ఎన్. గోపి
స్వరూపం
ఆచార్య ఎన్.గోపి | |
|---|---|
| జననం | ఎన్.గోపాల్ 1950 జూన్ 25 |
| ఇతర నామము | ఎన్.గోపాల్ |
| వృత్తి | ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి పూర్వపు అధ్యక్షుడు , పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపసంచాలకులు |
| జీవిత సహచరి | ఎన్. అరుణ |



ఆచార్య ఎన్. గోపి (జ. జూన్ 25, 1950) తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి అధ్యక్షుడిగాను, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపసంచాలకునిగాను పనిచేశాడు. నాలుగు ఫంక్తులు మొత్తం 20 నుండి 25 అక్షరాలతో సాగే నానీలు అనే సూక్ష్మ కవితా పద్ధతిని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టాడు.[1][2]
గోపి జూన్ 25, 1950లో యాదాద్రి - భువనగిరి జిల్లా భువనగిరిలో జన్మించాడు.[3] ఈయన పూర్తిపేరు ఎన్.గోపాల్.[4] అధ్యాపక వృత్తిలో చాలా ఏళ్లు పనిచేశాడు. ఇతని భార్య ఎన్.అరుణ కుడా పేరు పొందిన కవయిత్రి. పదవీ విరమణ చేసేటప్పడికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలో డీన్ గా పనిచేశాడు. గోపీ 61 పుస్తకాలు దాకా ప్రచురించాడు. అందులో 30 కవితా సంకలనాలు కూడా ఉన్నాయి.
రచనలు
[మార్చు]కవిత్వం
[మార్చు]- తంగెడుపూలు 1976
- మైలురాయి 1981
- చిత్రదీపాలు - 1989
- వంతెన 1993
- కాలాన్ని నిద్రపోనివ్వను 1998 రెండు ముద్రణలు
- నానీలు - 1998 - రెండు ముద్రణలు
- చుట్టకుదురు - 2000
- ఎండపొడ 2002
- గోపి నానీలు - 2002
- జలగీతం 2002 - రెండు ముద్రణలు
- మరో ఆకాశం - 2004
- అక్షరాల్లో దగ్ధమై 2006
- దీపం ఒక ఏకాంతం 2007
- గోవాలో సముద్రం 2008
- వాన కడిగిన చీకటి 2009
- మా ఊరు మహాకావ్యం - 2010
- రాతి కెరటాలు- 2011
- హృదయరశ్మి - 2013
- మళ్ళీ విత్తనంలోకి - 2014
- పురివిప్పిన ఊపిరి - 2015
- ఆకాశంలో మట్టి 2016
- జీవన భాష 2017
- ఎవరి దు:ఖమో అది 2018
- చైనా పద్యాలు 2019
- వృద్ధోపనిషత్ - 2019
- ప్రపంచీకరోనా - 2020
- మనిషిని కలిసినట్టుండాలి 2021
- క్రియ ఒక జీవన లయ -2023
- రేపటి మైదానం 2024
- కీలుగుర్రం (బాల గేయాలు) - 2024
విమర్శనా గ్రంథాలు
[మార్చు]- వ్యాస నవమి - 1986
- గవాక్షం 1992
- నిలువెత్తు తెలుగు సంతకం - సినారె వ్యక్తిత్వం 1992
- సాలోచన 1998
- వ్యాస కలశం - 2012
- వ్యాస జిజ్ఞాస 2016
పరిశోధన
[మార్చు]- ప్రజాకవి వేమన - 1980 - ఏడు ముద్రణలు
- వేమన పద్యాలు (పారిస్ ప్రతి క్రీ.శ. 1730) – 1990 రెండు ముద్రణలు
- తొలి పరిశోధకులు 1998
- వేమన్న వెలుగులు (వ్యాఖ్యానం) 2012
అనువాదాలు
[మార్చు]- జ్ఞానదేవ 1985
- తన్మయ ధూళి - 2012
- మా ఊరి నది - 2016
- పాగీ 2016
- విద్యాపతి ప్రణయగీతాలు - 2016
- కాల విజేత 2020
యాత్రాచరిత్రలు
[మార్చు]- నేను చూసిన మారిషస్ - 1996
- నా సైప్రస్ యాత్ర - 2001
- అమెరికాలో తెలుగు యాత్ర 2002
- ఇంగ్లండులో ఇరవై ఐదు రోజులు 2004
- జర్మనీలో నా కవితా యాత్ర 2015
- చైనాలో కవితా యాత్ర 2019
ఇతరాలు
[మార్చు]- వేమన్నవాదం (వ్యాఖ్యానం) 1979 - ఐదు ముద్రణలు
- తెలుగు వాచకం (పాఠ్య గ్రంథం) - 1982
- ప్రయోజన వాచకం - వయోజన విద్యా వాచకం 1983
- అక్షరయానం (కాలం రైటింగ్) - 2005
పురస్కారాలు
[మార్చు]- తంగెడు పూలు కవితా సంపుటికి 1980లో కృష్ణశాస్త్రి అవార్డు
- మైలురాయి కవితాసంపుటికి 1982లో ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం
- మైలురాయికి తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం
- చిత్రదీపాలు కవితాసంపుటికి సినారె కవితాపురస్కారం
- చిత్రదీపాలు కవితాసంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమకవితాసంపుటి బహుమతి (1990)
- 2006 సంవత్సరానికి సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఉత్తమ సిటిజన్ అవార్డ్
- దాశరథి సాహితీ పురస్కారం (2017) - తెలంగాణ ప్రభుత్వం[5]
మూలాలు
[మార్చు]- ↑ Short Poems By Jean Elizabeth Ward పేజీ.3
- ↑ "ఈనాడు సాహిత్యంలో నానీలపై డాక్టర్ మణిగోపాల్ వ్యాసం". Archived from the original on 2010-06-12. Retrieved 2009-03-28.
- ↑ EENADU (2 May 2024). "ఆరో తరగతిలో వేయి పడగలు నవల చదివా". Archived from the original on 2 May 2024. Retrieved 2 May 2024.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-06-12. Retrieved 2009-10-18.
- ↑ Telangana Today (22 July 2017). "Acclaimed poet Gopi conferred with Dasarathi Sahiti Puraskar". Archived from the original on 2018-07-26. Retrieved 27 July 2018.
వర్గాలు:
- నానీల కవులు
- 1948 జననాలు
- తెలుగు కవులు
- ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు
- జీవిస్తున్న ప్రజలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలంగాణ రచయితలు
- పొట్టిపేరుతో పేరుపొందిన తెలంగాణ వ్యక్తులు
- యాదాద్రి భువనగిరి జిల్లా కవులు
- యాదాద్రి భువనగిరి జిల్లా సాహితీ విమర్శకులు
- యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యాయులు
- యాత్రా చరిత్ర రచయితలు