పద్మశాలీలు

వికీపీడియా నుండి
(పద్మశాలి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పద్మశాలీ భార్గవలు
మగ్గంపై చీరను నేస్తున్న చేనేత కళాకారుడు
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్
భాషలు
కన్నడ, తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ
మతం
హిందూ

పద్మశాలీ అనేది భారతదేశంలో ఒక సామాజిక వర్గం. పద్మశాలి కులానికి చెందిన వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తారు.[1] వీరు అనుసరించి మతం శైవులు, వైష్ణవులుగా ఉన్నారు. వృత్తులను అనుసరించి కైకాల, కర్ణభక్తులు, సేనాపతులు, తొగటసాలీలుగా విడిపోయారు. గతంలో కేవలం చేనేత వృత్తిలో జీవనం సాగించిన పద్మశాలీయులు ప్రస్తుతం అనేక వృత్తులపై జీవనం గడుపుతున్నారు.[2] [3][4]భారత రాజ్యాంగం వీరిని ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా పరగణించి ఓబిసి గా వర్గీకరించంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బీసీ-బి విభాగానికి చెందుతారు.[5]

నిర్వచనం

[మార్చు]

పద్మం అనగా తామర పువ్వు లేదా కమలం అని అర్థం. శాలి అనగా వస్త్రము తులు భాషలో సాలీ అనగా సాలెపురుగు. పద్మశాలి అను పదానికి భౌతికంగా విజ్ఞానం అని అర్థము. వైష్ణవుల ప్రకారం పద్మం అనగా ఉన్నతమైన మానవుడి మేధస్సును ప్రతిబింబించే సహస్రధార పద్మం అని అర్థము.[6][7] శైవుల ప్రకారము మానవాళి యొక్క నగ్నత్వానికి వస్త్రాలు ధరింపచేయాలనే ఉద్దేశంతో శివుడు మార్కండేయని యాగాన్ని నిర్వహించమని చెప్పాడు. ఆ యాగం నుంచి భావన అను ఋషి చేతిలో పద్మముతో ఉద్భవించాడు.. అతడు సూర్యభగవానుడి కుమార్తెలైన ప్రసన్నవతి, భద్రావతిలను వివాహం చేసుకొని నూరున్నొక్క కుమారులకు తండ్రి అయ్యాడు. ఆ కుమారులు పద్మము యొక్క నారతో వస్త్రాలను తయారు చేసే వృత్తిని ఎన్నుకొని పద్మశాలీల నూరున్నొక్క గోత్రాలకు గోత్ర పురుషులయ్యారు.

గ్రంథ మూలాలు

[మార్చు]

హిందూ గ్రంథాల ప్రకారం పద్మశాక అనువాడు బ్రహ్మ తమ కులానికి ఇచ్చిన అద్భుతమైన రత్నం యొక్క మహిమను గణపతి(వినాయకుడు)కి వివరించేందుకు విముఖత చూపాడు. ఫలితంగా గణపతి శాపంతో పద్మశాలీలు బ్రాహ్మణ స్థాయిని కోల్పోయారు. శాపవిమోచనం కోసం పద్మశాలీ కులానికి చెందిన పరబ్రహ్మ మూర్తి (పద్మ భావనాచార్య) అను కారణ జన్ముడు గణపతికి మొర పెట్టుకున్నాడు. పర బ్రహ్మమూర్తి తపస్సుకు మెచ్చిన గణపతి.. కలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత పద్మశాలీలు శాపవిమోచనం పొందుతారని చెప్పాడు. ఈ పరబ్రహ్మమూర్తి తన కులస్థులను 101 గోత్రాలతో 8 శాఖలుగా విడదీసి 4 మఠాలు స్థాపించి వాటికి గురువులను నియమించాడు

ఆచార వ్యవహారాలు

[మార్చు]

పద్మశాలీలకు ఆచార వ్యవహారాల్లో చాలా వ్యత్యాసం ఉంది. పద్మశాలిలు భృగువంశ బ్రాహ్మణలు, వేద శాకలో విరు ఋగ్వేద బ్రాహ్మణలు, పద్మశాలీల్లో శాఖ వార తింటున్నారు. అంతకు ముందు వీరు శాకాహారులే. వీరి ఆచార వ్యవహారాల్లో ఆర్య, ద్రవిడ సంస్కృతులు కనిపిస్తాయి. పద్మశాలీలకు ఉపనయన సంస్కారము జంధ్యము ధారణ ఉంటుంది.[8]

గోత్రాలు

[మార్చు]

పద్మశాలీ కులానికి 101 గోత్రాలు ఉన్నాయి. మార్కండేయ గోత్రముతో కలిపి మొత్తం 102 గోత్రాలు ఉన్నాయి. గోత్రాన్ని మరిచిపోతే మార్కండేయ గోత్రం అనే నానుడి వీరిలో ఉంది.

