శ్రీముఖ
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
శ్రీముఖ తెలుగు సంవత్సరాలలో ఏడవ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం అంగీరస, తర్వాత సంవత్సరం భావ. శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం లోకమంతా సౌఖ్యముగా ఉంటుంది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1873-1874, 1933-1934, 1993-1994లో వచ్చిన తెలుగు సంవత్సరానికి శ్రీముఖ అని పేరు.
1993 : శ్రీముఖ నామ సంవత్సరం 24 మార్చి 1993 బుధవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 11 ఏప్రిల్ 1994 సోమవారం భావ నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో శ్రీముఖ
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 7 | శ్రీముఖ | 13-14 | 73-74 | 133-134 | 193-194 | 253-254 | 313-314 | 373-374 | 433-434 | 493-494 | 553-554 | 613-614 | 673-674 | 733-734 | 793-794 | 853-854 | 913-914 | 973-974 | 1033-1034 | 1093-1094 | 1153-1154 | 1213-1214 | 1273-1274 | 1333-1334 | 1393-1394 | 1453-1454 | 1513-1514 | 1573-1574 | 1633-1634 | 1693-1694 | 1753-1754 | 1813-1814 | 1873-1874 | 1933-1934 | 1993-1994 | 2053-2054 | 2113-2114 | 2173-2174 | 2233-2234 | 2293-2294 | 2353-2354 | 2413-2414 | 2473-2474 | 2533-2534 | 2593-2594 | 2653-2654 | 2713-2714 | 2773-2774 |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- 1933 ఆశ్వయుజ బహుళ నవమి :అందె వేంకటరాజము - అవధాని, గ్రంథకర్త, బహుభాషాకోవిదుడు (మ.2006).[3]
మరణాలు
[మార్చు]- క్రీ. శ. 1873 : శ్రావణ బహుళ తదియ : మతుకుమల్లి నృసింహకవి - ప్రముఖ తెలుగు కవి.
- క్రీ. శ. 1873 : వైశాఖ శుద్ధ చతుర్దశి : మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి - ప్రముఖ తెలుగు కవి, పండితుడు.
- వైశాఖ బహుళ సప్తమి : మహాయోగిని శ్రీ ఆదోని లక్ష్మమ్మ వారు (16-05-1933) సమాధిలో ప్రవేశించారు
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 389.