Jump to content

డేవిస్ కప్

వికీపీడియా నుండి

పురుషుల టెన్నిస్‌లో డేవిస్ కప్ ప్రధానమైన అంతర్జాతీయ జట్టు పోటీ. దీన్ని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ - ITF) నిర్వహిస్తుంది. 140 పైచిలుకు దేశాలకు చెందిన జట్ల మధ్య ప్రతీ సంవత్సరం ఈ పోటీ జరుగుతుంది. దీనిని నిర్వాహకులు "వరల్డ్ కప్ ఆఫ్ టెన్నిస్"గా అభివర్ణించారు. ఈ కప్పు విజేతలను ప్రపంచ ఛాంపియన్లుగా పేర్కొంటారు.[1] గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ మధ్య ఒక సవాలుగా 1900 లో ఈ పోటీ ప్రారంభమైంది. 2023 నాటికి, 155 దేశాల జట్లు పోటీలో పాల్గొన్నాయి.[2]

టోర్నమెంట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన దేశాలు యునైటెడ్ స్టేట్స్ (32 టైటిళ్లు గెలిచి 29 సార్లు రన్నరప్‌గా నిలిచింది), ఆస్ట్రేలియా (22 సార్లు ఆస్ట్రేలియా గానూ, న్యూజిలాండ్‌తో కలిసి ఆస్ట్రలేషియాగా 6 సార్లూ టైటిళ్లను గెలుచుకుంది. 21 సార్లు రన్నరప్‌గా నిలిచింది.) 2023లో ఆస్ట్రేలియాను ఓడించి రెండోసారి టైటిల్‌ గెలుచుకున్న ఇటలీ ప్రస్తుత ఛాంపియన్‌గా ఉంది.

డేవిస్ కప్‌కి సమానమైన మహిళల పోటీ, బిల్లీ జీన్ కింగ్ కప్. దీనిని గతంలో ఫెడరేషన్ కప్ (1963–1995) అని, ఫెడ్ కప్ (1995–2020) అనీ పిలిచేవారు. ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, చెక్ రిపబ్లిక్, యునైటెడ్ స్టేట్స్ మాత్రమే ఒకే సంవత్సరంలో డేవిస్ కప్, ఫెడ్ కప్ రెండు టైటిళ్లనూ గెలుచుకున్న దేశాలు.

1973 వరకు (అంటే, ఓపెన్ ఎరా ప్రారంభమైన ఐదు సంవత్సరాల తర్వాత వరకు) డేవిస్ కప్, ఔత్సాహిక క్రీడాకారులను, జాతీయ స్థాయిలో నమోదైన ప్రొఫెషనల్ ప్లేయర్‌లనూ (1968 నుండి) మాత్రమే అనుమతించింది.[3]

2022 సెప్టెంబరు నాటికి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా రష్యా, బేలారస్ లను పోటీల నుండి సస్పెండ్ చేసారు.[4]

ఆకృతి, కూర్పు

[మార్చు]

టోర్నమెంటు

[మార్చు]

18 అత్యుత్తమ జాతీయ జట్లు వరల్డ్ గ్రూప్‌లో ఉంటాయి. అవి ఏటా డేవిస్ కప్ కోసం పోటీపడతాయి. ఈ ప్రపంచ సమూహంలో లేని దేశాలు మూడు ప్రాంతీయ జోన్లలో (అమెరికా, ఆసియా/ఓషియానియా, ఐరోపా/ఆఫ్రికా) పోటీపడతాయి. ఈ పోటీ సంవత్సరంలో నాలుగు వారాంతాల్లో విస్తరించి ఉంటుంది. పోటీ చేస్తున్న దేశాల మధ్య జరిగే ప్రతి ఎలిమినేషన్ రౌండ్ ఒక్కో దేశంలో నిర్వహిస్తారు. ఐదు మ్యాచ్‌లు (4 సింగిల్స్, 1 డబుల్స్) ఆడతారు. 3 గెలిచిన జట్టు నెగ్గినట్లు. ITF ప్రతి సంవత్సరం టోర్నమెంట్‌కు ముందు అన్ని మ్యాచ్‌అప్‌ల కోసం ఆతిథ్య దేశాలను నిర్ణయిస్తుంది.

