ఎడ్మ కిష్టారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎడ్మ కిష్టారెడ్డి
ఎడ్మ కిష్టారెడ్డి

పదవీ కాలం
1994-1999, 2004-2009
నియోజకవర్గం కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం మార్చి 22, 1947
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
భారత్ రాష్ట్ర సమితి (జూన్ 9, 2018 - ఆగస్టు 18, 2020)

ఎడ్మ కిష్టారెడ్డి (మార్చి 22, 1947 - ఆగస్టు 18, 2020) తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండుసార్లు (1994-1999, 2004-2009) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

జీవిత విషయాలు[మార్చు]

కృష్ణారెడ్డి 1947, మార్చి 22న జన్మించాడు.

రాజకీయరంగం[మార్చు]

వ్యవసాయం వృత్తి కలిగిన కిష్టారెడ్డి గవర్నరుగా పనిచేసిన సత్యనారాయణ శిష్యునిగా రాజకీయప్రవేశం చేశాడు. కల్వకుర్తి పంచాయతి వార్డు సభ్యునిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించి, సర్పంచిగా, మండల అధ్యక్షులుగా పనిచేశాడు. 1977 అత్యవసరపరిస్థితి కాలంలో జైలుకి వెళ్ళినాడు. 1986లో తెలుగుదేశం పార్టీ తరఫున కల్వకుర్తి మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి, మరో స్వతంత్ర అభ్యర్ధి డి.గోపాల్ రెడ్డిపై గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుర్తి నియోజకవర్గం నుండి పోటిచేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో 3,403 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. వై.యస్. రాజశేఖరరెడ్డి అనుచరుడిగా 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుర్తి నియోజకవర్గం నుండి పోటిచేసి, భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి తల్లోజు ఆచారిపై 22117 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుర్తి నియోజకవర్గం నుండి పోటిచేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో 600 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

తెలంగాణ రాక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశాడు. 2018, జూన్ 9న టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[2]

మరణం[మార్చు]

కృష్ణారెడ్డి గొంతు సమస్యతో హైదరాబాదులోని ఒమేగా దవాఖానలో చికిత్స పొందుతూ 2020, ఆగస్టు 18న మరణించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 నమస్తే తెలంగాణ, వార్తలు (18 August 2020). "కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత". ntnews. Archived from the original on 18 August 2020. Retrieved 18 August 2020.
  2. టివి9 తెలుగు, వార్తలు (18 August 2020). "కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి". Archived from the original on 18 August 2020. Retrieved 18 August 2020.