Jump to content

తెలుగు సంవత్సరాలు

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

పురాణగాధ

[మార్చు]

తెలుగు సంవ‌త్స‌రాల వెనుక ఓ కథ ఉంది. నారద మహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన సంతానంతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి

ఆధ్యాత్మిక సంబంధ కథనం

[మార్చు]

మనం సౌరమానంలో జీవిస్తున్నాం ఏదైనా బిందువు దగ్గర నుంచి చుట్టు తిరిగితే 360 డిగ్రీలు పూర్తవుతుంది. కేంద్రం నుంచి మనిషి గమనిస్తే ముందు 180 డిగ్రీలు వెనక 180 డిగ్రీలూ అన్నమాట, వెనక వున్న గతం 180 డిగ్రీలూ గతం నిలబడిన రేఖ వర్తమానం ముందున్నవి భవిష్యత్ సూచకాలు. కృత త్రేతా ద్వాపర యుగాలకంటే మానవ ఆయుర్ధాయం పడిపోయి కేవలం 120 సంవత్సరాలకు వచ్చిందట. అందుకే 60 ఏళ్ళు పూర్తవగానే సగం జీవితం పూర్తయ్యిందని గుర్తుచేస్తూ లోకసంభంద విషయాలు పూర్తిచేసుకొమ్మని షష్టిపూర్తి ఉత్సవంగా చేస్తారు. అంటే మిగిలిన 60 ఏళ్లు తరువాతి తరాలకు మార్గదర్శనం చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో బ్రతకాలని చెప్పకనే చెప్తున్నారన్నమాట. ఈ అరవై సంవత్సరాల వలయంలో వారు పుట్టిన సంవత్సరం నుంచి 60 పూర్తికావడాన్ని వలయ సంపూర్తిగా తెలుస్తుంది.

జ్యోతిష సంబంధ వివరణ

[మార్చు]

జ్యోతిష శాస్త్రం ప్రకారం తీసుకుంటే ద్విశతోత్తరి దశ అనే ప్రమాణంలో 120 సంవత్సరాలను సూచిస్తుంది. నవ గ్రహాలు వాటి వాటి వ్యాపనం రీత్యా ఆయుర్ధాయాన్ని పంుకుంటే మొత్తంగా 120 ఆయుష్షు మానవుడిది అని లెక్కకు వస్తుంది. దానితో పాటు అరవై సంవత్సరాలకు ఒకసారి మానవుడి మనో ధర్మాలతో పాటు మానవ ధర్మాల విషయంలోనూ మార్పులు వస్తాయి. మానవుడి బుద్ధి శక్తి కూడా 60 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. క్రమంగా జ్ఞాపక శక్తి క్షీణిస్తూ వుస్తుంది. శరీరంలో కండరాలు కరిగిపోతాయి. అరవై సంవత్సరాల లోపు మృత్యుశక్తి ఒకసారి ప్రభావం చూపుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెపుతారు. అంటే ఏదోవిధమైన ప్రాణాపాయం దగ్గరకు వచ్చి వెళుతుందన్నమాట. అరవై సంవత్సరాలనుంచి ప్రతిపదేళ్ళకూ ఈ మృత్యుశక్తి పలకరిస్తూ వుంటుందట. అరవై ఏళ్ళ తర్వాత సంవత్సర చక్రం పూర్తయినట్లే మనిషి రెండో బాల్య దశకు వస్తాడట. చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగటం అవీ ఇవీ తినాలనే కోరిక కలగటం, ఎక్కువ సేపు నిద్రపోవడం, చిన్న చిన్న విషయాలకే ఆనంద పడటం. కోపం తెచ్చుకోవడం, కన్నీళ్ళు పెట్టుకోవడం వంటి బాల్య చేష్టలన్నీ 60 తర్వాత మళ్ళీ ప్రారంభం అవుతాయి. అప్పటి నుంచి ప్రతిబిడ్డ తన తల్లి దండ్రులను బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెపుతుంది.

గ్రెగోరియన్ కేలండర్ సా.శ.. క్యాలెండర్ ప్రకారం సంవత్సరాల పేర్లు

[మార్చు]
వాశిష్టీపుత్ర శాతకర్ణి యొక్క వెండి నాణెం (సా.శ..160).
ముందు: రాజముఖం. అశోకుని కాలమునాటి బ్రాహ్మీలిపిలో ప్రాకృతం: శిరి శాతకనీస రానో ... వసితిపుతస.
వెనుక: ఎడమవైపు ఉజ్జయినీ/శాతవాహన చిహ్నం. కుడివైపు ఆరు అర్ధచంద్రాకారపు ఆర్చులతో చైత్యగిరి. క్రింది భాగములో నది. తెలుగు బ్రాహ్మీ లిపిలో: అరహనకు వహిత్తి మకనకు తిరు హతకనికో.

హిందూ కాలగణన (Hindu calendar) కాలక్రమాన అనేక మార్పులు చెందింది. ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలున్నాయి. అధికంగా హిందూ కాలగణన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంది. ఇది సుమారుగా సా.శ.. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు. ఇది వేదాంగాలలో ఒకటైన జ్యోతిషం అనే భాగంగా పరిగణింపబడుతుంది. ఆర్యభట్టుడు (సా.శ.. 499), వరాహమిహిరుడు (6వ శతాబ్దం), భాస్కరాచార్యుడు (12వ శతాబ్దం) వంటి జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఈ కాలగణనను మరింత అభివృద్ధి చేశారు. సంవత్సరాలు గణన చెయ్యడం కోసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వివిధమైన శకాలు ఆచరణలో ఉన్నాయి. కలి శకం, (క్రీస్తుశకం+3101) శాలివాహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం, ఆది శంకర భగవత్పాదుల శకం, శ్రీకృష్ణదేవరాయల శకం మొదలైనవి. మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్రలో పేరుపొందిన వారి పేరుతో వాడుట పరిపాటి. వీటిలో ఎక్కువగా వాడబడుతున్న క్రీస్తు శకం ఒకటిగాక, భారతదేశంలో ప్రామాణికమైనది శాలివాహనశకం. ఇది హిందూ కాలమానం, భారతజాతీయ కాలమానం, కంబోడియా బౌద్ధ కాలమానంగా వాడబడుతున్నది. ఇది శాతవాహనులలో ప్రముఖుడైన హాలశాతవాహనుని రాజ్యకాలంలో శకనులపై విజయం సాధించిన సంవత్సరం నుండి ప్రారంభమైనది. ఇది సా.శ.. 78 లో ప్రారంభమైంది.[1] దీనికి ముందు విక్రమశకం క్రీ పూ 56 నుండి వాడుకలో వుండేది. "హిజ్రీ శకా"నికి మూలం ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్. మహమ్మదు ప్రవక్త , అతని అనుయాయులు మక్కా నుండి మదీనా కు సా.శ.. 622 లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.

సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది.

  • క్రీస్తుశకం - క్రీస్తు జననం నుంచి (సా.శ.. 1)
  • విక్రమశకం - విక్రమాదిత్యుడు పట్టాభిషిక్తుడైన నాటి నుంచి (క్రీ.పూ. 57)
  • శాలివాహనశకం - శాతవాహనులలో పేరొందిన హాలశాతవాహనుని రాజ్యకాలంలో శకనులపై విజయం సాధించినప్పటి నుండి (సా.శ.. 78)

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

తెలుగు సంవత్సరం పేరు క్రీస్తు శకం సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ..
1 ప్రభవ 07-08 67-68 127-128 187-188 247-248 307-308 367-368 427-428 487-488 547-548 607-608 667-668 727-728 787-788 847-848 907-908 967-968 1027-1028 1087-1088 1147-1148 1207-1208 1267-1268 1327-1328 1387-1388 1447-1448 1507-1508 1567-1568 1627-1628 1687-1688 1747-1748 1807-1808 1867-1868 1927-1928 1987-1988 2047-2048 2107-2108 2167-2168 2227-2228 2287-2288 2347-2348 2407-2408 2467-2468 2527-2528 2587-2588 2647-2648 2707-2708 2767-2768
2 విభవ 08-09 68-69 128-129 188-189 248-249 308-309 368-369 428-429 488-489 548-549 608-609 668-669 728-729 788-789 848-849 908-909 968-969 1028-1029 1088-1089 1148-1149 1208-1209 1268-1269 1328-1329 1388-1389 1448-1449 1508-1509 1568-1569 1628-1629 1688-1689 1748-1749 1808-1809 1868-1869 1928-1929 1988-1989 2048-2049 2108-2109 2168-2169 2228-2229 2288-2289 2348-2349 2408-2409 2468-2469 2528-2529 2588-2589 2648-2649 2708-2709 2768-2769
3 శుక్ల 09-10 69-70 129-130 189-190 249-250 309-310 369-370 429-430 489-490 549-550 609-610 669-670 729-730 789-790 849-850 909-910 969-970 1029-1030 1089-1090 1149-1150 1209-1210 1269-1270 1329-1330 1389-1390 1449-1450 1509-1510 1569-1570 1629-1630 1689-1690 1749-1750 1809-1810 1869-1870 1929-1930 1989-1990 2049-2050 2109-2110 2169-2170 2229-2230 2289-2290 2349-2350 2409-2410 2469-2470 2529-2530 2589-2590 2649-2650 2709-2710 2769-2770
4 ప్రమోదూత 10-11 70-71 130-131 190-191 250-251 310-311 370-371 430-431 490-491 550-551 610-611 670-671 730-731 790-791 850-851 910-911 970-971 1030-1031 1090-1091 1150-1151 1210-1211 1270-1271 1330-1331 1390-1391 1450-1451 1510-1511 1570-1571 1630-1631 1690-1691 1750-1751 1810-1811 1870-1871 1930-1931 1990-1991 2050-2051 2110-2111 2170-2171 2230-2231 2290-2291 2350-2351 2410-2411 2470-2471 2530-2531 2590-2591 2650-2651 2710-2711 2770-2771
5 ప్రజోత్పత్తి 11-12 71-72 131-132 191-192 251-252 311-312 371-372 431-432 491-492 551-552 611-612 671-672 731-732 791-792 851-852 911-912 971-972 1031-1032 1091-1092 1151-1152 1211-1212 1271-1272 1331-1332 1391-1392 1451-1452 1511-1512 1571-1572 1631-1632 1691-1692 1751-1752 1811-1812 1871-1872 1931-1932 1991-1992 2051-2052 2111-2112 2171-2172 2231-2232 2291-2292 2351-2352 2411-2412 2471-2472 2531-2532 2591-2592 2651-2652 2711-2712 2771-2772
6 అంగీరస 12-13 72-73 132-133 192-193 252-253 312-313 372-373 432-433 492-493 552-553 612-613 672-673 732-733 792-793 852-853 912-913 972-973 1032-1033 1092-1093 1152-1153 1212-1213 1272-1273 1332-1333 1392-1393 1452-1453 1512-1513 1572-1573 1632-1633 1692-1693 1752-1753 1812-1813 1872-1873 1932-1933 1992-1993 2052-2053 2112-2113 2172-2173 2232-2233 2292-2293 2352-2353 2412-2413 2472-2473 2532-2533 2592-2593 2652-2653 2712-2713 2772-2773
7 శ్రీముఖ 13-14 73-74 133-134 193-194 253-254 313-314 373-374 433-434 493-494 553-554 613-614 673-674 733-734 793-794 853-854 913-914 973-974 1033-1034 1093-1094 1153-1154 1213-1214 1273-1274 1333-1334 1393-1394 1453-1454 1513-1514 1573-1574 1633-1634 1693-1694 1753-1754 1813-1814 1873-1874 1933-1934 1993-1994 2053-2054 2113-2114 2173-2174 2233-2234 2293-2294 2353-2354 2413-2414 2473-2474 2533-2534 2593-2594 2653-2654 2713-2714 2773-2774
8 భావ 14-15 74-75 134-135 194-195 254-255 314-315 374-375 434-435 494-495 554-555 614-615 674-675 734-735 794-795 854-855 914-915 974-975 1034-1035 1094-1095 1154-1155 1214-1215 1274-1275 1334-1335 1394-1395 1454-1455 1514-1515 1574-1575 1634-1635 1694-1695 1754-1755 1814-1815 1874-1875 1934-1935 1994-1995 2054-2055 2114-2115 2174-2175 2234-2235 2294-2295 2354-2355 2414-2415 2474-2475 2534-2535 2594-2595 2654-2655 2714-2715 2774-2775
9 యువ 15-16 75-76 135-136 195-196 255-256 315-316 375-376 435-436 495-496 555-556 615-616 675-676 735-736 795-796 855-856 915-916 975-976 1035-1036 1095-1096 1155-1156 1215-1216 1275-1276 1335-1336 1395-1396 1455-1456 1515-1516 1575-1576 1635-1636 1695-1696 1755-1756 1815-1816 1875-1876 1935-1936 1995-1996 2055-2056 2115-2116 2175-2176 2235-2236 2295-2296 2355-2356 2415-2416 2475-2476 2535-2536 2595-2596 2655-2656 2715-2716 2775-2776
