Jump to content

మల్లేశ్ బలష్టు

వికీపీడియా నుండి
మల్లేశ్ బలష్టు
ఛాయాచిత్రపటం.
జననం
మల్లేశ్ బలష్టు

(1961-01-26) 1961 జనవరి 26 (వయసు 63)
జాతీయతభారతీయుడు
విద్యజానపద కళలశాఖలో ఎం.ఏ, ఎం.ఫిల్, పిహెచ్.డి...
రంగస్థల కళలశాఖలో ఎం.పి.ఏ, ఎం.ఫిల్, పి.జి డిప్లమా..
పద్యనాటకంలో డిప్లమా
వృత్తినటుడు, రచయిత, దర్శకుడు, సినీ నటుడు.
రంగస్థలం, సినిమా
తల్లిదండ్రులుకళావతి, మల్లారి
పురస్కారాలుబెస్ట్ యూత్ అవార్డు - ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ (1998-99)

నంది నాటక పురస్కారం - ఉత్తమ ప్రతినాయకుడు (శాపగ్రస్తులు (నాటిక)), (2007)
పరుచూరి రఘుబాబు నాటక పరిషత్తు - ఉత్తమ ప్రతినాయకుడు (శాపగ్రస్తులు (నాటిక)), (2007)
కళాభారతి పురస్కారం - ఉత్తమ ప్రతినాయకుడు (గాయత్రి డాటరాఫ్ బషీర్ అహ్మద్), (2010)
కందూకూరి విశిష్ట పురస్కారం - నిజామాబాద్ జిల్లా సాంస్కృతిక వ్యవహారాల మండలి (2011)
శోభనాద్రి సాహితీ పురస్కారం - సంస్కార భారతి (2012)

తెలంగాణ రంగస్థల కళాకారుల ఐక్య వేదిక, వరంగల్ - ఉత్తమ నటుడు (11వ రాష్ట్రస్థాయి నాటకపోటీలు, జనవరి 9,10,11 2016)

డా. మల్లేశ్ బలష్టు కవి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినీ నటుడు.

జననం

[మార్చు]

ఈయన నిజామాబాదులో జనవరి 26, 1961 న కళావతి, మల్లారి దంపతులకు జన్మించాడు.

చదువు

[మార్చు]

హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళలశాఖలో ఎం.ఏ, ఎం.ఫిల్, పిహెచ్.డి... రంగస్థల కళలశాఖలో ఎం.పి.ఏ, ఎం.ఫిల్, పి.జి డిప్లమా.. పద్యనాటకంలో డిప్లమా చేశారు.

వృత్తి - ప్రవృత్తి

[మార్చు]
  • వృత్తి - సినిమా, టెలివిజన్, రంగస్థల నటన
  • ప్రవృత్తి - సాహిత్యాధ్యయనం, పరిశోధన

పురస్కారాలు

[మార్చు]
  • బెస్ట్ యూత్ అవార్డు - ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ (1998-99)
  • నంది నాటక పురస్కారం - ఉత్తమ ప్రతినాయకుడు (శాపగ్రస్తులు (నాటిక)), (2007)
  • పరుచూరి రఘుబాబు నాటక పరిషత్తు - ఉత్తమ ప్రతినాయకుడు (శాపగ్రస్తులు (నాటిక)), (2007)
  • కళాభారతి పురస్కారం - ఉత్తమ ప్రతినాయకుడు (గాయత్రి డాటరాఫ్ బషీర్ అహ్మద్), (2010)
  • కందూకూరి విశిష్ట పురస్కారం - నిజామాబాద్ జిల్లా సాంస్కృతిక వ్యవహారాల మండలి (2011)
  • శోభనాద్రి సాహితీ పురస్కారం - సంస్కార భారతి (2012)
  • తెలంగాణ రంగస్థల కళాకారుల ఐక్య వేదిక, వరంగల్ - ఉత్తమ నటుడు (11వ రాష్ట్రస్థాయి నాటకపోటీలు, జనవరి 9,10,11 2016)

సాహిత్యరంగం

[మార్చు]
  • మల్లె కింద ముల్లు - కవిత్వ సంపుటి
దయ్యాలున్నాయి జాగ్రత్త! నాటకంలో మల్లేశ్ బలష్టు

నాటకరంగం

[మార్చు]

