కసిరెడ్డి నారాయణ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కసిరెడ్డి నారాయణ రెడ్డి
కసిరెడ్డి నారాయణ రెడ్డి


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
5 జనవరి 2016 - 4 జనవరి 2022
నియోజకవర్గం మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 18 జనవరి 1964
ఖానాపూర్‌ గ్రామం, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం [1]
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కసిరెడ్డి దుర్గారెడ్డి, కిష్టమ్మ
జీవిత భాగస్వామి మాధవి
సంతానం దుర్గాప్రసాద్‌ & కృష్ణ వంశీధర్‌రెడ్డి
నివాసం వెంకటాద్రినగర్, ఆస్మాన్ ఘడ్, మలక్‌పేట్, హైదరాబాద్

కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2016లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్​నగర్​ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

కసిరెడ్డి నారాయణరెడ్డి 1964 జనవరి 18లో తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం, ఖానాపూర్‌ గ్రామం లో కసిరెడ్డి దుర్గారెడ్డి, కిష్టమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఖానాపూర్‌ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు చుక్కాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో, తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతి వరకు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. కసిరెడ్డి నారాయణరెడ్డి షాద్‌నగర్‌ లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు, హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేసి, రాజస్థాన్‌లోని సింగానియా యూనివర్సిటీ నుండి ఎంటెక్‌ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం[మార్చు]

కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్నప్పుడు ఖర్చుల కోసం టెన్త్, ఇంటర్‌ విద్యార్థులకు ట్యూషన్‌ చెప్పేవాడు. ఆ సమయంలోనే ఒక స్కూల్ పెట్టాలని ఆలోచన ఏర్పడడంతో, ఎంటెక్‌ పూర్తి చేశాక 1986–87లో హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ లో బ్రిలియంట్‌ గ్రామర్‌ హైస్కూల్‌ ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 64 బ్రిలియంట్‌ గ్రామాల్‌ స్కూళ్లను ఏర్పాటు చేశాడు. ఆయనకు మూడు ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి.

రాజకీయ జీవితం[మార్చు]

కసిరెడ్డి నారాయణరెడ్డి 2014లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టికెట్ ఆశించాడు, టికెట్ రాకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచాడు. నారాయణరెడ్డి 2016లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన 2016లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్​నగర్​ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందాడు.[2] నారాయణరెడ్డి 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ టికెట్ ఆశించాడు, కానీ టికెట్ దక్కలేదు.[3][4]

తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండవసారి ఆయన పేరును టిఆర్ఎస్ అధిష్టానం 22 నవంబర్ 2021న ఖరారు చేసింది. ఆయన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవంబర్ 23న నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశాడు. [5] ఆయన మహబూబ్​నగర్​ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై నవంబర్ 26న గెలుపు పత్రాన్ని అందుకున్నాడు.[6]కసిరెడ్డి నారాయణరెడ్డి 27 జనవరి 2021న ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు.[7]

మూలాలు[మార్చు]

  1. Sakshi (14 July 2019). "విద్యతోనే సమాజాభివృద్ధి". Sakshi. Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
  2. Sakshi Post (30 December 2015). "TRS Wins 4 MLC Seats, Congress Grabs Nalgonda, Mahbubnagar". Sakshi Post (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
  3. Sakshi (1 November 2018). "కేటీఆర్‌ హామీతో అలకవీడిన ఎమ్మెల్సీ". Sakshi. Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
  4. The Hans India (22 August 2020). "MLC Kasireddy Narayan Reddy calls on KTR, discusses civic issues". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
  5. Sakshi (23 November 2021). "నిజామాబాద్‌ నుంచి పోటీకే కవిత మొగ్గు". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  6. Andhrajyothy (26 November 2021). "పాలమూరు ఎమ్మెల్సీలకు గెలుపు పత్రాలు అందజేత". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  7. Namasthe Telangana (27 January 2022). "ఎమ్మెల్సీగా కసిరెడ్డి ప్రమాణ స్వీకారం." Archived from the original on 27 January 2022. Retrieved 27 January 2022.