10 ధాత 16-17 76-77 136-137 196-197 256-257 316-317 376-377 436-437 496-497 556-557 616-617 676-677 736-737 796-797 856-857 916-917 976-977 1036-1037 1096-1097 1156-1157 1216-1217 1276-1277 1336-1337 1396-1397 1456-1457 1516-1517 1576-1577 1636-1637 1696-1697 1756-1757 1816-1817 1876-1877 1936-1937 1996-1997 2056-2057 2116-2117 2176-2177 2236-2237 2296-2297 2356-2357 2416-2417 2476-2477 2536-2537 2596-2597 2656-2657 2716-2717 2776-2777
11 ఈశ్వర 17-18 77-78 137-138 197-198 257-258 317-318 377-378 437-438 497-498 557-558 617-618 677-678 737-738 797-798 857-858 917-918 977-978 1037-1038 1097-1098 1157-1158 1217-1218 1277-1278 1337-1338 1397-1398 1457-1458 1517-1518 1577-1578 1637-1638 1697-1698 1757-1758 1817-1818 1877-1878 1937-1938 1997-1998 2057-2058 2117-2118 2177-2178 2237-2238 2297-2298 2357-2358 2417-2418 2477-2478 2537-2538 2597-2598 2657-2658 2717-2718 2777-2778
12 బహుధాన్య 18-19 78-79 138-139 198-199 258-259 318-319 378-379 438-439 498-499 558-559 618-619 678-679 738-739 798-799 858-859 918-919 978-979 1038-1039 1098-1099 1158-1159 1218-1219 1278-1279 1338-1339 1398-1399 1458-1459 1518-1519 1578-1579 1638-1639 1698-1699 1758-1759 1818-1819 1878-1879 1938-1939 1998-1999 2058-2059 2118-2119 2178-2179 2238-2239 2298-2299 2358-2359 2418-2419 2478-2479 2538-2539 2598-2599 2658-2659 2718-2719 2778-2779
13 ప్రమాది 19-20 79-80 139-140 199-200 259-260 319-320 379-380 439-440 499-500 559-560 619-620 679-680 739-740 799-800 859-860 919-920 979-980 1039-1040 1099-1100 1159-1160 1219-1220 1279-1280 1339-1340 1399-1400 1459-1460 1519-1520 1579-1580 1639-1640 1699-1700 1759-1760 1819-1820 1879-1880 1939-1940 1999-2000 2059-2060 2119-2120 2179-2180 2239-2240 2299-2300 2359-2360 2419-2420 2479-2480 2539-2540 2599-2600 2659-2660 2719-2720 2779-2780
14 విక్రమ 20-21 80-81 140-141 200-201 260-261 320-321 380-381 440-441 500-501 560-561 620-621 680-681 740-741 800-801 860-861 920-921 980-981 1040-1041 1100-1101 1160-1161 1220-1221 1280-1281 1340-1341 1400-1401 1460-1461 1520-1521 1580-1581 1640-1641 1700-1701 1760-1761 1820-1821 1880-1881 1940-1941 2000-2001 2060-2061 2120-2121 2180-2181 2240-2241 2300-2301 2360-2361 2420-2421 2480-2481 2540-2541 2600-2601 2660-2661 2720-2721 2780-2781
15 వృష 21-22 81-82 141-142 201-202 261-262 321-322 381-382 441-442 501-502 561-562 621-622 681-682 741-742 801-802 861-862 921-922 981-982 1041-1042 1101-1102 1161-1162 1221-1222 1281-1282 1341-1342 1401-1402 1461-1462 1521-1522 1581-1582 1641-1642 1701-1702 1761-1762 1821-1822 1881-1882 1941-1942 2001-2002 2061-2062 2121-2122 2181-2182 2241-2242 2301-2302 2361-2362 2421-2422 2481-2482 2541-2542 2601-2602 2661-2662 2721-2722 2781-2782
16 చిత్రభాను 22-23 82-83 142-143 202-203 262-263 322-323 382-383 442-443 502-503 562-563 622-623 682-683 742-743 802-803 862-863 922-923 982-983 1042-1043 1102-1103 1162-1163 1222-1223 1282-1283 1342-1343 1402-1403 1462-1463 1522-1523 1582-1583 1642-1643 1702-1703 1762-1763 1822-1823 1882-1883 1942-1943 2002-2003 2062-2063 2122-2123 2182-2183 2242-2243 2302-2303 2362-2363 2422-2423 2482-2483 2542-2543 2602-2603 2662-2663 2722-2723 2782-2783
17 స్వభాను 23-24 83-84 143-144 203-204 263-264 323-324 383-384 443-444 503-504 563-564 623-624 683-684 743-744 803-804 863-864 923-924 983-984 1043-1044 1103-1104 1163-1164 1223-1224 1283-1284 1343-1344 1403-1404 1463-1464 1523-1524 1583-1584 1643-1644 1703-1704 1763-1764 1823-1824 1883-1884 1943-1944 2003-2004 2063-2064 2123-2124 2183-2184 2243-2244 2303-2304 2363-2364 2423-2424 2483-2484 2543-2544 2603-2604 2663-2664 2723-2724 2783-2784
18 తారణ 24-25 84-85 144-145 204-205 264-265 324-325 384-385 444-445 504-505 564-565 624-625 684-685 744-745 804-805 864-865 924-925 984-985 1044-1045 1104-1105 1164-1165 1224-1225 1284-1285 1344-1345 1404-1405 1464-1465 1524-1525 1584-1585 1644-1645 1704-1705 1764-1765 1824-1825 1884-1885 1944-1945 2004-2005 2064-2065 2124-2125 2184-2185 2244-2245 2304-2305 2364-2365 2424-2425 2484-2485 2544-2545 2604-2605 2664-2665 2724-2725 2784-2785
19 పార్థివ 25-26 85-86 145-146 205-206 265-266 325-326 385-386 445-446 505-506 565-566 625-626 685-686 745-746 805-806 865-866 925-926 985-986 1045-1046 1105-1106 1165-1166 1225-1226 1285-1286 1345-1346 1405-1406 1465-1466 1525-1526 1585-1586 1645-1646 1705-1706 1765-1766 1825-1826 1885-1886 1945-1946 2005-2006 2065-2066 2125-2126 2185-2186 2245-2246 2305-2306 2365-2366 2425-2426 2485-2486 2545-2546 2605-2606 2665-2666 2725-2726 2785-2786
20 వ్యయ 26-27 86-87 146-147 206-207 266-267 326-327 386-387 446-447 506-507 566-567 626-627 686-687 746-747 806-807 866-867 926-927 986-987 1046-1047 1106-1107 1166-1167 1226-1227 1286-1287 1346-1347 1406-1407 1466-1467 1526-1527 1586-1587 1646-1647 1706-1707 1766-1767 1826-1827 1886-1887 1946-1947 2006-2007 2066-2067 2126-2127 2186-2187 2246-2247 2306-2307 2366-2367 2426-2427 2486-2487 2546-2547 2606-2607 2666-2667 2726-2727 2786-2787