వరల్డ్ గ్రూప్ అనేది అగ్రశ్రేణి సమూహం. ఇందులో ప్రపంచంలోని అత్యుత్తమ 18 జాతీయ జట్లు ఉంటాయి. ప్రపంచ గ్రూప్‌లోని జట్లు నాలుగు రౌండ్ల ఎలిమినేషన్ టోర్నమెంటు ఆడతాయి. మునుపటి సంవత్సరాల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని, ITF విడుదల చేసిన ర్యాంకింగ్ సిస్టమ్ ఆధారంగా జట్లకు సీడింగు ఇస్తారు. టోర్నమెంటులో డిఫెండింగ్ ఛాంపియన్, రన్నరప్ ఎల్లప్పుడూ మొదటి రెండు సీడ్‌లుగా ఉంటాయి. మొదటి రౌండ్ మ్యాచ్‌లలో ఓడిపోయిన వారు వరల్డ్ గ్రూప్ ప్లేఆఫ్ రౌండ్‌కు వెళ్తారు. అక్కడ వారు ప్రాంతీయ జోన్‌లలో గ్రూప్ I విజేతలతో కలిసి ఆడతారు. ప్లేఆఫ్ రౌండ్ విజేతలు వచ్చే ఏడాది టోర్నమెంట్ కోసం వరల్డ్ గ్రూప్‌లో ఆడగా, ఓడిపోయిన వారు తమ ప్రాంతీయ జోన్‌లోని గ్రూప్ I లో ఆడతారు.

మూడు ప్రాంతీయ జోన్లు ఒక్కొక్కటి నాలుగు గ్రూపులుగా విభజించబడింది. గ్రూప్‌లు I, II ఎలిమినేషన్ రౌండ్‌లను ఆడతాయి, ఓడిపోయిన జట్లు ఆ తరువాతి కింది గ్రూప్‌కి వెళ్తాయి. గ్రూప్స్ III, గ్రూప్ IVలోని జట్లు రౌండ్-రాబిన్ టోర్నమెంట్ ఆడి ప్రమోషనో. బహిష్కరణో పొందుతాయి.

2019 లో చేసిన మార్పులు

[మార్చు]

2019 ఎడిషన్ నుండి, కప్ ఫార్మాట్‌ను మార్చారు.[5] ప్రధాన మార్పు వరల్డ్‌ గ్రూపు ఒకే చోట, ఒకే వారంలో జరుగుతుంది. పద్దెనిమిది జట్లను మూడేసి జట్లున్న ఆరు రౌండ్-రాబిన్ గ్రూపులుగా విభజించారు. సమూహాలలో విజేతలు, రెండు ఉత్తమ రెండవ స్థానాలు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. ఈ దశలో ఉన్న జట్ల మధ్య సిరీస్‌లో బెస్ట్-ఆఫ్-5 సిరీస్‌లకు బదులుగా రెండు సింగిల్స్ మ్యాచ్‌లు, ఒక డబుల్స్ మ్యాచ్‌లు ఉంటాయి. మ్యాచ్‌లు బెస్ట్ ఆఫ్ 5 సెట్ల నుండి బెస్ట్ ఆఫ్ 3కి మారుతాయి. ఇప్పుడు వరల్డ్ గ్రూప్ ఒకే టోర్నమెంట్‌గా జరుగుతున్నందున ఈ ఈవెంట్‌కు డేవిస్ కప్ ఫైనల్స్ అని పేరు పెట్టారు. దిగువ జోన్ సమూహాలు I, II ప్రమోషన్ లేదా బహిష్కరణను నిర్ణయించే సింగిల్ టైస్‌తో కూడుకుని ఉంటాయి.

