ఈశ్వర
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
ఈశ్వర తెలుగు సంవత్సరాలలో 11వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం ధాత, తర్వాత సంవత్సరం బహుధాన్య. ఈశ్వర అనగా పరమేశ్వరుడు. ఈ సంవత్సరం అందరికీ క్షేమము ఆరోగ్యము కలిగించును. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1937-1938, 1997-1998లో వచ్చిన తెలుగు సంవత్సరానికి ఈశ్వర అని పేరు.
1997 : ఈశ్వర నామ సంవత్సరం 8 ఏప్రిల్ 1997 మంగళవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 28 మార్చి 1998 శనివారం బహుధాన్యం నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "ఈశ్వర"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 11 | ఈశ్వర | 17-18 | 77-78 | 137-138 | 197-198 | 257-258 | 317-318 | 377-378 | 437-438 | 497-498 | 557-558 | 617-618 | 677-678 | 737-738 | 797-798 | 857-858 | 917-918 | 977-978 | 1037-1038 | 1097-1098 | 1157-1158 | 1217-1218 | 1277-1278 | 1337-1338 | 1397-1398 | 1457-1458 | 1517-1518 | 1577-1578 | 1637-1638 | 1697-1698 | 1757-1758 | 1817-1818 | 1877-1878 | 1937-1938 | 1997-1998 | 2057-2058 | 2117-2118 | 2177-2178 | 2237-2238 | 2297-2298 | 2357-2358 | 2417-2418 | 2477-2478 | 2537-2538 | 2597-2598 | 2657-2658 | 2717-2718 | 2777-2778 |
సంఘటనలు
[మార్చు]
- రావణ సంహారం జరిగిన తరువాత విభీషణ పట్టాభిషేకం ఈశ్వర నామ సంవత్సర చైత్ర శుద్ధ తదియ నాడు జరిగింది.[3]
- అయోధ్యకు పుష్పక విమానంలో బయలు దేరుట ఈశ్వర నామ సంవత్సర చైత్ర శుద్ధ చవితి, భరద్వాజ ఆశ్రమంలో బస ఈశ్వరనామ సంవత్సర చైత్ర శుక్ల పంచమి, నంది గ్రామంలో భరతుని కలుసుకొని అయోధ్య నగర ప్రవేశం ఈశ్వర నామ సంవత్సర చైత్ర శుక్ల షష్ఠి, శ్రీరామ చంద్ర పట్టాభిషేక మహోత్సవం ఈశ్వర నామ సంవత్సర చైత్ర శుక్ల సప్తమి పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం జరిగింది.[3]
జననాలు
[మార్చు]- 1877 ఆశ్వయుజ శుద్ధ అష్టమి: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు. (మ.1937)
- 1937 జేష్ఠ బహుళ ద్వాదశి :పణితపు శ్రీరామమూర్తి - అవధాని, కవి.[4]
- 1937 భాద్రపద శుద్ధ తదియ : గాడేపల్లి కుక్కుటేశ్వరరావు - అవధాని, నవలారచయిత. (మ.2000).[5]
- కుమారకాల్వ విజయ భాస్కర జననం (౨౬-౧౦-౧౯౯౮)
మరణాలు
[మార్చు]2007-2008
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ 3.0 3.1 "శ్రీ రామ జనన సంవత్సర(విళంబి నామ సంవత్సర) కళ్యాణ వైభవ మహోత్సవము - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-09-25.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 412.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 417.