మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ
జననంమద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ
ఆగష్టు 23, 1900
పట్టాభిరామపురం అగ్రహారం
మరణంఅక్టోబరు 2, 1974
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిప్రముఖ కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త
తండ్రిమద్దులపల్లి నృసింహ సిద్ధాంతి
తల్లివేంకటసుబ్బమ్మ

సంస్కృతాంధ్ర కవితాసామ్రాజ్యాన్ని ఏకఛత్రంగా ఏలిన కవిసార్వభౌముడు మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ (ఆగష్టు 23, 1900 - అక్టోబరు 2, 1974) [1].

జీవిత విశేషాలు[మార్చు]

మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ నెల్లూరు జిల్లా (ప్రస్తుతం ప్రకాశంజిల్లా) కు చెందిన పట్టాభిరామపురం అగ్రహారం లో స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో 1900 ఆగష్టు 23వ సంవత్సరంలో జన్మించాడు. తండ్రి నృసింహ సిద్ధాంతి జ్యోతిష పండితుడు. ఇతడిది పండితవంశము. ముత్తాత, తాత, పినతండ్రి అందరూ పండితులే. సింగరబొట్లపాలెం అగ్రహారంలోని వేదపాఠశాలలో కృష్ణయజుర్వేదం చదువుకున్నాడు. కడపలో జనమంచి శేషాద్రిశర్మ వద్ద నాటకాలంకారము, సాహిత్యము నేర్చుకున్నాడు. 1923లో కలకత్తా నుండి కావ్యతీర్ధ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. 1930లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఉభయభాషాప్రవీణ ఉత్తీర్ణుడయ్యాడు. 1937లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పట్టా పొందాడు. 1924లో మద్రాసులోని వావిళ్ల ప్రెస్‌లో ఆంధ్రపండితునిగా, 1925-1959ల మధ్య కాలంలో నంద్యాల మునిసిపల్ హైస్కూలులో అధ్యాపకుడిగా, 1960-1961ల మధ్య కర్నూలు సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హైస్కూలులోను, సాంస్క్రిట్ ఓరియెంటల్ హైస్కూలులోను తెలుగు పండితునిగా పనిచేశాడు.

సాహిత్యసేవ[మార్చు]

"కవితాసామ్రాజ్యము" అనే పేరుతో ఒక సాహిత్యసంస్థను నంద్యాలలో నెలకొల్పి సాహిత్యసేవ చేశాడు.

రచనలు[మార్చు]

  1. సత్యనారాయణ మాహాత్మ్యము - 5 ఆశ్వాసముల పద్యకావ్యం
  2. అమృతసందేశము - వ్యంగ్యకావ్యము
  3. దైవప్రార్థన - 400 శ్లోకాలు, పద్యాలు, సుభాషితాలు
  4. కవితావినోదము
  5. పెళ్ళిరాయబారము - సీతారాముల కళ్యాణము
  6. సత్యనారాయణ సుప్రభాతము
  7. నిరపరాధ నిందలురావు - నాటకము
  8. త్యాగరాజు - 5 అంకముల నాటకము
  9. భక్తపోతరాజీయము - 5 అంకముల నాటకము - పోతన జీవితచరిత్ర
  10. మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి గారి చరిత్ర
  11. కుక్కలమొఱ - పద్యములు
  12. దానకర్ణ బుడ్డా వెంగళరెడ్డి గారి చరిత్ర - వచనము
  13. బ్రహ్మస్వామి జీవితము - వచనము
  14. అయ్యలరాజు నారాయణామాత్యుని "హంసవింశతి" శృంగార ప్రబంధానికి 80 పేజీల పీఠిక, టీకాతాత్పర్య వివరణ
  15. వాంఛేశ్వరకవి విరచిత "మహిషశతకము"నకు తెలుగు తాత్పర్యము
  16. దక్షిణామూర్తి స్తోత్రమునకు ఆంధ్రీకరణ
  17. ఆంధ్ర వచన భారతము
  18. "ప్రియదర్శికా" నాటిక అనువాదము
  19. చమత్కార కవిత్వము - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి చమత్కార కవితాఘట్టములు[2]

మూలాలు[మార్చు]

  1. రాయలసీమ రచయితల చరిత్ర మొదటి సంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
  2. వీరరాఘవశాస్త్రి, గాడేపల్లి. చమత్కార కవిత్వము.