ఆకృతి

[మార్చు]
స్థాయి గ్రూపులు
1 వరల్డ్ గ్రూపు

18 దేశాలు

2 మొదటి గ్రూప్ అమెరికాల జోన్

6 దేశాలు

మొదటి గ్రూప్ ఐరోపా/ఆఫ్రికా జోన్

11 దేశాలు

మొదటి గ్రూప్ ఆసియా/ఓషియానియా జోన్

7 దేశాలు

3 రెండవ గ్రూప్ అమెరికాల జోన్

8 దేశాలు

రెండవ గ్రూప్ ఐరోపా/ఆఫ్రికా జోన్

16 దేశాలు

రెండవ గ్రూప్ ఆసియా/ఓషియానియా జోన్

8 దేశాలు

4 మూడవ గ్రూప్ అమెరికాల జోన్

9 దేశాలు

మూడవ గ్రూప్ ఐరోపా జోన్

15 దేశాలు

మూడవ గ్రూప్ ఆఫ్రికా జోన్

10 దేశాలు

మూడవ గ్రూప్ ఆసియా/ఓషియానియా జోన్

9 దేశాలు

5 నాలుగవ గ్రూప్ ఆసియా/ఓషియానియా జోన్

11 దేశాలు

రికార్డులు, గణాంకాలు

[మార్చు]
దేశం విజేతలు రన్నరప్‌గా
సంయుక్త రాష్ట్రాలు 1900, 1902, 1913, 1920, 1921, 1922, 1923, 1924, 1925, 1926, 1937, 1938, 1946, 1947, 1948, 1949, 1954, 1958, 1963, 1968, 1969, 1970, 1971, 1972, 1978, 1979, 1981, 1982, 1990, 1992, 1995, 2007 (32) 1903, 1905, 1906, 1908, 1909, 1911, 1914, 1927, 1928, 1929, 1930, 1932, 1934, 1935, 1939, 1950, 1951, 1952, 1953, 1955, 1956, 1957, 1959, 1964, 1973, 1984, 1991, 1997, 2004 (29)
ఆస్ట్రలేషియా/

ఆస్ట్రేలియా

1907, 1908, 1909, 1911, 1914, 1919, 1939, 1950, 1951, 1952, 1953, 1955, 1956, 1957, 1959, 1960, 1961, 1962, 1964, 1965, 1966, 1967, 1973, 1977, 1983, 1986, 1999, 2003 (28) 1912, 1920, 1922, 1923, 1924, 1936, 1938, 1946, 1947, 1948, 1949, 1954, 1958, 1963, 1968, 1990, 1993, 2000, 2001, 2022, 2023 (21)
ఫ్రాన్స్ 1927, 1928, 1929, 1930, 1931, 1932, 1991, 1996, 2001, 2017 (10) 1925, 1926, 1933, 1982, 1999, 2002, 2010, 2014, 2018 (9)
బ్రిటిష్ దీవులు,

గ్రేట్ బ్రిటన్

1903, 1904, 1905, 1906, 1912, 1933, 1934, 1935, 1936, 2015 (10) 1900, 1902, 1907, 1913, 1919, 1931, 1937, 1978 (8)
స్వీడన్ 1975, 1984, 1985, 1987, 1994, 1997, 1998 (7) 1983, 1986, 1988, 1989, 1996 (5)
స్పెయిన్ 2000, 2004, 2008, 2009, 2011, 2019 (6) 1965, 1967, 2003, 2012 (4)
రష్యా

RTF

2002, 2006, 2020-21 (3) 1994, 1995, 2007 (3)
పశ్చిమ జర్మనీ,

జర్మనీ

1988, 1989, 1993 (3) 1970, 1985 (2)
చెకోస్లోవేకియా,

చెక్ రిపబ్లిక్

1980, 2012, 2013 (3) 1975, 2009 (2)
ఇటలీ 1976, 2023 (2) 1960, 1961, 1977, 1979, 1980, 1998 (6)
క్రొయేషియా 2005, 2018 (2) 2016, 2020-21 (2)
అర్జెంటీనా 2016 (1) 1981, 2006, 2008, 2011 (4)
సెర్బియా 2010 (1) 2013 (1)
స్విట్జర్లాండ్ 2014 (1) 1992 (1)
కెనడా 2022 (1) 2019 (1)
దక్షిణ ఆఫ్రికా 1974 (1)
రొమేనియా 1969, 1971, 1972 (3)
భారతదేశం 1966, 1974, 1987 (3)
బెల్జియం 1904, 2015, 2017 (3)
జపాన్ 1921 (1)
మెక్సికో 1962 (1)
చిలీ 1976 (1)
స్లోవేకియా 2005 (1)

మూలాలు

[మార్చు]
  1. "Andy Murray wins Davis Cup for Great Britain". BBC Sport. 23 November 2015. Archived from the original on 28 November 2018. Retrieved 13 February 2018.
  2. "Davis Cup Format". www.daviscup.com. Archived from the original on 5 January 2016. Retrieved 20 January 2016. In 2023, 155 nations entered Davis Cup by Rakuten
  3. "40 Years Ago: Look Out, Cleveland". www.tennis.com. Archived from the original on 31 October 2020. Retrieved 5 December 2019.
  4. "Davis Cup – Rankings". www.daviscup.com. Archived from the original on 1 May 2011. Retrieved 22 March 2022.
  5. "Historic Davis Cup reforms approved at AGM". Daviscup.com. Archived from the original on 23 November 2018. Retrieved 16 September 2018.