21 సర్వజిత్తు 27-28 87-88 147-148 207-208 267-268 327-328 387-388 447-448 507-508 567-568 627-628 687-688 747-748 807-808 867-868 927-928 987-988 1047-1048 1107-1108 1167-1168 1227-1228 1287-1288 1347-1348 1407-1408 1467-1468 1527-1528 1587-1588 1647-1648 1707-1708 1767-1768 1827-1828 1887-1888 1947-1948 2007-2008 2067-2068 2127-2128 2187-2188 2247-2248 2307-2308 2367-2368 2427-2428 2487-2488 2547-2548 2607-2608 2667-2668 2727-2728 2787-2788
22 సర్వధారి 28-29 88-89 148-149 208-209 268-269 328-329 388-389 448-449 508-509 568-569 628-629 688-689 748-749 808-809 868-869 928-929 988-989 1048-1049 1108-1109 1168-1169 1228-1229 1288-1289 1348-1349 1408-1409 1468-1469 1528-1529 1588-1589 1648-1649 1708-1709 1768-1769 1828-1829 1888-1889 1948-1949 2008-2009 2068-2069 2128-2129 2188-2189 2248-2249 2308-2309 2368-2369 2428-2429 2488-2489 2548-2549 2608-2609 2668-2669 2728-2729 2788-2789
23 విరోధి 29-30 89-90 149-150 209-210 269-270 329-330 389-390 449-450 509-510 569-570 629-630 689-690 749-750 809-810 869-870 929-930 989-990 1049-1050 1109-1110 1169-1170 1229-1230 1289-1290 1349-1350 1409-1410 1469-1470 1529-1530 1589-1590 1649-1650 1709-1710 1769-1770 1829-1830 1889-1890 1949-1950 2009-2010 2069-2070 2129-2130 2189-2190 2249-2250 2309-2310 2369-2370 2429-2430 2489-2490 2549-2550 2609-2610 2669-2670 2729-2730 2789-2790
24 వికృతి 30-31 90-91 150-151 210-211 270-271 330-331 390-391 450-451 510-511 570-571 630-631 690-691 750-751 810-811 870-871 930-931 990-991 1050-1051 1110-1111 1170-1171 1230-1231 1290-1291 1350-1351 1410-1411 1470-1471 1530-1531 1590-1591 1650-1651 1710-1711 1770-1771 1830-1831 1890-1891 1950-1951 2010-2011 2070-2071 2130-2131 2190-2191 2250-2251 2310-2311 2370-2371 2430-2431 2490-2491 2550-2551 2610-2611 2670-2671 2730-2731 2790-2791
25 ఖర 31-32 91-92 151-152 211-212 271-272 331-332 391-392 451-452 511-512 571-572 631-632 691-692 751-752 811-812 871-872 931-932 991-992 1051-1052 1111-1112 1171-1172 1231-1232 1291-1292 1351-1352 1411-1412 1471-1472 1531-1532 1591-1592 1651-1652 1711-1712 1771-1772 1831-1832 1891-1892 1951-1952 2011-2012 2071-2072 2131-2132 2191-2192 2251-2252 2311-2312 2371-2372 2431-2432 2491-2492 2551-2552 2611-2612 2671-2672 2731-2732 2791-2792
26 నందన 32-33 92-93 152-153 212-213 272-273 332-333 392-393 452-453 512-513 572-573 632-633 692-693 752-753 812-813 872-873 932-933 992-993 1052-1053 1112-1113 1172-1173 1232-1233 1292-1293 1352-1353 1412-1413 1472-1473 1532-1533 1592-1593 1652-1653 1712-1713 1772-1773 1832-1833 1892-1893 1952-1953 2012-2013 2072-2073 2132-2133 2192-2193 2252-2253 2312-2313 2372-2373 2432-2433 2492-2493 2552-2553 2612-2613 2672-2673 2732-2733 2792-2793
27 విజయ 33-34 93-94 153-154 213-214 273-274 333-334 393-394 453-454 513-514 573-574 633-634 693-694 753-754 813-814 873-874 933-934 993-994 1053-1054 1113-1114 1173-1174 1233-1234 1293-1294 1353-1354 1413-1414 1473-1474 1533-1534 1593-1594 1653-1654 1713-1714 1773-1774 1833-1834 1893-1894 1953-1954 2013-2014 2073-2074 2133-2134 2193-2194 2253-2254 2313-2314 2373-2374 2433-2434 2493-2494 2553-2554 2613-2614 2673-2674 2733-2734 2793-2794
28 జయ 34-35 94-95 154-155 214-215 274-275 334-335 394-395 454-455 514-515 574-575 634-635 694-695 754-755 814-815 874-875 934-935 994-995 1054-1055 1114-1115 1174-1175 1234-1235 1294-1295 1354-1355 1414-1415 1474-1475 1534-1535 1594-1595 1654-1655 1714-1715 1774-1775 1834-1835 1894-1895 1954-1955 2014-2015 2074-2075 2134-2135 2194-2195 2254-2255 2314-2315 2374-2375 2434-2435 2494-2495 2554-2555 2614-2615 2674-2675 2734-2735 2794-2795
29 మన్మథ 35-36 95-96 155-156 215-216 275-276 335-336 395-396 455-456 515-516 575-576 635-636 695-696 755-756 815-816 875-876 935-936 995-996 1055-1056 1115-1116 1175-1176 1235-1236 1295-1296 1355-1356 1415-1416 1475-1476 1535-1536 1595-1596 1655-1656 1715-1716 1775-1776 1835-1836 1895-1896 1955-1956 2015-2016 2075-2076 2135-2136 2195-2196 2255-2256 2315-2316 2375-2376 2435-2436 2495-2496 2555-2556 2615-2616 2675-2676 2735-2736 2795-2796
30 దుర్ముఖి 36-37 96-97 156-157 216-217 276-277 336-337 396-397 456-457 516-517 576-577 636-637 696-697 756-757 816-817 876-877 936-937 996-997 1056-1057 1116-1117 1176-1177 1236-1237 1296-1297 1356-1357 1416-1417 1476-1477 1536-1537 1596-1597 1656-1657 1716-1717 1776-1777 1836-1837 1896-1897 1956-1957 2016-2017 2076-2077 2136-2137 2196-2197 2256-2257 2316-2317 2376-2377 2436-2437 2496-2497 2556-2557 2616-2617 2676-2677 2736-2737 2796-2797
