మామిడి హరికృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మామిడి హరికృష్ణ
Harikrishna Mamidi.jpg
జననంహరికృష్ణ
శాయంపేట, వరంగల్ జిల్లా, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాదు,తెలంగాణ
వృత్తితెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు
ప్రసిద్ధిమామిడి హరికృష్ణ
మతంహిందూ
తండ్రిసుదర్శన్
తల్లిస్వరాజ్యం

మామిడి హరికృష్ణ కవిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా, చిత్రకారుడి‌గా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు సినిమా విమర్శలో మంచి పేరు సంపాదించిన రచయిత. వివిధ పత్రికలలో వేలాది వ్యాసాలు రాసిన ఆయన రచనలలో సినిమా పూర్వపరాలు, సమకాలీన విశ్లేషణలు చారిత్రక దృష్టితో కనిపిస్తాయి.[1]

నమస్తే తెలంగాణ పత్రిక జిందగీలో మామిడి హరికృష్ణ గురించిన వ్యాసం

జననం - విద్యాభ్యాసం

వరంగల్ జిల్లా, శాయంపేటలోని పద్మశాలి కుటుంబానికి చెందిన సుదర్శన్, స్వరాజ్యం దంపతులకు హరికృష్ణ జన్మించాడు. శాయంపేటలోనే పదవ తరగతి వరకు విద్యను అభ్యసించి, ఇంటర్మీడియట్, డిగ్రీ వరంగల్‌ లోని లాల్ బహదూర్ కళాశాలలో చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎ (సైకాలజీ), కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఈడి చేశాడు.[2]

సాహిత్య ప్రస్థానం

హరికృష్ణ తల్లి స్వరాజ్యం విద్యావంతురాలు. తెలుగు సాహిత్యాన్ని తాను చదవడమేకాకుండా, హరికృష్ణ చేత కూడా చదివించేంది. అలా 9వ తరగతిలోనే చలం, శరత్ చంద్ర ఛటర్జీ, శ్రీశ్రీ, గురజాడ వంటి ప్రముఖ సాహితీవేత్తల సాహిత్యాన్ని చదివాడు. తెలుగు సాహిత్యమేకాకుండా భారతీయ, ప్రపంచ సాహిత్యాన్ని చదివిన ఈయన అనేక అంశాలపై అవగాహన పెంచుకున్నాడు.[3]

కవిగా, రచయితగా

సాహిత్య రంగంలో తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరుచుకున్న హరికృష్ణ, నిరంతరం కవితలు రాస్తూ 2014లో తెలుగు సాహిత్యంలో ‘ఫ్యూజన్ షాయరీ‘ అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. తెలంగాణ భాషలో కవితలు రాస్తూ, ప్రపంచ కవిత పేరిట ప్రపంచంలోని ప్రముఖుల కవితలను తెలుగులో అనువదిస్తూ ప్రపంచ సాహిత్యాన్ని తెలుగువారికి అందిస్తున్నాడు. సినిమా, సాహిత్యం, కళలు, సైకాలజీ, బిహేవియర్ వంటి అంశాలపై దాదాపు పదివేలకుపైగా వ్యాసాలు రాయడమేకాకుండా... తెలుగు, ఇంగ్లీష్ భాషలలో టైమ్స్ పత్రికలలో గెస్ట్ కాలమ్స్ రాశాడు.

పుస్తకాలు

రచన

 1. తెలుగు సినిమాలో భాష-సాహిత్యం-సంస్కృతి
 2. ఊరికి పోయిన యాళ్ళ (దీర్ఘకవితా పుస్తకం - 20 సెప్టెంబరు 2018)
 3. సుషుప్తి నుంచి (కవిత్వం - 20 సెప్టెంబరు 2020)
 4. ఒంటరీకరణ (కవిత్వం)[4]

సంపాదకీయం

 1. ఆశాదీపం (ఎయిడ్స్ పై కవితా సంకలనం)
 2. చిగురంత ఆశ (వినియోగం వికాసం కోసం)
 3. వినియోగం - వికాసం కోసం (వినియోగదారుల హక్కుల చైతన్యంపై తెలుగు సాహిత్యంలో విశిష్ట పుస్తకం)

