మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి
స్వరూపం
మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి | |
---|---|
జననం | 1808 |
మరణం | 11 మే, 1873 |
వృత్తి | కవి, పండితుడు |
తల్లిదండ్రులు |
|
మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి మాడుగుల సంస్థాన ప్రభువైన శ్రీకృష్ణ భూపాలుని ఆస్థానంలో కవి, పండితుడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఈయన తల్లి సీతమ్మ, తండ్రి శరభరాజామాత్యుడు. ఈయన పిఠాపురం దగ్గరున్న తిమ్మాపురంలో 1808 విభవ నామ సంవత్సరంలో జన్మించారు. 1873లో మే 11న శ్రీముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి భానువాసరము రోజున నిర్యాణము చెందారు.
విద్య
[మార్చు]ఈ కవి విద్యా గురువులు ముగ్గురు - కందర్ప సీతారామశాస్త్రి గారు బాల్యగురువులు. దేవులపల్లి తమ్మయసూరి గారు, వాడపల్లి అనంతపద్మనాభాచార్య గార్ల వద్ద ఉభయ భాషలు అభ్యసించారు ఈ కవి. కవిత్వం వీరికి జన్మతః ఉన్న విద్య. తల్లితండ్రులిరువురి వైపు వారు పండిత కవులు.
రచనలు
[మార్చు]- సీతారామచరిత్రము (ఆఱు ఆశ్వాసములు - 1851-52)
- కృష్ణార్జున చరిత్రము (ద్వ్యర్థి కావ్యము - 1863)
- భీమలింగశతకము (1869)
రచనలకు గుర్తింపు
[మార్చు]- ఆంధ్ర సాహిత్య పరిషత్తు సీతారామచరిత్రములోని బాలకాండము గల ప్రథమాశ్వాసాన్ని 1941 లో వెలువరించింది.
- కృష్ణార్జున చరిత్రము 1908లో బి.ఏ.కూ, 1914లో ఎమ్.ఏకును పాఠ్యముగా చెన్నపుర విశ్వవిద్యాలయము వారు నిర్ణయించారు.
రచనల ఉదాహరణలు
[మార్చు]- భీమలింగశతకం నుండి:
- క. కాయలు లేని మహీజము
- కోయిల లేనట్టి వనము గుడిలేనిపురము
- బాయల మోదము జేయవు
- కాయజహర! భీమలింగ! కలుషవిభంగా!
మూలాలు
[మార్చు]- ఆంధ్ర రచయితలు : మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1940, పేజీలు: 30-4.