31 హేవిలంబి (లేదా) హేమలంబ 37-38 97-98 157-158 217-218 277-278 337-338 397-398 457-458 517-518 577-578 637-638 697-698 757-758 817-818 877-878 937-938 997-998 1057-1058 1117-1118 1177-1178 1237-1238 1297-1298 1357-1358 1417-1418 1477-1478 1537-1538 1597-1598 1657-1658 1717-1718 1777-1778 1837-1838 1897-1898 1957-1958 2017-2018 2077-2078 2137-2138 2197-2198 2257-2258 2317-2318 2377-2378 2437-2438 2497-2498 2557-2558 2617-2618 2677-2678 2737-2738 2797-2798
32 విలంబి 38-39 98-99 158-159 218-219 278-279 338-339 398-399 458-459 518-519 578-579 638-639 698-699 758-759 818-819 878-879 938-939 998-999 1058-1059 1118-1119 1178-1179 1238-1239 1298-1299 1358-1359 1418-1419 1478-1479 1538-1539 1598-1599 1658-1659 1718-1719 1778-1779 1838-1839 1898-1899 1958-1959 2018-2019 2078-2079 2138-2139 2198-2199 2258-2259 2318-2319 2378-2379 2438-2439 2498-2499 2558-2559 2618-2619 2678-2679 2738-2739 2798-2799
33 వికారి 39-40 99-100 159-160 219-220 279-280 339-340 399-400 459-460 519-520 579-580 639-640 699-700 759-760 819-820 879-880 939-940 999-1000 1059-1060 1119-1120 1179-1180 1239-1240 1299-1300 1359-1360 1419-1420 1479-1480 1539-1540 1599-1600 1659-1660 1719-1720 1779-1780 1839-1840 1899-1900 1959-1960 2019-2020 2079-2080 2139-2140 2199-2200 2259-2260 2319-2320 2379-2380 2439-2440 2499-2500 2559-2560 2619-2620 2679-2680 2739-2740 2799-2800
34 శార్వరి 40-41 100-101 160-161 220-221 280-281 340-341 400-401 460-461 520-521 580-581 640-641 700-701 760-761 820-821 880-881 940-941 1000-1001 1060-1061 1120-1121 1180-1181 1240-1241 1300-1301 1360-1361 1420-1421 1480-1481 1540-1541 1600-1601 1660-1661 1720-1721 1780-1781 1840-1841 1900-1901 1960-1961 2020-2021 2080-2081 2140-2141 2200-2201 2260-2261 2320-2321 2380-2381 2440-2441 2500-2501 2560-2561 2620-2621 2680-2681 2740-2741 2800-2801
35 ప్లవ 41-42 101-102 161-162 221-222 281-282 341-342 401-402 461-462 521-522 581-582 641-642 701-702 761-762 821-822 881-882 941-942 1001-1002 1061-1062 1121-1122 1181-1182 1241-1242 1301-1302 1361-1362 1421-1422 1481-1482 1541-1542 1601-1602 1661-1662 1721-1722 1781-1782 1841-1842 1901-1902 1961-1962 2021-2022 2081-2082 2141-2142 2201-2202 2261-2262 2321-2322 2381-2382 2441-2442 2501-2502 2561-2562 2621-2622 2681-2682 2741-2742 2801-2802
36 శుభకృతు 42-43 102-103 162-163 222-223 282-283 342-343 402-403 462-463 522-523 582-583 642-643 702-703 762-763 822-823 882-883 942-943 1002-1003 1062-1063 1122-1123 1182-1183 1242-1243 1302-1303 1362-1363 1422-1423 1482-1483 1542-1543 1602-1603 1662-1663 1722-1723 1782-1783 1842-1843 1902-1903 1962-1963 2022-2023 2082-2083 2142-2143 2202-2203 2262-2263 2322-2323 2382-2383 2442-2443 2502-2503 2562-2563 2622-2623 2682-2683 2742-2743 2802-2803
37 శోభకృతు 43-44 103-104 163-164 223-224 283-284 343-344 403-404 463-464 523-524 583-584 643-644 703-704 763-764 823-824 883-884 943-944 1003-1004 1063-1064 1123-1124 1183-1184 1243-1244 1303-1304 1363-1364 1423-1424 1483-1484 1543-1544 1603-1604 1663-1664 1723-1724 1783-1784 1843-1844 1903-1904 1963-1964 2023-2024 2083-2084 2143-2144 2203-2204 2263-2264 2323-2324 2383-2384 2443-2444 2503-2504 2563-2564 2623-2624 2683-2684 2743-2744 2803-2804
38 క్రోధి 44-45 104-105 164-165 224-225 284-285 344-345 404-405 464-465 524-525 584-585 644-645 704-705 764-765 824-825 884-885 944-945 1004-1005 1064-1065 1124-1125 1184-1185 1244-1245 1304-1305 1364-1365 1424-1425 1484-1485 1544-1545 1604-1605 1664-1665 1724-1725 1784-1785 1844-1845 1904-1905 1964-1965 2024-2025 2084-2085 2144-2145 2204-2205 2264-2265 2324-2325 2384-2385 2444-2445 2504-2505 2564-2565 2624-2625 2684-2685 2744-2745 2804-2805
39 విశ్వావసు 45-46 105-106 165-166 225-226 285-286 345-346 405-406 465-466 525-526 585-586 645-646 705-706 765-766 825-826 885-886 945-946 1005-1006 1065-1066 1125-1126 1185-1186 1245-1246 1305-1306 1365-1366 1425-1426 1485-1486 1545-1546 1605-1606 1665-1666 1725-1726 1785-1786 1845-1846 1905-1906 1965-1966 2025-2026 2085-2086 2145-2146 2205-2206 2265-2266 2325-2326 2385-2386 2445-2446 2505-2506 2565-2566 2625-2626 2685-2686 2745-2746 2805-2806
40 పరాభవ 46-47 106-107 166-167 226-227 286-287 346-347 406-407 466-467 526-527 586-587 646-647 706-707 766-767 826-827 886-887 946-947 1006-1007 1066-1067 1126-1127 1186-1187 1246-1247 1306-1307 1366-1367 1426-1427 1486-1487 1546-1547 1606-1607 1666-1667 1726-1727 1786-1787 1846-1847 1906-1907 1966-1967 2026-2027 2086-2087 2146-2147 2206-2207 2266-2267 2326-2327 2386-2387 2446-2447 2506-2507 2566-2567 2626-2627 2686-2687 2746-2747 2806-2807