హోదా

1996లో ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరించాడు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో, వివిధ హోదాలో పనిచేసిన మామిడి హరికృష్ణ 2014, అక్టోబరు 28న తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా నియమితులయ్యాడు.[5][6] సంచాలకుడిగా హరికృష్ణ నిబద్దతను చూసిన కెసీఆర్ మామిడి హరికృష్ణ పదవీకాలాన్ని మరో మూడేళ్ళపాటు (2019 అక్టోబరు 28 వరకు) పొడగించారు.[7]

తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులుగా విజయాలు

 1. తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులుగా వచ్చిన తరువాత తెలంగాణ కళాకారులకు ప్రాముఖ్యత ఇవ్వటంలో గతంలో ఎన్నడూ జరగనన్ని కార్యక్రమాలు చేశాడు.
 2. 'మన ఊరు౼మన చెరువు' పథకానికి చిందు, యక్షగాన కళాకారులు వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించి వారికి ఉపాధి మార్గం చూపించాడు.
 3. తెలంగాణ కళారాధన పేరిట 116 రోజులపాటు నిరంతరంగా రవీంద్రభారతి ప్రాంగణంలో వివిధ కళాప్రక్రియల ప్రదర్శనలు నిర్వహించాడు.
 4. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహించి, కళాకారులను గౌరవించాడు.
 5. గోల్కొండ కోటపై స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించి వివిధ తెలంగాణ కళా ప్రక్రియలను ప్రదర్శించాడు.
 6. జానపద జాతర పేరిట రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జానపద ఉత్సవాలు నిర్వహించాడు.
 7. గోదావరి పుష్కరాల్లోనూ, బతుకమ్మ వేడుకలు, బోనాలు పండుగలోనూ వేల కళాకారులకు అవకాశాలు అందించాడు.
 8. రవీంద్రభారతికి నూతన హంగులు తీసుకువచ్చాడు.[8]
 9. తెలుగుకు ప్రాచీన హోదా రావడంలో ప్రముఖ పాత్ర వహించాడు.[9][10][11][12]
 10. సంచాలకుడిగా శాఖ ప్రచరించిన ఈ క్రింది పుస్తకాలకు సంపాదకత్వం వహించాడు.[13][14]

తెలుగు:

 1. తొలిపొద్దు (2015)
 2. కొత్తసాలు (2016)
 3. తంగేడువనం (2016)
 4. మట్టి ముద్ర (2016)
 5. పద్య తెలంగాణం (2016)
 6. తల్లివేరు (2017)
 7. స్వేదభామి (2017)
 8. ఆకుపచ్చని పొద్దుపొడుపు (2017)
 9. గొల్ల రామవ్వ ఇంకొన్ని నాటికలు (2017)
 10. తెలంగాణ తేజోమూర్తులు (2017)
 11. కళా తెలంగాణం (2017)
 12. పటం కతలు (2017)
 13. తెలంగాణ వాగ్గేయ వైభవం (2017)
 14. తెలుగు కార్టూన్ (2017)
 15. స్మర నారాయణీయం (2017)
 16. అలుగు దుంకిన అక్షరం (2018)
 17. కాకతీయ ప్రస్థానం (2018)
 18. మనకు తెలియని తెలంగాణ (2019)
 19. తారీఖుల్లో తెలంగాణ (2019)
 20. తెలంగాణ రుచులు (2019)
 21. జయ జయోస్తు తెలంగాణ

ఇంగ్లీష్:

 1. కల్చర్ ఆఫ్ తెలంగాణ ఎట్ సూరజ్‌కుండ్ (2016)
 2. తెలంగాణ హార్వెస్ట్ (2017)
 3. ఆదిరంగ్ మహోత్సవ్ (2017)
 4. కల్చర్ ఆఫ్ ఎమిటి (2017)
 5. ఎ గ్రీన్ గార్లాండ్
 6. ఉమెన్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్
 7. వేర్ ది హెడ్ ఈజ్ హైల్డ్ హై (2018)
 8. ఐ విట్‌నెస్ ఆఫ్ ఎన్ ఎపోచ్
 9. మైమ్‌స్కేప్ ఆఫ్ తెలంగాణ

హిందీ:

 1. నయా సాల్ (2017)