1. పౌరుష, 2. దక్ష, 3. వాలఖిల్య, 4. వసిష్ఠ, 5. వృక్ష, 6. బృహతి, 7. దారుక, 8. వణక, 9. విశ్వ, 10. కశ్యప, 11. కుత్స, 12. మౌయా, 13. పవన, 14. వైశీన, 15. జమదగ్ని, 16. మాండవ్య, 17. యదు, 18. కాశిల, 19. త్రిశంక, 20. దుర్వాస, 21. జటిల, 22. వేదమత, 23. విదు, 24. భారత, 25. ఊర్ధ్వాస, 26. ఉపేంద్ర, 27. వనజాల, 28. అంబరీష, 29. ధనుంజయ, 30. మధు, 31. చ్యవన, 32 భిక్షు,33. పశునక, 34. కౌండిల్య, 35. సత్యకర్మ, 36. తక్ష, 37. ప్రవృక్ష 38. ఋఋక్ష్మ 39. పురూ, 40. పులస్త్య, 41. సాధు, 42 గారేయ, 43. కపిల, 44. సంస్థిత, 45. త్రిహూ, 46. నిశ్చిత, 47. సఋక్ష, 48. పృథ్వి, 49. పౌండ్రక, 50. ఉదయపావన, 51. కౌశిక, 52, బ్రహ్మ, 53. మను, 54. ఝారీల, 55. కమండల, 56. ఆత్రేయ, 57. ఋశ్యశృంగ, 58. దిగ్వాస, 59. పురాశన, 60. వనసంజ్ఞక, 61. సింధు, 62. పౌష్నల,63. రోనక, 64, రఘు, 65. తుష్ట, 66. ఆశ్రమ, 67. భార్గవ,68. సుభిక్ష, 69. చొక్రిల, 70. ఆంగీరస, 71. భరద్వాజ, 72. ప్రష్ట, 73. కౌశిక, 74, వైదృత, 75. సపిల్వక, 76. సుతీక్షసూర్య, 77. చంద్ర,78. శుక, 79. శౌనక, 80. మారీచ, 81. నియంత, 82. సూత్ర, 83. తృష్ణ, 84. శాండిల్య, 85. పుణ్యవ, 86. స్రాంశ, 87. సుకీర్తి,88. వాచ్విక్, 89. మానస్పి, 90. అగస్త్య, 91. ధేనుక, 92. పుత్త, 93. వ్యాస, 94. గుహ, 95. ఆత్రి, 96. పరాశర, 97. గౌతమ, 98. ప్రాంచీవ, 99. ఊర్జేశ్వర, 100. స్వయంభు, 101. నారద, 102. మార్కండేయ.103. శ్రీ వత్సల మహర్షి

ఇబ్బందులు

[మార్చు]

చేనేత వృత్తికి గతంలో గొప్ప గౌరవం దక్కేది. ఈ వృత్తిపై ఆధారపడిన పద్మశాలీలకూ ఎంతో గౌరవం ఉండేది. ప్రస్తుతం మరమగ్గాలు, మిల్లులు రావడంతో వాటితో చేనేత కార్మికులు పోటీ పడటం అసాధ్యం అయింది. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. వేరే పనులు చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వ పరంగా ఆర్థిక తోడ్పాటు ఉంటే బాగుంటుందని విశ్లేషకుల భావన.

