తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి
Appearance
తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి | |
---|---|
జననం | 1856 |
మరణం | 1936 |
వృత్తి | కవి |
తల్లిదండ్రులు |
|
తాడూరి లక్ష్మీనరసింహరాయకవి (జూలై 18, 1856 - జూలై 4, 1936) ప్రముఖ తెలుగు కవి.
వీరు మధ్వ మతస్థులు. వీరి తల్లి: సీతమాంబ, తండ్రి: రామారావు. నివాసము: రాజమేంద్రవరము. జననము: 18-7-1856 సం. నల సంవత్సర - ఆషాఢ బహుళ ప్రతిపత్తు - శుక్రవారము. నిర్యాణము: 4-7-1936 సం. ధాత సంవత్సర - ఆషాఢ శుద్ధ పూర్ణిమ.
రచనలు
[మార్చు]- 1. శృంగారభూషనము.
- 2. ఉన్మత్తరాఘవము.
- 3. రుక్మిణీ స్వయంవరము. (ఈ మూడు నాటకములు)
- 4. భోజకుమారము.
- 5. లక్ష్మీసంవాదము.
- 6. చంద్రాలోకము.
- 7. మేఘసందేశము (పూర్వసర్గముమాత్ర మాంధ్రీకృతము)
- 8. దైవప్రార్థనము.
- 9. భగవద్గీత (ఆంధ్రీకృతి).
- 10. శృంగారతిలకము.
- 11. ఋతుసంహారము.
- 12. జ్ఞానోదయము (ఆంగ్ల అణు కావ్యముల ఆంధ్రీకరణము).
- 13. సనత్సుజాతీయము.
- 14. నీతికథానిధి.
- 15. రసమంజరి (సంస్కృతమునకు తెలుగుసేత).
- 16. చమత్కారచంద్రిక.
- 17. పండితరాయ శతకము.
- 18. ఉద్యోగపర్వము (తెలిగింపు)
- 19. బాలనీతి - ఇత్యాదులు.
మూలాలు
[మార్చు]- తాడూరి లక్ష్మీనరసింహరాయకవి, ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 158-160.