సినీరంగ ప్రస్థానం

ఇప్పటివరకు రావూరి భరద్వాజ, సి. నారాయణరెడ్డి మొదలైన వారి గురించి దాదాపు 150 డాక్యుమెంటరీలు తీశాడు. క్లాసిక్ సినిమాలను, సినీరంగానికి చెందిన కళాకారులను పరిచయంచేస్తూ వందేళ్ళ భారతీయ చిత్రంపై 60,70 ఎపిసోడ్లుగా వివిధ భాషల చిత్రాలపై హరికృష్ణ నిర్మించిన డాక్యుమెంటరీలు వివిధ ఛానళ్ళలో ప్రసారమయ్యాయి.[3]

 1. ఏకాంత వాసి (26 నిముషాలు) - రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిన సందర్భంగా (2013)
 2. శతాబ్ధి చిత్రం (50 నిముషాలు) - భారతీయ సినిమా 100 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా
 3. విశ్వంభరుడు - సి. నారాయణరెడ్డి జీవితం, ఆయన రాసిన సినీ పాటలపై

టీవీరంగ ప్రస్థానం

 1. వివిధ టీవీ ఛానల్స్ లో వచ్చిన టాప్ 100 మూవీస్, హాలీవుడ్ 360, ఫార్ములా నెం.1, ఫ్రేమ్ టూ ఫ్రేమ్, బాంబే టాకీస్, డైరెక్టర్స్ మూవీ, జూమ్ బరాబర్ జూమ్, తెలుగు సినిమాలలో వనిత, 100ఏళ్ళ భారతీయ సినిమా, సూపర్ హిట్ సినిమా, రూలర్ వంటి కార్యక్రమాలకు రచయితగా పనిచేశాడు.
 2. సినీరంగ పెద్దల విజయాలపై కథనాలు రాయడమేకాకుండా, శ్యామ్ బెనగళ్, వేటూరి సుందరరామ్మూర్తి, అక్కినేని నాగేశ్వరరావు, సి. నారాయణరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ మొదలైన వారిని ఇంటర్వ్యూలు చేశాడు.
 3. సమకాలీన అభివృద్ధి, టెలివిజన్ ట్రెండ్స్ గురించి ఇడియట్ బాక్స్ పేరుతో ప్రతి వారాంతం వచ్చే 30 నిముషాల కార్యక్రమాన్ని, స్పెషల్ ఫోకస్ పేరుతో సమకాలీన విషయంపై కార్యక్రమాన్ని రూపొందించాడు.
 4. వావ్ - మంచి కిక్ ఇచ్చే గేమ్ షో (ఈటీవీ - సాయి కుమార్); రాజు రాణి జగపతి (ఈటీవి - జగపతిబాబు); యువర్స్ టైం స్టార్ట్స్ నౌ (ఎన్ టీవి - ఝాన్సీ); , అభిమాని (రాజీవ్ కనకాల) వంటి గేమ్ షోలకు రూపకల్పన, పరిశోధన, రచనలు చేశాడు.[15] వావ్ గేమ్ షో మూడవ సీజన్ ప్రసారమవుతూ, ఇతర భాషల ఛానళ్ళలో కూడా రూపొందించబడింది.

గుర్తింపులూ, పురస్కారాలు

 1. లాసెట్‌లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం, ఎంఈడీ సెట్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం స్థాయిలో మొదటి స్థానం, బిఈడీ సెట్‌లో రాష్ట్రస్థాయిలో ఐదవ స్థానంలో నిలిచాడు.
 2. 2009, 2012 సంవత్సరాల్లో ఉత్తమ సినీ విమర్శకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే నంది పురస్కారాలు అందుకున్నాడు.[16]
 3. 2010 నంది బహుమతుల జ్యూరీ సభ్యుడిగా పనిచేసాడు.
 4. ఊరికి పోయిన యాళ్ళ కవితా సంకలనంలోని ‘పండుగ‘ అనే కవితనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ సింపోజియం ఆఫ్ పోయెట్స్-2020కి ఎంపిక చేయబడింది.[17] ఈ కవితకు జాతీయస్థాయి పురస్కారం కూడా అందుకున్నాడు.[1] జాతీయస్థాయి పురస్కారం అందుకున్న తెలంగాణ భాష తొలి కవిత ఇది.
 5. యువ సినిమా కళాకారులకు ప్రోత్సాహం అందిస్తూ, తెలంగాణ సినిమారంగం కోసం కృషిచేస్తున్నందుకు 2018లో ఇండివుడ్ అవార్డు, 2019లో జీ సినిమా అవార్డు అందుకున్నారు.
 6. కొన్ని సంవత్సరాల కాలం క్రితం సాహితీకారులకు, కవులకు చిరపరిచితమైన హరికృష్ణ వివిధ వార, దిన పత్రికల్లో పలు సందర్భాల్లో విభిన్న కవితలు, వ్యాసాలు రాసి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
 7. తెలంగాణ కవితలను ఆంగ్లంలోకి అనువదించి తెలంగాణ కవితలకు అంతర్జాతీయ గుర్తింపును సాధించాడు.

