Jump to content

దుందుభి

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

దుందుభి తెలుగు సంవత్సరాలలో 56వ సంవత్సరం. ఇది సా.శ. 1922-1923, 1982-1983, 2042-43 లలో వచ్చిన తెలుగు సంవత్సరానికి దుందుభి అని పేరు.[1] దీనికి ముందు సంవత్సరం దుర్ముఖి, తరువాతి సంవత్సరం రుధిరోద్గారి.[2] దుందుభి అనగా వరుణుడు అని అర్థం.

1982 : దుందుభి నామ సంవత్సరం 26 మార్చి 1982 శుక్రవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో  ప్రారంభమై  14 ఏప్రిల్ 1983 గురువారం రుధిరోద్గరి నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.

తెలుగు సంవత్సరాలు

[మార్చు]

తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.

ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[3]  క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి.  ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[4] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.

వివిధ సంవత్సరాలలో "దుందుభి"

[మార్చు]
తెలుగు సంవత్సరం పేరు క్రీస్తు శకం సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ..
56 దుందుభి 62-63 122-123 182-183 242-243 302-303 362-363 422-423 482-483 542-543 602-603 662-663 722-723 782-783 842-843 902-903 962-963 1022-1023 1082-1083 1142-1143 1202-1203 1262-1263 1322-1323 1382-1383 1442-1443 1502-1503 1562-1563 1622-1623 1682-1683 1742-1743 1802-1803 1862-1863 1922-1923 1982-1983 2042-2043 2102-2103 2162-2163 2222-2223 2282-2283 2342-2343 2402-2403 2462-2463 2522-2523 2582-2583 2642-2643 2702-2703 2762-2763 2822-2823

సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]
  • అల్లు అర్జున్ తెలుగు సినిమా అగ్ర నటుడు. (జ.1982 ఏప్రిల్ 8)
  • పూజారి శైలజ (జననం 1982 జూన్ 12 ) భారతీయ మహిళా వెయిట్ లిప్టర్. ఆమె అంతర్జాతీయ పోటీలలో 75 కిలోల విభాగంలో ప్రాతినిధ్యం వహించింది. ఆమె 2005 వరల్డ్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్‌షిప్స్ లో పాల్గొన్నది.[5]
  • అల్లరి నరేష్ : 1982 జూన్ 30, తెలుగు సినిమానటుడు.
  • ప్రియాంక చోప్రా (జ. 1982 జూలై 18)[6] భారతీయ నటి, మాజీ ప్రపంచ సుందరి.
  • యామిని రెడ్డి (జననం 1982 సెప్టెంబరు 1) కూచిపూడి నాట్యకారిణి, ఉపాధ్యాయురాలు, కొరియోగ్రాఫర్.
  • 1982, సెప్టెంబర్ 28న పంజాబ్ లోని మొహాలీ జిల్లా జీరక్‌పూర్‌లో (ఛండీగఢ్ పక్కన) జన్మించిన అభినవ్ బింద్రా భారతదేశపు ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు.

మరణాలు

[మార్చు]
  • సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి (డిసెంబర్ 10, 1897 - అక్టోబర్ 14, 1982) ప్రముఖ తెలుగు పండిత కవులు.
  • అక్కమ్మ చెరియన్, భారత స్వాతంత్ర్య సమరయోధురాలు.[7][8] (మ.1982 మే 5)
  • ఎస్.కె.పొట్టెక్కాట్ గా ప్రాచుర్యం చెందిన శంకరన్ కుట్టి పొట్టెక్కాట్, (1913 మార్చి 14 – 1982 ఆగస్టు 6) కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళ రచయిత.
  • గోపాల్ స్వరూప్ పాఠక్ (1896 ఫిబ్రవరి 24 -1982 అక్టోబరు 4) భారతదేశానికి నాలుగవ ఉపరాష్ట్రపతిగా 1969 ఆగస్టు నుండి 1974 ఆగస్టు మధ్యలో పనిచేశాడు.
  • చెరబండరాజు (1944 - జూలై 2, 1982[9]) కలం పేరుతో దిగంబరకవులలో ఒకనిగా సుపరిచితమైన "బద్ధం భాస్కరరెడ్డి"[10] ఆలోచన, అక్షరం, ఆచరణ ఏక రూపం దాల్చిన విప్లవ కవి, నవలా రచయిత, పాటల రచయిత.[11]

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ JSK. "మీరు పుట్టిన తెలుగు సంవత్సరం ఏమిటో మీకు తెలుసా?". telugu.webdunia.com. Retrieved 2023-02-18.
  2. ↑ "Facts: 60 తెలుగు సంవత్సరాలు పేర్లు Telugu Years Names or Samvatsaralu in English". ExamTray (in ఇంగ్లీష్). Archived from the original on 2019-11-02. Retrieved 2023-02-18.
  3. ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
  4. ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
  5. ↑ "2005 Weightlifting World Championships - Sailaja Pujari". iwf.net. Archived from the original on 24 మే 2016. Retrieved 23 June 2016.
  6. ↑ liveindia.com ప్రొఫైల్ Archived 2010-03-12 at the Wayback Machine. జనవరి 14, 2006న తిరిగి పొందబడింది
  7. ↑ "ROLE OF WOMEN IN KERALA POLITICS REFORMS AMENDMENT ACT 1969 A STUDY IN SOCIAL CHANGE". Journal of Kerala Studies. University of Kerala. 1985. p. 21.
  8. ↑ K. Karunakaran Nair,Editor and Convenor, Regional Records Survey Committee, Kerala State (1975). Who is who of Freedom Fighters in Kerala. K. Karunakaran Nair. p. 89. {{cite book}}: |author= has generic name (help)CS1 maint: multiple names: authors list (link)
  9. ↑ Vaḍali Mandēśvararāvu (1998). Modern Poetry in Telugu. V. Mandeswara Rao. p. 43. Retrieved 13 November 2018.
  10. ↑ Datta, Amaresh (2005). Encyclopedia of Indian Literature. New Delhi: Sahitya Akademi. pp. 1043–1044. ISBN 978-81-260-1194-0.
  11. ↑ "Showcasing great Telugu literature". The Hans India. 23 Dec 2016. Retrieved 1 Sep 2018.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దుందుభి&oldid=4765675" నుండి వెలికితీశారు