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
 1. ఆలె నరేంద్ర - తెలంగాణా నాయకుడు
 2. దేవరకొండ విఠల్ రావు - మాజీ యం.పి, మహబూబ్ నగర్
 3. గజం అంజయ్య - సుప్రసిద్ధ చేనేత డిజైనర్, పద్మశ్రీ గ్రహీత
 4. ప్రగడ కోటయ్య - జాతీయోద్యమ నాయకుడు
 5. గుండు హనుమంతరావు - సినీ నటుడు
 6. జయప్రద - సినీ నటి, రాజకీయ నాయకురాలు
 7. ఊర్వశి శారద - సినీ నటి, రాజకీయ నాయకురాలు
 8. కొండా లక్ష్మణ్ బాపూజీ - తెలంగాణా నాయకుడు
 9. ఎన్. గోపి - ఆచార్యుడు
 10. అనుమాండ్ల భూమయ్య - ఆచార్యుడు
 11. బి.ఎస్. రాములు - సామాజిక తత్త్వవేత, రచయిత.
 12. మామిడి హరికృష్ణ - కవి, రచయిత, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌
 13. బొమ్మకంటి శ్రావణ్ కుమార్ - సీనియర్ జర్నలిస్టు, నమస్తే తెలంగాణ
 14. ఏలె లక్ష్మణ్ - చిత్రకారుడు
 15. సంగిశెట్టి శ్రీనివాస్ - సాహితీవేత్త
 16. పత్తిపాక మోహన్ - సాహితీవేత్త
 17. పసునూరి శ్రీధర్ బాబు - కవి, రచయిత, జర్నలిస్టు
 18. పెండెం జగదీశ్వర్ - బాలల కథా రచయిత, కార్టూనిస్టు
 19. పెద్దింటి అశోక్ కుమార్ - కథా రచయిత
 20. ప్రణయ్‌రాజ్ వంగరి - నాటకరంగ పరిశోధకుడు, తెలుగు వికీపీడియా నిర్వాహకుడు.
 21. లయ - సినీనటి
 22. నటరాజ రామకృష్ణ - నాట్య కళాకారుడు
 23. నల్లి కుప్పుస్వామి చెట్టి - వస్త్ర పారిశ్రామికవేత్త
 24. బుట్టా రేణుక - రాజకీయ నాయకురాలు
 25. కొండా సురేఖ - రాజకీయ నాయకురాలు
 26. లోకా మలహరి - ప్రముఖ రచయిత, సిద్దాంతాచార్యులు
 27. పంచుమర్తి అనురాధ - రాజకీయ నాయకురాలు
 28. రోషం బాలు - సినీ నటుడు, రాజకీయ నాయకుడు
 29. వంగరి త్రివేణి - రచయిత్రి, కవయిత్రి
 30. వంగరి నర్సయ్య - స్వాతంత్ర్య సమరయోధుడు
 31. రాజేష్ కుమార్ నల్ల - యువ పారిశ్రామికవేత్త
 32. ఎల్. రమణ - తెలంగాణా నాయకుడు
 33. కాండ్రు శ్రీనివాసరావు - మాజీ మునిసిపల్ చైర్మన్ , మంగళగిరి

మూలాలు

[మార్చు]
 1. "From scrolls to masks: how Telangana's 400 years old cheriyal paintings have evolved". www.thenewsminute.com. 5 September 2018. Retrieved 2019-08-25.
 2. Singh, Kumar Suresh; India, Anthropological Survey of (1996). Identity, ecology, social organization, economy, linkages and development process: a quantitative profile (in ఇంగ్లీష్). Anthropological Survey of India. p. 109. ISBN 978-0-19-563353-5.
 3. Shivappa, H. V. (2001). Indian silk industry (in ఇంగ్లీష్). Ganga Kaveri Pub. House. p. 67. ISBN 9788185694351.
 4. Roy, Sarat Chandra (1992). Man in India (in ఇంగ్లీష్). A. K. Bose. p. 143.
 5. Singh, Kumar Suresh (1996). Communities, Segments, Synonyms, Surnames and Titles (in ఇంగ్లీష్). Anthropological Survey of India. p. 1654. ISBN 978-0-19-563357-3.
 6. The Indian Textile Journal (in ఇంగ్లీష్). Business Press. 1984. p. 63.
 7. Arterburn, Yvonne J. (1982). The loom of interdependence: silkweaving cooperatives in Kanchipuram (in ఇంగ్లీష్). Hindustan Pub. Co. p. 46. ISBN 9780391027497.
 8. Subrahmanyam, Y. Subhashini (1975). Social Change in Village India: An Andhra Case Study (in ఇంగ్లీష్). Prithvi Raj Publishers. p. 76.

బాహ్య లంకెలు

[మార్చు]