మూలాలు

 1. 1.0 1.1 మన తెలంగాణ, కలం (30 December 2019). "తెలంగాణ బతుకు చిత్రణ". Archived from the original on 20 April 2020. Retrieved 20 April 2020.
 2. బహుముఖ ప్రజ్ఞాశాలి మామిడి హరికృష్ణ, డా. బాసని సురేష్, దక్కన్ ల్యాండ్, అక్టోబరు 2019, పుట. 23.
 3. 3.0 3.1 అక్షరం నాకు మా అమ్మ ఇచ్చిన వరం (మామిడి హరికృష్ణ ఇంటర్వ్యూ), పాలపిట్ట మాసపత్రిక, డిసెంబర్ 2017, హైదరాబాదు, పుట. 52.
 4. "అమ్మ మనసు - Sunday Magazine". EENADU. Archived from the original on 2021-09-11. Retrieved 2021-12-13.
 5. వన్ ఇండియా. "భాషా సాంస్కృతిక డైరెక్టర్‌గా మామిడి హరికృష్ణ". Archived from the original on 5 November 2016. Retrieved 23 July 2016.
 6. సాక్షి, తెలంగాణ, కథ. "సాంస్కృతిక శాఖ సంచాలకునిగా హరికృష్ణ!". Retrieved 28 December 2016.
 7. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (14 October 2016). "మామిడి హరికృష్ణ పదవీకాలం పొడిగింపు". Retrieved 20 October 2016.
 8. నవతెలంగాణ (16 November 2015). "భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా మామిడి హరికృష్ణ ఏడాది ప్రస్తానం". Retrieved 20 October 2016.
 9. నమస్తే తెలంగాణ (9 August 2016). "తెలుగు ప్రాచీనహోదాకు తిరుగులేదు". Retrieved 20 October 2016.
 10. నమస్తే తెలంగాణ (28 August 2016). "మన తెలుగు వెలుగు ప్రాచీన హోదాపై కవర్ కథనం". Archived from the original on 25 January 2019. Retrieved 20 October 2016.
 11. నమస్తే తెలంగాణ (27 July 2016). "తెలంగాణ వల్లే..త్వరలో తెలుగుకు ప్రాచీన హోదా..!". Retrieved 20 October 2016.
 12. ఆంధ్రజ్యోతి. "తెలుగు ప్రాచీనమే". Retrieved 3 March 2017.
 13. Telangana Today (24 February 2019). "When Telugu took centre stage". Telangana Today. Madhulika Natcharaju. Archived from the original on 3 August 2019. Retrieved 3 August 2019.
 14. మనతెలంగాణ, తెలంగాణ (15 September 2019). "జానపదుల చేతిలోని తీపి మామిడి". డా. బాసని సురేష్. Archived from the original on 1 October 2019. Retrieved 1 October 2019.
 15. నమస్తే తెలంగాణ, ఎడిటోరియల్ (5 April 2020). "నిర్జనమ్‌". Archived from the original on 13 April 2020. Retrieved 13 April 2020.
 16. తెలుగు ఫిల్మీబీట్. "నా నంది తెలంగాణాకు అంకితం". telugu.filmibeat.com. Retrieved 3 March 2017.
 17. ఈనాడు, ప్రధానాంశాలు. "జాతీయస్థాయి సమ్మేళనానికి మామిడి హరికృష్ణ కవిత". www.eenadu.net. Archived from the original on 20 April 2020. Retrieved 20 April 2020.

బయటి లింకులు