ధాత
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
ధాత తెలుగు సంవత్సరాలలో పదవ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం యువ, తర్వాత సంవత్సరం ఈశ్వర. ధాత అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు. ఈ సంవత్సరం అన్ని ఔషధులు (మొక్క ధాన్యాలు) పండును. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1816 - 1817, 1876 - 1877, 1936-1937, 1996-1997లో వచ్చిన తెలుగు సంవత్సరానికి ధాత అని పేరు.
1996 : ధాత నామ సంవత్సరం 20 మార్చి 1996 బుధవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 8 ఏప్రిల్ 1997 మంగళవారం ఈశ్వర నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "ధాత"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 10 | ధాత | 16-17 | 76-77 | 136-137 | 196-197 | 256-257 | 316-317 | 376-377 | 436-437 | 496-497 | 556-557 | 616-617 | 676-677 | 736-737 | 796-797 | 856-857 | 916-917 | 976-977 | 1036-1037 | 1096-1097 | 1156-1157 | 1216-1217 | 1276-1277 | 1336-1337 | 1396-1397 | 1456-1457 | 1516-1517 | 1576-1577 | 1636-1637 | 1696-1697 | 1756-1757 | 1816-1817 | 1876-1877 | 1936-1937 | 1996-1997 | 2056-2057 | 2116-2117 | 2176-2177 | 2236-2237 | 2296-2297 | 2356-2357 | 2416-2417 | 2476-2477 | 2536-2537 | 2596-2597 | 2656-2657 | 2716-2717 | 2776-2777 |

సంఘటనలు
[మార్చు]- రామాయణంలో సీతాపహరణం ధాత నామ సంవత్సర చైత్ర బహుళ అష్టమి నాడు జరిగింది.[3]
- ధాత నామ సంవత్సర ఫాల్గుణ బహుళ అమావాస్య నాడు రావణ సంహారం జరిగింది.[3]
- సా.శ. 1757 - విజయ దశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి పైడితల్లి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి అనే వ్యక్తి పైకి తీశారు.
జననాలు
[మార్చు]- పౌర్ణమి : యమునాచార్యుడు జననం.
- సా.శ. 1816 శ్రావణ బహుళ చతుర్దశి : మతుకుమల్లి నృసింహకవి - ప్రముఖ తెలుగు కవి.
- సా.శ. 1876 చైత్ర బహుళ పంచమి : మంత్రిప్రెగడ భుజంగరావు - పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరము జమీందారు, సాహిత్యపోషకుడు, శతాధికగ్రంథ రచయిత. (మ.1940)
- సా.శ. 1876 వైశాఖ శుద్ధ పంచమి : బంకుపల్లె మల్లయ్యశాస్త్రి - ప్రముఖ పండితుడు. సంఘసంస్కర్త. రచయిత.
- సా.శ. 1936 చైత్ర బహుళ తదియ : స్వర్ణరాజ హనుమంతరావు - కవి, గాయకుడు, నటుడు, నాట్యావధాని.[4]
- సా.శ. 1996 వసంత ఋతువు ఉత్తరాయణం చైత్ర మాసం శుక్ల తదియ గురువారం : సూర్య సాయిరాం - ప్రముఖ డిజైన్ ఇంజనీర్.
మరణాలు
[మార్చు]- సా.శ.1936 ఆషాఢ శుద్ధ పూర్ణిమ : తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి - తెలుగు కవి.
- సా.శ.1996 కార్తీక శుద్ధ చతుర్థి : చెఱువు సత్యనారాయణ శాస్త్రి, సంస్కృత పండితుడు, శతావధాని.[5] (జ.1943)
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ 3.0 3.1 "శ్రీ రామ జనన సంవత్సర(విళంబి నామ సంవత్సర) కళ్యాణ వైభవ మహోత్సవము - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-09-25.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 843.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 461.