శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజి ప్రసాదలబ్ద సరస్వతీపాత్ర తిక్కనామాత్యపుత్ర మారయనామధేయ ప్రనీతం అని చెప్పెను
- కృత్యాదిని కృతి నాయకుని వర్ణించుచూ నాతనిగూర్చి ఈ క్రింది పద్యంలో వివరించెను
చం. ఎలమిన్ బ్రతాపరుద్రమనుకజేంద్రునిచేన్ బడసిం ప్రవీణున్ డై
కొలిచియు శౌర్యలీల రిపుకోటి రణావనిన్ గీటడంచియున్
బలరిపుతుల్యవిక్రము(డు నాగయగన్న విభుండు తేజమున్
విలసితరాజ్య చిహ్నములు విశ్రుతలక్ష్మియు నాయకత్వమున్ అని చెప్పెను.
- ఈ కృతిపతి కేలికయైన ప్రతాపరుద్రుడు కాకతీయ వంశభూషణుడై జగత్ప్రసిద్ధుడయి యుండినవాడు.