నాగర్‌కర్నూల్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగర్‌కర్నూల్ జిల్లా

నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. 2016 అక్టోబరు 11న ఈ జిల్లా అవతరించింది. జిల్లాలో 20 మండలాలు, 4 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.[1]

నాగర్ కర్నూలు ముఖ్య దశలు

[మార్చు]

నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం. జడ్పీ చైర్మెన్ గా పనిచేసిన కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, 3 సార్లు ఎమ్మెల్యేగా అన్నికైన వీఎన్ గౌడ్, సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి, విమోచనోద్యమకారులు పాపయ్య పర్సా, పెంటమరాజు సుదర్శనరావు, పాలెంను అభివృద్ధి పర్చిన తోటపల్లి సుబ్రహ్మణ్యశర్మ, రచయిత పెంటమరాజు నరసింగరావు ఈ మండలానికి చెందినవారు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 74692. పాలెంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది. మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామపంచాయతీలున్నాయి. మండల పరిధిలోని ఎండబెట్ల, భీమారం, శ్రీపురంలలో పురాతనమైన దేవాలయాలున్నాయి. మండల కేంద్రం నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు కేంద్రంగా ఉంది. మండల పరిధిలోని ఎండబెట్ల, భీమారం, శ్రీపురంలలో పురాతనమైన దేవాలయాలున్నాయి.

సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరమున తాడూరు మండలం, తూర్పున టెల్కపల్లి మండలం, దక్షిణాన పెద్దకొత్తపల్లి, గోపాలపేట మండలంలు, పశ్చిమాన బిజినేపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 68538. ఇందులో పురుషులు 34960, మహిళలు 33578. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 74692. ఇందులో పురుషులు 37731, మహిళలు 36961. పట్టణ జనాభా 26759, గ్రామీణ జనాభా 47933. జనాభాలో ఇది జిల్లాలో 9వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు: మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండల కేంద్రం నుంచి కొల్లాపూర్, కల్వకుర్తి, గోపాలపేట్ లకు కూడా రహదారి సౌకర్యం ఉంది.

చరిత్ర: నాగర్‌కర్నూల్ పూర్వనామం నాగనవోలు. 1883 వరకు ఈ పట్టణం జిల్లా కేంద్రంగా పనిచేసింది. నాగన, కందన సోదరులు ఈ ప్రాంతాన్ని పాలించారు.వారి పేరిట ఈ పట్టణానికి ప్రస్తుతనామం వచ్చినట్లు కథనం ప్రచారంలో ఉంది.

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్ మండల స్థానం (ఎరుపు రంగు) రాజకీయాలు: ఈ మండలం నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటేశ్వరం మణెమ్మ విజయం సాధించారు.

విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 54 ప్రాథమిక పాఠశాలలు (1 ప్రభుత్వ, 34 మండల పరిషత్తు, 4 ప్రైవేట్ ఎయిడెడ్, 15 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 20 ప్రాథమికోన్నత పాఠశాలలు (10 మండల పరిషత్తు, 10 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 30 ఉన్నత పాఠశాలలు (3 ప్రభుత్వ, 9 జడ్పీ, 3 ప్రైవేట్ ఎయిడెడ్, 15 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 8 జూనియర్ కళాశాలలు (2 ప్రభుత్వ, 6 ప్రైవేట్) ఉన్నాయి.

వ్యవసాయం, నీటిపారుదల: మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. ప్రత్తి, వరి, వేరుశనగ, జొన్నలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 628 మిమీ. మండలంలో సుమారు 1800 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ: 1972: నాగర్‌కర్నూలులో కొత్త బస్టాండు ప్రారంభమైంది. 1979 మార్చి 10: పుట్టపర్తి సాయిబాబా పట్టణానికి విచ్చేసి సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 2011: నాగర్‌కర్నూల్‌ను మేజర్ గ్రామపంచాయతి నుంచి పురపాలక సంఘంగా హోదా పెంచబడింది 2016, అక్టోబరు 11 : ఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలో చేరింది.

