Jump to content

షరతులు వర్తిస్తాయి

వికీపీడియా నుండి
షరతులు వర్తిస్తాయి
దర్శకత్వంకుమార స్వామి (అక్షర )
రచనకుమార స్వామి (అక్షర )
మాటలుపెద్దింటి అశోక్ కుమార్
నిర్మాతశ్రీలత
నాగార్జున్ సామల
తారాగణం
ఛాయాగ్రహణంప్రవీణ్ వనమాలి
శేఖర్ పోచంపల్లి
కూర్పువంశీ కృష్ణ
గజ్జల రక్షిత్ కుమార్
సంగీతంఅరుణ్ చిలువేరు
సురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థ
స్టార్ లైట్ స్టూడియోస్
విడుదల తేదీs
15 మార్చి 2024 (2024-03-15)(థియేటర్)
18 మే 2024 (2024-05-18)(ఆహా ఓటీటీ)
దేశంభారతదేశం
భాషతెలుగు

షరతులు వర్తిస్తాయి 2024లో విడుదలైన తెలుగు సినిమా. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున్ సామల, శ్రీష్ కుమార్ గుండా, డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించిన ఈ సినిమాకు కుమార స్వామి (అక్షర) దర్శకత్వం వహించాడు. చైతన్య రావు, భూమి శెట్టి, నంద కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించాడు.[1]

షరతులు వర్తిస్తాయి సినిమా  టీజర్‌ను నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ఫిబ్రవరి 3న విడుదల చేయగా ఈ కార్యక్రమంలో దర్శకుడు వేణు ఊడుగుల, మామిడి హరికృష్ణ అతిథులుగా పాల్గొన్నారు.[2] ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 3న విడుదల చేయగా, సినిమాను మార్చి 15న విడుదలైంది.[3]

ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి మే 18 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

చిరంజీవి (చైతన్య రావు) తండ్రిని కోల్పోయిన మధ్యతరగతి వ్యక్తి ఒక గవర్నమెంట్ ఆఫీస్‌లో పని చేస్తూ అమ్మ, చెల్లి, తమ్ముడితో కలిసి జీవిస్తుంటాడు. తండ్రి మరణం తర్వాత కుటుంబభారం అతడిపై పడుతుంది. ఈ క్రమంలోనే విజయశాంతి (భూమి శెట్టి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సజావుగా సాగుతున్న వీరి జీవితంలోకి చైన్ సిస్టమ్ వంటి చిట్టీల బిజినెస్ వస్తోంది. చిరంజీవి నమ్మకపోయిన.. భర్తకు తెలియకుండానే ఉన్న డబ్బు మొత్తాన్ని విజయశాంతి ఆ బిజినెస్ లో పెడుతుంది. చివరకు ఆ కంపెనీ బోర్డ్ తిప్పేయడంతో కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. మరి ఆ మోసాన్ని చిరంజీవి ఎలా బయటపెట్టాడు, ఈ మోసాలు చేసేవారిపై ఎలా పోరాటం చేశాడు అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: స్టార్ లైట్ స్టూడియోస్
  • నిర్మాతలు: శ్రీలత, నాగార్జున్ సామల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కుమార స్వామి (అక్షర )
  • సంగీతం: అరుణ్ చిలువేరు & సురేష్ బొబ్బిలి (పన్నెండు గుంజాల)
  • నేపథ్య సంగీతం: ప్రిన్స్ హెన్రీ
  • సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి & శేఖర్ పోచంపల్లి
  • ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
  • ఎడిటింగ్: చి.వంశీ కృష్ణ & గజ్జల రక్షిత్ కుమార్
  • మాటలు: పెద్దింటి అశోక్ కుమార్
  • పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలె

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."పన్నెండు గుంజల పందిర్ల కిందా[7]"పెద్దింటి అశోక్‌ కుమార్‌శంకర్ బాబు, తేలు విజయ, వొల్లాల వాణి, మొగుళ్ల శంకరమ్మ4:13
2."పాల పిట్టల్లె ప్రేమే వాలె[8]"మల్లెగోడ గంగప్రసాద్‌హరిచరణ్, భార్గవి పిళ్ళై4:00
3."కాలం సూపుల గాలంరా[9]"గోరటి వెంకన్నరామ్ మిరియాల3:34
4."తురుమై వచ్చేయ్[10]"పసునూరి రవీందర్ఎంఎల్‌ఆర్‌ కార్తికేయన్‌4:51

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (21 October 2023). "ఈ సినిమా గురించి త్రివిక్రమ్ ఏమన్నారంటే..? 'షరతులు వర్తిస్తాయి'!". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  2. 10TV Telugu (3 February 2024). "'షరతులు వర్తిస్తాయి' టీజర్ రిలీజ్.. చిరంజీవి - విజయశాంతిల ప్రేమకథ." (in Telugu). Archived from the original on 5 February 2024. Retrieved 5 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sakshi (3 March 2024). "సామాన్యుడి కథతో 'షరతులు వర్తిస్తాయి'... ట్రైలర్ రిలీజ్". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  4. Chitrajyothy (18 May 2024). "ఓటీటీలోకి వచ్చేసిన 'షరతులు వర్తిస్తాయి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?". Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
  5. Sakshi (15 March 2024). "'షరతులు వర్తిస్తాయి' రివ్యూ". Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
  6. NTV Telugu (21 October 2023). "'షరతులు వర్తిస్తాయి' అంటున్న 30 వెడ్స్ 21 చైతన్య రావ్.. ఫస్ట్ లుక్ విడుదల !!!". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
  7. Namaste Telangana (30 January 2024). "పన్నెండు గుంజల పందిర్ల కిందా." Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
  8. V6 Velugu (11 February 2024). "పాల పిట్టల్లె ప్రేమ.. షరతులు వర్తిస్తాయి ఫస్ట్ సాంగ్ రిలీజ్". Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Chitrajyothy (20 February 2024). "కాలం సూపుల గాలంరా". Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
  10. Eenadu (12 March 2024). "తురుమై వచ్చేయ్‌.. మెరుపై తెచ్చేయ్‌". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.

బయటి లింకులు

[మార్చు]