41 ప్లవంగ 47-48 107-108 167-168 227-228 287-288 347-348 407-408 467-468 527-528 587-588 647-648 707-708 767-768 827-828 887-888 947-948 1007-1008 1067-1068 1127-1128 1187-1188 1247-1248 1307-1308 1367-1368 1427-1428 1487-1488 1547-1548 1607-1608 1667-1668 1727-1728 1787-1788 1847-1848 1907-1908 1967-1968 2027-2028 2087-2088 2147-2148 2207-2208 2267-2268 2327-2328 2387-2388 2447-2448 2507-2508 2567-2568 2627-2628 2687-2688 2747-2748 2807-2808
42 కీలక 48-49 108-109 168-169 228-229 288-289 348-349 408-409 468-469 528-529 588-589 648-649 708-709 768-769 828-829 888-889 948-949 1008-1009 1068-1069 1128-1129 1188-1189 1248-1249 1308-1309 1368-1369 1428-1429 1488-1489 1548-1549 1608-1609 1668-1669 1728-1729 1788-1789 1848-1849 1908-1909 1968-1969 2028-2029 2088-2089 2148-2149 2208-2209 2268-2269 2328-2329 2388-2389 2448-2449 2508-2509 2568-2569 2628-2629 2688-2689 2748-2749 2808-2809
43 సౌమ్య 49-50 109-110 169-170 229-230 289-290 349-350 409-410 469-470 529-530 589-590 649-650 709-710 769-770 829-830 889-890 949-950 1009-1010 1069-1070 1129-1130 1189-1190 1249-1250 1309-1310 1369-1370 1429-1430 1489-1490 1549-1550 1609-1610 1669-1670 1729-1730 1789-1790 1849-1850 1909-1910 1969-1970 2029-2030 2089-2090 2149-2150 2209-2210 2269-2270 2329-2330 2389-2390 2449-2450 2509-2510 2569-2570 2629-2630 2689-2690 2749-2750 2809-2810
44 సాధారణ 50-51 110-111 170-171 230-231 290-291 350-351 410-411 470-471 530-531 590-591 650-651 710-711 770-771 830-831 890-891 950-951 1010-1011 1070-1071 1130-1131 1190-1191 1250-1251 1310-1311 1370-1371 1430-1431 1490-1491 1550-1551 1610-1611 1670-1671 1730-1731 1790-1791 1850-1851 1910-1911 1970-1971 2030-2031 2090-2091 2150-2151 2210-2211 2270-2271 2330-2331 2390-2391 2450-2451 2510-2511 2570-2571 2630-2631 2690-2691 2750-2751 2810-2811
45 విరోధికృతు 51-52 111-112 171-172 231-232 291-292 351-352 411-412 471-472 531-532 591-592 651-652 711-712 771-772 831-832 891-892 951-952 1011-1012 1071-1072 1131-1132 1191-1192 1251-1252 1311-1312 1371-1372 1431-1432 1491-1492 1551-1552 1611-1612 1671-1672 1731-1732 1791-1792 1851-1852 1911-1912 1971-1972 2031-2032 2091-2092 2151-2152 2211-2212 2271-2272 2331-2332 2391-2392 2451-2452 2511-2512 2571-2572 2631-2632 2691-2692 2751-2752 2811-2812
46 పరీధావి 52-53 112-113 172-173 232-233 292-293 352-353 412-413 472-473 532-533 592-593 652-653 712-713 772-773 832-833 892-893 952-953 1012-1013 1072-1073 1132-1133 1192-1193 1252-1253 1312-1313 1372-1373 1432-1433 1492-1493 1552-1553 1612-1613 1672-1673 1732-1733 1792-1793 1852-1853 1912-1913 1972-1973 2032-2033 2092-2093 2152-2153 2212-2213 2272-2273 2332-2333 2392-2393 2452-2453 2512-2513 2572-2573 2632-2633 2692-2693 2752-2753 2812-2813
47 ప్రమాదీచ 53-54 113-114 173-174 233-234 293-294 353-354 413-414 473-474 533-534 593-594 653-654 713-714 773-774 833-834 893-894 953-954 1013-1014 1073-1074 1133-1134 1193-1194 1253-1254 1313-1314 1373-1374 1433-1434 1493-1494 1553-1554 1613-1614 1673-1674 1733-1734 1793-1794 1853-1854 1913-1914 1973-1974 2033-2034 2093-2094 2153-2154 2213-2214 2273-2274 2333-2334 2393-2394 2453-2454 2513-2514 2573-2574 2633-2634 2693-2694 2753-2754 2813-2814
48 ఆనంద 54-55 114-115 174-175 234-235 294-295 354-355 414-415 474-475 534-535 594-595 654-655 714-715 774-775 834-835 894-895 954-955 1014-1015 1074-1075 1134-1135 1194-1195 1254-1255 1314-1315 1374-1375 1434-1435 1494-1495 1554-1555 1614-1615 1674-1675 1734-1735 1794-1795 1854-1855 1914-1915 1974-1975 2034-2035 2094-2095 2154-2155 2214-2215 2274-2275 2334-2335 2394-2395 2454-2455 2514-2515 2574-2575 2634-2635 2694-2695 2754-2755 2814-2815
49 రాక్షస 55-56 115-116 175-176 235-236 295-296 355-356 415-416 475-476 535-536 595-596 655-656 715-716 775-776 835-836 895-896 955-956 1015-1016 1075-1076 1135-1136 1195-1196 1255-1256 1315-1316 1375-1376 1435-1436 1495-1496 1555-1556 1615-1616 1675-1676 1735-1736 1795-1796 1855-1856 1915-1916 1975-1976 2035-2036 2095-2096 2155-2156 2215-2216 2275-2276 2335-2336 2395-2396 2455-2456 2515-2516 2575-2576 2635-2636 2695-2696 2755-2756 2815-2816
50 నల 56-57 116-117 176-177 236-237 296-297 356-357 416-417 476-477 536-537 596-597 656-657 716-717 776-777 836-837 896-897 956-957 1016-1017 1076-1077 1136-1137 1196-1197 1256-1257 1316-1317 1376-1377 1436-1437 1496-1497 1556-1557 1616-1617 1676-1677 1736-1737 1796-1797 1856-1857 1916-1917 1976-1977 2036-2037 2096-2097 2156-2157 2216-2217 2276-2277 2336-2337 2396-2397 2456-2457 2516-2517 2576-2577 2636-2637 2696-2697 2756-2757 2816-2817
