రమేశ్ కృష్ణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాజీ టెన్నిస్ క్రీడాకారులు శ్రీ రామనాథన్ కృష్ణన్, శ్రీ రమేష్ కృష్ణన్ 2009 నవంబరు 26న న్యూఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్.M ఎస్ గిల్ ను కలిశారు

1961 జూన్ 5 న జన్మించిన రమేశ్ కృష్ణన్ భారత టెన్నిస్ క్రీడాకారుడు. 1980 దశాబ్దంలో భారత్ తరఫున ఆడి పలు విజయాలు సాధించాడు. అతని తండ్రి రామనాథన్ కృష్ణన్ కూడా టెన్నిస్ ఆటగాడు. 1998లో రమేశ్ కృష్ణన్ కు పద్మశ్రీ అవార్డు లభించింది. 2007 జనవరిలో అతనిని భారత డేవిస్ కప్ టీం కోచ్ గా నియమించారు.

క్రీడా జీవితంలో ముఖ్య ఘట్టాలు

[మార్చు]
  • 1979 - వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ చాంపియన్ షిప్ సాధించాడు.
  • 1981 - అమెరికన్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళినాడు.
  • 1985 - సింగిల్స్ ర్యాంకింగ్ లో అతని జీవితంలోనే అత్యుత్తమమైన 23 వ ర్యాంకును పొందినాడు.
  • 1986 - వింబుల్డన్ లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళినాడు.
  • 1987 - అమెరికన్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళినాడు.
  • 1987 - డేవిస్ కప్ భారత టీంలో సభ్యుడిగా ఉండి ఫైనల్ వరకు తీసుకువచ్చాడు.
  • 1989 - అప్పటి ప్రపంచ నెంబర్ 1 మాట్స్ విలాండర్ను ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ లో ఓడించాడు.
  • 1992 - బార్సిలోనా ఒలింపిక్ క్రీడలలో డబుల్స్ లో క్వార్టర్ ఫైన వరకు వచ్చాడు.

బయటి లింకులు

[మార్చు]