శార్వరి
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
శార్వరి తెలుగు సంవత్సరాలలో 34వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం వికారి, తర్వాత సంవత్సరం ప్లవ. రాత్రి అక్కడక్కడా పంటలు పండును. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1900-1901, 1960-1961లో వచ్చిన తెలుగు సంవత్సరానికి శార్వరి అని పేరు.
2020 : శార్వరి నామ సంవత్సరం 25 మార్చి 2020 బుధవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 13 ఏప్రిల్ 2021 మంగళవారం ప్లవ నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "శార్వరి"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 34 | శార్వరి | 40-41 | 100-101 | 160-161 | 220-221 | 280-281 | 340-341 | 400-401 | 460-461 | 520-521 | 580-581 | 640-641 | 700-701 | 760-761 | 820-821 | 880-881 | 940-941 | 1000-1001 | 1060-1061 | 1120-1121 | 1180-1181 | 1240-1241 | 1300-1301 | 1360-1361 | 1420-1421 | 1480-1481 | 1540-1541 | 1600-1601 | 1660-1661 | 1720-1721 | 1780-1781 | 1840-1841 | 1900-1901 | 1960-1961 | 2020-2021 | 2080-2081 | 2140-2141 | 2200-2201 | 2260-2261 | 2320-2321 | 2380-2381 | 2440-2441 | 2500-2501 | 2560-2561 | 2620-2621 | 2680-2681 | 2740-2741 | 2800-2801 |
సంఘటనలు
[మార్చు]- సా.శ. 1900 : వైశాఖమాసములో తిరుపతి వేంకట కవులు బొబ్బిలివద్దనుండు పాలతేరు గ్రామమున, గజపతినగరం, విశాఖపట్నంలో యవధానములు జరిపారు.[3] పిదప ఆశ్వయుజ మాసములో నర్సారావుపేటలోను, మార్గశిర మాసములో కేశనకుర్తిలో ఆకొండి కామన్న గారి యింటిలోను యవధానములు నిర్వహించారు.
జననాలు
[మార్చు]- 1900 శ్రావణ బహుళ చతుర్దశి : మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ - భక్త పోతరాజీయము అనే నాటక కర్త. (మ.1974).[4]
- 1960 జ్యేష్ఠ బహుళ అమావాస్య : మాజేటి వెంకట నాగలక్ష్మీ ప్రసాద్ - అష్టావధాని, రచయిత.[5]
మరణాలు
[మార్చు]- చైత్ర శుద్ధ నవమి : వేమన కదిరి గుహలో సమాధిని పొందెను.
- 1960 ఆషాఢ శుద్ధ ద్వాదశి : మాదిరాజు రామకోటీశ్వరరావు, నిజాం ఆంధ్రోద్యమంలో పాల్గొన్నవ్యక్తి, న్యాయవాది.
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 74. Retrieved 27 June 2016.[permanent dead link]
- ↑ కల్లూరు అహోబలరావు (1975). రాయలసీమ రచయితల చరిత్ర మొదటి భాగం (1 ed.). హిందూపురం: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల. p. 24. Retrieved 22 April 2020.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 747.