విద్యార్థి దశనుండే నాటకాలలో నటిస్తుండేవారు. స్కూల్ వార్షికోత్సవంలో ‘స్కాట్ బాయ్’ నాటకంలో ప్రధాన పాత్రవేసి అందరి మన్నలను పొందాడు. ఉన్నత పాఠశాల చదువు తరువాత నిజామాబాద్ లో స్థానికంగా పనిచేస్తున్న ‘స్నేహమయి సాంస్కృతిక సమాఖ్య’, ‘తన్మయి ఆర్ట్స్ థియేటర్’ లలో చేరి ‘ఇచట పళ్లు రాలగొట్టబడును’, ‘పునరపి’ వంటి నాటకాల ద్వారా జిల్లాలో మంచి గుర్తింపుపొందారు.

ఢిల్లీ లోని ‘సాంగ్ అండ్ డ్రామా డివిజన్’ వారు 1988లో ఏకథాటిగా 2 నెలలపాటు ప్రదర్శించిన ‘ఇందిరా రూపవాణీ’ జీవనాటకంలో వివిధ పాత్రల అభినయంతోపాటు రాజీవ్ గాంధీగా అభినయించిన తీరు అందరిని ఆకట్టుకుంది.

ఆతరువాత ‘జాబిల్లీ కల్చరల్ సోసైటీ’ అన్న కళా సంస్థను యువ కళాకారులతో స్థాపించి జిల్లాలో నెలకొన్న మూఢ నమ్మకాలపట్ల నాటకంద్వారా చైతన్యం కలిగించడానికి కృషిచేశారు. 1999లో జిల్లా యువజన సర్వీసలు శాఖ వారి సౌజన్యంతో ‘జర నిజం తెలుసుకోండ్రి’ అన్న ప్రయోగాత్మక నాటకాన్ని మూఢనమ్మకాల ప్రభావం కలిగిన నిజామాబాద్ జిల్లాలోని సుమారు 40 గ్రామాలలో 50కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. సౌండ్, లైటింగ్ ప్రాధాన్యత కలిగిన ఈ నాటకానికి ఆ సంస్థలోని 40 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు మల్లేశ్ బలష్టు దర్శకత్వంలో పనిచేశారు. ఇదే కాకుండా ఎయిడ్స్, గుట్కా, అందరికీ చదువు, స్త్రీ సంక్షేమం వంటి సామాజిక అంశాలపట్ల ప్రజల్లో చైతన్యం కలిగించడానికి రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వివిధ సంస్థల వీధి నాటకాలలో పనిచేశారు.

తెలుగు విశ్వవిద్యాలయం, రసరంజని లాంటి ఇతర నాటకరంగ సంస్థలతో పనిచేస్తు వారు ప్రదర్శించిన అనేక సాంఘిక, పద్యనాటకాలలో ముఖ్యపాత్రలు ధరించారు.

నటించిన నాటకాలు

[మార్చు]

లెక్కకు మిక్కిలి నాటకాలలో పలు పాత్రలు పోషించాడు. ఇతను నటించిన నాటకాలలో కొన్ని...

  1. శాపగ్రస్తులు
  2. చీమకుట్టిన నాటకం
  3. ప్రొ. పరబ్రహ్మం
  4. అతనికొరకు ఇతను
  5. గాయిత్రి డాటరాఫ్ బషీర్ అహ్మద్
  6. పెళ్ళిసందడి
  7. పంతులు పద్మం ఓ భగవంతుడు
  8. రజాకార్@కలియుగ దుశ్శాసన.కాం
  9. నల్లసముద్రం
  10. నమోనమః
  11. ప్రజానాయకుడు ప్రకాశం
  12. వేణిసంహారం
  13. గయోపాఖ్యానం
  14. దయ్యాలున్నాయి జాగ్రత్త!
  15. స్వామి వివేకనంద మొ.నవి
  16. రచ్చబండ
  17. యజ్ఞం

దర్శకత్వం వహించిన నాటకాలు

[మార్చు]
  1. జర నిజం తెలుసుకోండ్రి
  2. దొంగమామ
  3. దయ్యాలున్నాయి జాగ్రత్త!
  4. కాంతాలు కూతురు కాన్వెంట్కెళ్లింది.
  5. తెగారం

రచించిన నాటకాలు

[మార్చు]
  1. జర నిజం తెలుసుకోండ్రి
  2. దొంగమామ.
పిల్లలతో మల్లేశ్ బలష్టు

టీవిరంగం

[మార్చు]

రచయితగా

[మార్చు]

చాలా ఎపిసోడ్స్ ఆయన రచనా దర్శక నిర్వహణలో నిర్మించబడి పలు ఛానళ్లలో ప్రసారమయ్యాయి. ఎందరో కళాకారులకు ఈ కార్యక్రమాలలో అవకాశం ఇవ్వడం జరిగింది.

