1961
స్వరూపం
1961 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1958 1959 1960 1961 1962 1963 1964 |
దశాబ్దాలు: | 1940లు 1950లు 1960లు 1970లు 1980లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- సెప్టెంబర్ 1: మొదటి అలీన దేశాల సదస్సు బెల్గ్రేడ్లో ప్రారంభమైనది.
జననాలు
[మార్చు]- జనవరి 1: దుర్గాప్రసాద్ ఓజా, భౌతిక శాస్త్రవేత్త.
- జనవరి 1: ఎన్ బీరెన్ సింగ్, మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి.
- జనవరి 26: మల్లేశ్ బలష్టు, కవి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినీ నటుడు.
- ఫిబ్రవరి 1: నాగసూరి వేణుగోపాల్, సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, హేతువాది.
- ఫిబ్రవరి 15: అంగర రామమోహన్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ సభ్యుడు.
- ఫిబ్రవరి 21: అభిజిత్ బెనర్జీ, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఆర్థికవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత.
- ఏప్రిల్ 3: ఎడీ మర్ఫీ, అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత, గాయకుడు.
- మే 21: రాళ్ళబండి కవితాప్రసాద్ తెలుగు అవధాని, కవి. (మ.2015)
- జూన్ 2: యలమంచిలి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు.
- జూన్ 5: రమేశ్ కృష్ణన్, భారత టెన్నిస్ క్రీడాకారుడు.
- జూలై 4: ఎం.ఎం.కీరవాణి, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు.
- జూలై 18: అందెశ్రీ, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత.
- జూలై 21: అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు. (మ.1988)
- ఆగష్టు 15: సుహాసిని, దక్షిణ భారత సినిమా నటి.
- ఆగష్టు 15: పందిళ్ళ శేఖర్బాబు, రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు, నిర్వాహకులైన తెలుగు నాటకరంగంలో పేరొందిన వ్యక్తి. (మ.2015)
- ఆగష్టు 17: అనామిక, హిందీ నవలా రచయిత్రి, కవయిత్రి.
- ఆగష్టు 25: బిల్లీ రే సైరస్, అమెరికా సంగీత గాయకుడు, గీత రచయిత, నటుడు.
- సెప్టెంబర్ 9: సీమా ప్రకాశ్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త. టిష్యూకల్చర్లో నిపుణురాలు.
- సెప్టెంబర్ 15: పాట్రిక్ ప్యాటర్సన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- సెప్టెంబర్ 30: చంద్రకాంత్ పండిత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- నవంబర్ 17: చందా కొచ్చర్, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకుకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా, నిర్వహణ అధ్యక్షురాలు.
- అక్టోబరు 2: సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ.2020)
- నవంబర్ 24 : అరుంధతీ రాయ్, భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి.
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 5: వట్టికోట ఆళ్వారుస్వామి, రచయిత, ప్రజా ఉద్యమనేత. (జ.1915)
- ఫిబ్రవరి 16: వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ సంచాలకులు. (జ.1902)
- ఫిబ్రవరి 25: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రచయిత.
- మార్చి 17: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (జ.1881)
- ఏప్రిల్ 15: రాచాబత్తుని సూర్యనారాయణ, సాతంత్ర్యసమయోధుడు. (జ.1903)
- జూన్ 14: కె శ్రీనివాస కృష్ణన్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (జ.1898)
- జూన్ 30: లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జతచేసే 'ఫోనో ఫిల్మ్' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (జ.1873)
- అక్టోబర్ 2: శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి. (జ.1906)
పురస్కారాలు
[మార్చు]- భారతరత్న పురస్కారం: డా. బీ.సీ.రాయ్, పురుషోత్తమ దాస్ టాండన్