రుధిరోద్గారి
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
తెలుగు సంవత్సరాలలో రుధిరోద్గారి 57వ సంవత్సరం. ఇది 60 సంవత్సరాలకొకసారి వస్తుంది.[1] సా.శ. 1983-1984-2044 లలో వచ్చిన తెలుగు సంవత్సరానికి రుధిరోద్గారి అని పేరు. దీని ముందు సంవత్సరం దుందుభి. తర్వాతి సంవత్సరం రక్తాక్షి. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
1983 : రుధిరోద్గరి నామ సంవత్సరం 14 ఏప్రిల్ 1983 గురువారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 2 ఏప్రిల్ 1984 సోమవారం రక్తాక్షి నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[2] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[3] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "రుధిరోద్గారి"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 57 | రుధిరోద్గారి | 63-64 | 123-124 | 183-184 | 243-244 | 303-304 | 363-364 | 423-424 | 483-484 | 543-544 | 603-604 | 663-664 | 723-724 | 783-784 | 843-844 | 903-904 | 963-964 | 1023-1024 | 1083-1084 | 1143-1144 | 1203-1204 | 1263-1264 | 1323-1324 | 1383-1384 | 1443-1444 | 1503-1504 | 1563-1564 | 1623-1624 | 1683-1684 | 1743-1744 | 1803-1804 | 1863-1864 | 1923-1924 | 1983-1984 | 2043-2044 | 2103-2104 | 2163-2164 | 2223-2224 | 2283-2284 | 2343-2344 | 2403-2404 | 2463-2464 | 2523-2524 | 2583-2584 | 2643-2644 | 2703-2704 | 2763-2764 | 2823-2824 |
సంఘటనలు
[మార్చు]- శ్రీరామునికి సీతాదేవితో వివాహం తదనంతరం 12సంవత్సరములు అయోధ్యలో సుఖజీవనం తదుపరి రుధిరోద్గారి సంవత్సర చైత్ర శుక్ల పంచమి నీచ స్థితి ఉన్న బుధదశలో వనవాస ప్రారంభం అవుతుంది.[4]
- 1924 - పుష్య మాసంలో భారతి (మాస పత్రిక) స్థాపించబడింది.
జననాలు
[మార్చు]- 1923 భాద్రపద శుద్ధ పంచమి :ఎన్.సి.హెచ్.కృష్ణమాచార్యులు - అష్టావధాని, వాయులీన విద్వాంసుడు.[5]
- సా.శ.. 1923 : ఉత్తరాయణం, గ్రీష్మఋుతువు, అధిక జ్యేష్ట మాసం, సోమవారం శుక్ల-త్రయోదశి : నందమూరి తారక రామారావు - తెలుగు నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.
మరణాలు
[మార్చు]- 1803 మార్గశిర బహుళ నవమి : కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ యోగిని. తాత్విక రచనలు చేసింది. (జ.1705)[6]
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ JSK. "తెలుగు సంవత్సరాలు 60... తెలుసుకోవాల్సినదంతా ఇక్కడే ఉంది..." telugu.webdunia.com. Retrieved 2020-09-25.
- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ "శ్రీ రామ జనన సంవత్సర(విళంబి నామ సంవత్సర) కళ్యాణ వైభవ మహోత్సవము - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-09-25.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 327.
- ↑ కె.జనార్దనం (1990). రాయలసీమ పదకవులు (1 ed.). కార్వేటి నగరం: కె.సుచరిత. p. 34. Retrieved 22 April 2020.