51 పింగళ (లేదా) పింగల 57-58 117-118 177-178 237-238 297-298 357-358 417-418 477-478 537-538 597-598 657-658 717-718 777-778 837-838 897-898 957-958 1017-1018 1077-1078 1137-1138 1197-1198 1257-1258 1317-1318 1377-1378 1437-1438 1497-1498 1557-1558 1617-1618 1677-1678 1737-1738 1797-1798 1857-1858 1917-1918 1977-1978 2037-2038 2097-2098 2157-2158 2217-2218 2277-2278 2337-2338 2397-2398 2457-2458 2517-2518 2577-2578 2637-2638 2697-2698 2757-2758 2817-2818
52 కాళయుక్తి (లేదా) కాలయుక్తి 58-59 118-119 178-179 238-239 298-299 358-359 418-419 478-479 538-539 598-599 658-659 718-719 778-779 838-839 898-899 958-959 1018-1019 1078-1079 1138-1139 1198-1199 1258-1259 1318-1319 1378-1379 1438-1439 1498-1499 1558-1559 1618-1619 1678-1679 1738-1739 1798-1799 1858-1859 1918-1919 1978-1979 2038-2039 2098-2099 2158-2159 2218-2219 2278-2279 2338-2339 2398-2399 2458-2459 2518-2519 2578-2579 2638-2639 2698-2699 2758-2759 2818-2819
53 సిధ్ధార్థి 59-60 119-120 179-180 239-240 299-300 359-360 419-420 479-480 539-540 599-600 659-660 719-720 779-780 839-840 899-900 959-960 1019-1020 1079-1080 1139-1140 1199-1200 1259-1260 1319-1320 1379-1380 1439-1440 1499-1500 1559-1560 1619-1620 1679-1680 1739-1740 1799-1800 1859-1860 1919-1920 1979-1980 2039-2040 2099-2100 2159-2160 2219-2220 2279-2280 2339-2340 2399-2400 2459-2460 2519-2520 2579-2580 2639-2640 2699-2700 2759-2760 2819-2820
54 రౌద్రి 60-61 120-121 180-181 240-241 300-301 360-361 420-421 480-481 540-541 600-601 660-661 720-721 780-781 840-841 900-901 960-961 1020-1021 1080-1081 1140-1141 1200-1201 1260-1261 1320-1321 1380-1381 1440-1441 1500-1501 1560-1561 1620-1621 1680-1681 1740-1741 1800-1801 1860-1861 1920-1921 1980-1981 2040-2041 2100-2101 2160-2161 2220-2221 2280-2281 2340-2341 2400-2401 2460-2461 2520-2521 2580-2581 2640-2641 2700-2701 2760-2761 2820-2821
55 దుర్మతి 01-Feb 61-62 121-122 181-182 241-242 301-302 361-362 421-422 481-482 541-542 601-602 661-662 721-722 781-782 841-842 901-902 961-962 1021-1022 1081-1082 1141-1142 1201-1202 1261-1262 1321-1322 1381-1382 1441-1442 1501-1502 1561-1562 1621-1622 1681-1682 1741-1742 1801-1802 1861-1862 1921-1922 1981-1982 2041-2042 2101-2102 2161-2162 2221-2222 2281-2282 2341-2342 2401-2402 2461-2462 2521-2522 2581-2582 2641-2642 2701-2702 2761-2762 2821-2822
56 దుందుభి 02-Mar 62-63 122-123 182-183 242-243 302-303 362-363 422-423 482-483 542-543 602-603 662-663 722-723 782-783 842-843 902-903 962-963 1022-1023 1082-1083 1142-1143 1202-1203 1262-1263 1322-1323 1382-1383 1442-1443 1502-1503 1562-1563 1622-1623 1682-1683 1742-1743 1802-1803 1862-1863 1922-1923 1982-1983 2042-2043 2102-2103 2162-2163 2222-2223 2282-2283 2342-2343 2402-2403 2462-2463 2522-2523 2582-2583 2642-2643 2702-2703 2762-2763 2822-2823
57 రుధిరోద్గారి 03-Apr 63-64 123-124 183-184 243-244 303-304 363-364 423-424 483-484 543-544 603-604 663-664 723-724 783-784 843-844 903-904 963-964 1023-1024 1083-1084 1143-1144 1203-1204 1263-1264 1323-1324 1383-1384 1443-1444 1503-1504 1563-1564 1623-1624 1683-1684 1743-1744 1803-1804 1863-1864 1923-1924 1983-1984 2043-2044 2103-2104 2163-2164 2223-2224 2283-2284 2343-2344 2403-2404 2463-2464 2523-2524 2583-2584 2643-2644 2703-2704 2763-2764 2823-2824
58 రక్తాక్షి 04-May 64-65 124-125 184-185 244-245 304-305 364-365 424-425 484-485 544-545 604-605 664-665 724-725 784-785 844-845 904-905 964-965 1024-1025 1084-1085 1144-1145 1204-1205 1264-1265 1324-1325 1384-1385 1444-1445 1504-1505 1564-1565 1624-1625 1684-1685 1744-1745 1804-1805 1864-1865 1924-1925 1984-1985 2044-2045 2104-2105 2164-2165 2224-2225 2284-2285 2344-2345 2404-2405 2464-2465 2524-2525 2584-2585 2644-2645 2704-2705 2764-2765 2824-2825
59 క్రోధన 05-Jun 65-66 125-126 185-186 245-246 305-306 365-366 425-426 485-486 545-546 605-606 665-666 725-726 785-786 845-846 905-906 965-966 1025-1026 1085-1086 1145-1146 1205-1206 1265-1266 1325-1326 1385-1386 1445-1446 1505-1506 1565-1566 1625-1626 1685-1686 1745-1746 1805-1806 1865-1866 1925-1926 1985-1986 2045-2046 2105-2106 2165-2166 2225-2226 2285-2286 2345-2346 2405-2406 2465-2466 2525-2526 2585-2586 2645-2646 2705-2706 2765-2766 2825-2826
60 అక్షయ 06-Jul 66-67 126-127 186-187 246-247 306-307 366-367 426-427 486-487 546-547 606-607 666-667 726-727 786-787 846-847 906-907 966-967 1026-1027 1086-1087 1146-1147 1206-1207 1266-1267 1326-1327 1386-1387 1446-1447 1506-1507 1566-1567 1626-1627 1686-1687 1746-1747 1806-1807 1866-1867 1926-1927 1986-1987 2046-2047 2106-2107 2166-2167 2226-2227 2286-2287 2346-2347 2406-2407 2466-2467 2526-2527 2586-2587 2646-2647 2706-2707 2766-2767 2826-2827

