వర్గం:నానీల కవులు
Appearance
నాగిశెట్టి తాతయ్య నాయుడు :
కవి ,రచయిత. నాగిశెట్టి గా సుపరిచితులు.మూడు నానీల సంపుటాలను రచించాడు.నాగిశెట్టి రచించిన నానీల సంపుటాలు గడ్డి చేమంతులు, మనిషి కోసం, నాగిశెట్టి నానీలు .ఈయన రచించిన మట్టి బంగారం[1] వచన కవితా సంపుటి సాహితీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.ఈయన రచించిన కథలు వెలుగు నీడలు, ఎడారిలో మంచుకొండ, ఎండమావి, డెడ్ లైన్ ,పైపంచె జారింది వంటి అనేక కథలు వివిధ పత్రికలలో ప్రచురించబడి గుర్తింపు ను తెచ్చి పెట్టాయి.వీరు వృత్తి రీత్యా ఉపాద్యాయులు. ప్రవృత్తి రచనలు చేయడం.వీరి జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలానికి చెందిన ప్రసాదంవారిపాలెం.
- ↑ నాగిశెట్టి, తాతయ్యనాయుడు (2010). మట్టి బంగారం. క్రీసెంట్ పబ్లికేషన్స్ విజయవాడ.
వర్గం "నానీల కవులు" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 22 పేజీలలో కింది 22 పేజీలున్నాయి.