లీ డి ఫారెస్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లీ డి ఫారెస్ట్
జననం(1873-08-26)1873 ఆగస్టు 26
కౌన్సిల్ బ్లఫ్స్, లోవా
మరణం1961 జూన్ 30(1961-06-30) (వయసు 87)
హాలీవుడ్, కాలిఫోర్నియా
వృత్తిఆవిష్కర్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆవిష్కరణలు
జీవిత భాగస్వామిలుసిల్లె సియర్డౌన్
(m.1906; విడాకులు)
నోరా స్టాంటన్ బ్లాచ్ బర్నీ
(m.1907-1911; విడాకులు)
మేరీ మాయో
(m.1912-1923; విడాకులు)
మేరి మస్క్యూని
(m.1930-1961; తన మరణం)
తల్లిదండ్రులుహెన్రీ స్విఫ్ట్ డిఫారెస్ట్
అన్నా రాబిన్స్
బంధువులుకల్వెర్ట్ డిఫారెస్ట్ (మనవడు)
పురస్కారాలుIEEE మెడల్ ఆఫ్ ఆనర్ (1922)
ఇలియట్ క్రిస్సన్ మెడల్ (1923)

లీ డి ఫారెస్ట్ (ఆగష్టు 26, 1873 - జూన్ 30, 1961) తన ఖాతాలో 180 పైగా పేటెంట్లను వేసుకున్న ఒక అమెరికన్ ఆవిష్కర్త. ఇతను "కనిపించని గాలి యొక్క రహస్య సామ్రాజ్యాన్ని నేను కనుగొన్నాను" అనే ప్రసిద్ధ వ్యాఖ్యతో తనకు తానే "రేడియో పితామహుడు" (ఫాదర్ ఆఫ్ రేడియో) అనే పేరు పొందాడు. చలన చిత్రాల తెర మీద బొమ్మకు తగ్గట్లుగా మాట, సంగీతం కూడా జత చేసి వార్నర్‌ సోదరులు ఓ సంచలనాత్మక విజయం సాధించగా, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్‌' ప్రక్రియను లీ డి ఫారెస్ట్‌ కనిపెట్టారు. 1904లో జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ మొదటి రేడియో ట్యూబ్, డయోడ్‌ను కనిపెట్టగా, 1906లో రాబర్ట్ వాన్ లీబెన్, లీ డి ఫారెస్ట్ స్వతంత్రంగా ట్రయోడ్ అని పిలిచే యాంప్లిఫైయర్ ట్యూబ్‌ను అభివృద్ధి చేశారు. తరచుగా 1907లో లీ డి ఫారెస్ట్ వాక్యూమ్ ట్యూబ్ (శూన్య నాళిక) ను కనిపెట్టడంతో ఎలక్ట్రానిక్స్‌ ప్రారంభమైనట్లు చెప్పబడుతుంది. తరువాత 10 ఏళ్ల కాలంలోనే, ఆయన కనిపెట్టిన పరికరాన్ని రేడియో ట్రాన్స్‌మిటర్‌లు, రిసీవర్‌లలో ఉపయోగించారు, అంతేకాకుండా సుదూర టెలిఫోన్ కాల్‌లకు కూడా దీనిని ఉపయోగించడం జరిగింది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.