తెలుగు సంవత్సరాలు ఫలితాలు

[మార్చు]
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.

తెలుగు సంవత్సరం పేరు సంవత్సర ఫలితము.
1 ప్రభవ ప్రభవించునది అంటే పుట్టుక.యజ్ఞములు విరివిగా జరుగుతాయి.
2 విభవ వైభవంగా ఉండేది. జనులు సుఖముగా ఉంటారు.
3 శుక్ల అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక పంటలు సమృద్ధిగా పండుతాయి.
4 ప్రమోదూత ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత ప్రజలందరు ఆనందంగా ఉంటారు
5 ప్రజోత్పత్తి ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి అంతటా అభివృద్ధి కనిపిచును
6 అంగీరస అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థంభోగములు కలిగి ఉంటారు
7 శ్రీముఖ శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం లోకమంతా సౌఖ్యముగా ఉంటుంది
8 భావ భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు ఉన్నత భావమును కలిగిస్తుంది
9 యువ యువ అనేది బలానికి ప్రతీక ఇంద్రుడు వర్షములు కురిపించుట వలన లోకమంతా సస్యశ్యామలముగా ఉంటుంది
10 ధాత అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు. అన్ని ఔషధులు (మొక్క ధాన్యాలు)పండును
11 ఈశ్వర పరమేశ్వరుడు. అందరికీ క్షేమము ఆరోగ్యము కలిగించును
12 బహుధాన్య సుభిక్షంగా ఉండటం.అన్ని రకాల పంటలూ విరివిగా పండటం దేశమంతా సుభిక్షముగా ఉంటుంది
13 ప్రమాది ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు. ప్రమాదో ధీమతామపి అన్నారు.
14 విక్రమ విక్రమం కలిగిన వాడు. మధ్యమ వర్షపాతము ఉంటుంది
15 వృష చర్మం. అంతటా వర్షములు కురుస్తాయి
16 చిత్రభాను భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం. సూర్యునిలో మార్పులకు అవకాశం వుంటుంది. చిత్రవిచిత్ర అలంకారములను ఇస్తుంది
17 స్వభాను స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం క్షేమము ఆరోగ్యము ఇస్తుంది
18 తారణ తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం. పంటలకు అనుకూలముగా వర్షములు కురుస్తాయి
19 పార్థివ పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.సస్యములు సంపదలు సమృద్ధి ఔతాయి
20 వ్యయ ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం అతివృష్ఠి కలుగుతుంది
21 సర్వజిత్తు సర్వాన్ని జయించినది ప్రజలు సుఖించునట్లు వర్షాలు పడతాయి.
22 సర్వధారి సర్వాన్ని ధరించేది. సుభిక్షముగా ఉంటుంది.
23 విరోధి విరోధం కలిగినట్టువంటిది. మేఘాలను హరించి వర్షము పడకుండా చేద్తుంది
24 వికృతి వికృతమైనటువంటిది. భయంకరముగా ఉంటుంది
25 ఖర గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.పురుషులు వీరులౌతారు
26 నందన కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది. ప్రజలు ఆనందముగా ఉంటారు
27 విజయ విశేషమైన జయం కలిగినది. శత్రువులను హరించును
28 జయ జయాన్ని కలిగించేది. శత్రువులు, రోగముల మీద విజయము కలుగుతుంది
29 మన్మథ మనస్సును మధించేది. జ్వరాఫ్హిబాఫ్హలు కలుగును
30 దుర్ముఖి చెడ్డ ముఖం కలది.ప్రజలు దుష్కర్మలు చేస్తారు
31 హేవిలంబి (లేదా) హేమలంబ సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం సంపదలు కలుగును
32 విలంబి సాగదీయడం. సుభిక్షముగా ఉంటుంది
33 వికారి వికారం కలిగినది. శత్రువులకు కోపము కలిగించును
34 శార్వరి రాత్రి అక్కడక్కడా పంటలు పండును
35 ప్లవ తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం కష్టాలనుంచి దాటిస్తుంది సమృద్ధిగా జలం ప్రవహించును
36 శుభకృతు శుభాన్ని చేసి పెట్టేది ప్రజలు శుభముంగా ఉంటారు
37 శోభకృతు శోభను కలిగించేది ప్రజలు శుఖంగా ఉంటారు
38 క్రోధి క్రోధాన్ని కలిగినది కోపస్వభావం పెరుగుతుంది
39 విశ్వావసు విశ్వానికి సంబంధించినది ధనసమృద్ధి కలుగుతుంది
40 పరాభవ అవమానం. ప్రజలు ఒకరిని ఒకరు అవమానించుకుంటారు
41 ప్లవంగ కోతి, కప్ప. జలసమృద్ధి అధికంగా ఉంటుంది
42 కీలక పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య. సస్య సమృద్ధి అధికంగా ఉంటుంది
43 సౌమ్య మృదుత్వం.ప్రజలకు శుభములు కలుగుతాయి
44 సాధారణ సామాన్యంగా వుండునట్టిది. ప్రజలకు సామన్య శుభములు కలుగుతాయి
45 విరోధికృతు విరోధాలను కలిగించేది ప్రజలలో విరోధభావం పెరుగుతుంది
46 పరీధావి భయకారకం. ప్రజలలో భీతి అధికం ఔతుంది
47 ప్రమాదీచ ప్రమాద కారకం.
48 ఆనంద ఆనందమయం ప్రజలు ఆనందంగా ఉంటారు
49 రాక్షస రాక్షసత్వాన్ని కలిగినది. ప్రజలులో క్రూర స్వభావం అధికమవుతుంది
50 నల నల్ల అనే పదానికి రూపాంతరం.
51 పింగళ (లేదా) పింగల ఒక నాడి, కోతి, పాము, ముంగిస.
52 కాళయుక్తి (లేదా) కాలయుక్తి కాలానికి తగిన యుక్తి.
53 సిధ్ధార్థి కోర్కెలు సిద్ధించింది.
54 రౌద్రి రౌద్రంగా ఉండేది. ప్రకృయి విపత్తులు సంభవిస్తాయి
55 దుర్మతి దుష్ట బుద్ధి. ప్రజలకు దుర్బుద్ధులు అధికమౌతాయి
56 దుందుభి వరుణుడు.
57 రుధిరోద్గారి రక్తాన్ని స్రవింప చేసేది. రక్తధారలు ప్రవహిస్తాయి
58 రక్తాక్షి ఎర్రని కన్నులు కలది. ప్రజలకు ప్రకృతికారక కోప విపత్తులు కలిగే అవకాశం వుంటుంది
59 క్రోధన కోప స్వభావం కలది. ప్రజలలో క్రోధం అధికమౌతుంది
60 అక్షయ నశించనిది. ప్రజలు సుభిక్షంగా ఉంటారు

ఇవీ చూడండి

[మార్చు]


బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము చిలుకూరి వీరభద్రరావు