  1. దీపావళీ
  2. ఆరురుచులు ఆమని
  3. ఊరించే ఉగాది
  4. సంబరాల సంక్రాంతి
  5. హ్యాపీ హ్యాపీ న్యూఇయర్
  6. మామా కలాపం
  7. ఫిఫ్టీ ఫిఫ్టీ
  8. హాస్య వల్లరి

నటుడిగా

[మార్చు]

దాదాపు 25కి పైగా సీరియళ్లలో నటించారు.

  1. మంచు పర్వతం
  2. కుటుంబరావుగారి కుటుంబం
  3. బొమ్మరిల్లు
  4. కాటమరాజు కథలు
  5. వీర భీం (డి.డి)
  6. ఘర్షణ (విస్సా)
  7. అలౌకిక
  8. కురుక్షేత్రం
  9. నాతిచరామి
  10. కబడ్డీ కబడ్డీ
  11. నమ్మలేని నిజాలు
  12. పద్మవ్యూహం
  13. గీతాంజలి
  14. మహాలక్ష్మ
  15. నేరాలు ఘోరాలు
  16. మాయా బజార్
  17. చక్రతీర్థం (ఈటీవి)
  18. విజయసామ్రాట్
  19. ఉమ్మడి కుటుంబం (జిటీవి)
  20. లాహోర్ సెంట్రల్ జైల్
  21. తూర్పు పడమర
  22. రాధా మధు
  23. సరస్వతి వైభవం
  24. తీరం
  25. రక్తసంబంధాలు (జెమినిటీవి)

సినిమా రంగం

[మార్చు]

రంగస్థలం, టీవిరంగంలోనే కాకుండా కొన్ని సినిమాలలో కూడా నటించాడు.

సినీ జాబితా

[మార్చు]
  1. మేము
  2. మేఘం
  3. రిలాక్స్
  4. ఆంధ్రుడు
  5. పోకిరి
  6. మిస్టర్ మేధావి
  7. అనసూయ
  8. బతుకమ్మ
  9. ఎర్ర సముద్రం
  10. నచ్చావులే
  11. అడుగు
  12. అమరావతి
  13. ఇంకోసారి
  14. మనసారా
  15. బంగారుకోడిపెట్ట
  16. మళ్ళీ రాదోయ్... లైఫ్!
  17. 19 ఎవల్యూషన్స్ ట్రూ లైవ్స్ (ఇంగ్లీష్)
  18. అసుర
  19. తోడ పర్బత్ హిలాయే (హిందీ)
  20. షరతులు వర్తిస్తాయి (2024)

ఇతర వివరాలు

[మార్చు]
  • ఆకాశవాణిలో బి.గ్రేడ్ జానపద గాయకుడిగా, బి.గ్రేడ్ డ్రామా కళాకారునిగా ఆల్ ఇండియా రేడియో గుర్తింపు పొందారు. పలు జానపద లలిత సంగీత రూపకాలు, డాక్యుమొంటరీలు, నాటకాలు వంటి కార్యక్రమాలు, వివిధ ప్రాంతాలలో సంగీత విభావరీలు నిర్వహించారు.
  • కాలమిస్టుగా సాహితీ, సాంస్కృతిక సామాజిక రంగాలకు సంబంధించిన అనేక వ్యాసాలు వివిధ పత్రికలకోసం రాశారు.
  • టీవి, సినిమాలకు డబ్బింగ్ కళాకారునిగా పనిచేస్తున్నారు.
  • వివిధ నాటక ప్రదర్శనలకు సాంకేతిక నిపుణునిగా రంగాలంకరణ, రంగోద్దీపనం, దృశ్యబంధ నిర్మాణం, ముఖాంగరచనలో పాల్గొన్నారు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]