తెలంగాణలోనే పేరొందిన అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్, మామిడిపండ్లకు పేరొందిన కొల్లాపూర్, ప్రాచీన రాజధాని వర్థమానపురం, ఆంజనేయస్వామి దేవాలయం ఊర్కొండ ఈ జిల్లాకు చెందినవి. ఈ ప్రతిపాదిత జిల్లాలోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లాలోనివే. ఒకప్పుడు జిల్లా పరిపాలన కేంద్రంగా పనిచేసిన నాగర్‌కర్నూల్ పట్టణం మళ్ళీ 133 సంవత్సరాల అనంతరం జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.

పటం
నాగర్‌కర్నూల్ జిల్లా

జిల్లా చరిత్ర

[మార్చు]

పూర్వం1870 సం.లో నిజాం ప్రభుత్వం నాగర్ కర్నూల్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకుంది.  అపుడు 8 తాలుకాలు ఉండేవి . 1881 నాటికి వాటి సంఖ్య 10 కి పెరిగింది. 1883 లో జిల్లా కేంద్రాన్ని మహబూబ్‌నగర్కు బదిలీ చేశారు.

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

పూర్వము నాగర్ కర్నూల్ పరిసర ప్రాంతాలను  నాగన్న,  కందన్న అనే ఇద్దరు సోదర రాజులు పాలించేవారు. సుమారు 110 లేదా 120 సంవత్సరాల క్రితం, నాగర్ కర్నూల్ దక్షిణ తెలంగాణా ప్రాంతంలో ఎక్కువ భాగం రవాణా, జిల్లా కేంద్రం. ఒక ముఖ్య కూడలిగా ఉంది. ఈ ప్రాంతంలోని  రైతులు బండ్లకు  వాడే కందెనను రాజు పేరుమీదగా విపరీతంగా అమ్మేవారు. అదే విదంగా కందెనను అమ్మే పట్టణం కందనూల్ అనే పేరు వచ్చింది. అదే పేరు కాలక్రమేన చిన్నకర్నూల్ గా మారింది. అదేవిదంగా నాగనా పేరు మీద ఒక గ్రామాన్ని ఏర్పరిచారు. దానికి నాగనూల్ అని పేరుంది. ఆ గ్రామం ఇప్పటికి కూడా నగనూల్ గానే పిలువబడుతుంది. ఆ గ్రామం నాగర్ కర్నూల్ కు 1 కి.మీ. దూరంలో ఆగ్నేయ (Southeast) దిశలో ఉంది. ఆ గ్రామం కంద,నూల్ అనే రెండు (ఇద్దరు రాజుల) పేర్ల మీదుగా నాగర్ కర్నూల్ కు ఈ పేరు వచ్చింది.

ఈ ప్రాంతాన్ని పూర్వం చాళుక్యులు,కందూరు చోడులూ కాకతీయులు, నిజాం నవాబ్లు పాలించారు. భారతదేశం లోనే రెండవ పెద్ద అడవి నల్లమల అడవి ఈ ప్రాంతం లోనే ఉంది. ఇది మొత్తం 2,48,749.55 చదరపు అడుగుల విస్తీరణంలో ఉంది. ఎంతో ప్రకృతి రమణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

జిల్లాలోని మండలాలు

[మార్చు]

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (4)

రెవెన్యూ డివిజన్లు

[మార్చు]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

హైదరాబాదు నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి ఈ జిల్లా గుండా వెళుతుంది. బిజినేపల్లి జిల్లాలోని ప్రధాన రోడ్డు కూడలి. ఇక్కడి నుంచి మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, హైదరాబాదుకు వెళ్ళు ప్రధాన మార్గాలున్నాయి. ఈ జిల్లాకు రైలుమార్గం లేదు.

జిల్లా ప్రముఖులు

[మార్చు]

వ్యవసాయ పరిశోధనా కేంద్రం

[మార్చు]

పాలెం దుంధుభి వ్యవసాయ పరిశోధనా కేంద్రం & పాల్టెక్నిక్ కళాశాల 1989 లో స్థాపించబడింది.

పుణ్యక్షేత్రాలు

[మార్చు]

సినిమా హాళ్ళు

[మార్చు]

రవి , రమణ, రామక్రిష్ణ

జిల్లా సంఘటనలు

1990 లో నుంచి నక్సల్స్ కాల్పులు మొదలైనాయి, 1991 లోయిట్ల ప్రభాకర్, 1993 లో యస్.పి పరదేసి నాయిడు..ఇలా 2006 వరకు 30 మంది పొలీసుల ఎంకౌంటర్ ఐనారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 243 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లింకులు

[మార్చు]