మల్లావఝ్ఝల నారాయణ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లావఝ్ఝల నారాయణ శర్మ
M. Narayana Sharma.jpg
మల్లావఝ్ఝల నారాయణ శర్మ
జననంఎం.నారాయణ శర్మ
(1971-10-24) 1971 అక్టోబరు 24 (వయస్సు: 48  సంవత్సరాలు)
కరీంనగర్, కరీంనగర్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
నివాస ప్రాంతంహైదరాబాద్
వృత్తిసంస్కృత లెక్చరర్‌
ప్రసిద్ధిప్రముఖ కవి, విమర్శకులు.
మతంహిందూ
భార్య / భర్తఅరుణా నారదభట్ల
పిల్లలుభాషిత
తండ్రిరామచంద్ర శర్మ
తల్లిరమాదేవి

మల్లావఝ్ఝల నారాయణ శర్మ (ఎం.నారాయణ శర్మ) ప్రముఖ కవి, విమర్శకులు. కవి సంగమం రచయితలలో ఒకరు.

జననం[మార్చు]

మల్లావఝ్ఝల రామచంద్ర శర్మ, రమాదేవి దంపతులకు 1971, అక్టోబరు 24న కరీంనగర్ జిల్లా కేంద్రంలో జన్మించారు.

నివాసం - ఉద్యోగం[మార్చు]

హైదరాబాద్‌లో ఉంటున్నారు. సంస్కృత లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.

వివాహం - పిల్లలు[మార్చు]

నారాయణ శర్మకు అరుణా నారదభట్ల గారితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు (భాషిత).

ప్రచురితమైన మొదటికవిత[మార్చు]

"ఆశాజ్యోతి" స్కూల్‌లో ఆరవ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ మాగజైన్ "చైతన్య"లో మొదటికవిత ప్రచురితమైంది.

ప్రచురితమైన పుస్తకాలు[మార్చు]

 1. ఉప్పెన (కవిత్వం) -1997
 2. సృష్టి (దీర్ఘ కవిత) -1998
 3. తమో చిత్రాలు (కవిత్వం) -1999
 4. ప్రగతిబాల (శతకం) -1999[1]
 5. డా.ఎన్.గోపి కవితా రూప సృష్టి నానీలు పరిశీలన (విమర్శ) -2005
 6. అస్తిత్వ పుష్పాలు (నానీలు) -2011[2]
 7. డా.సి.నారాయణ రెడ్డి-నాగార్జున సాగరం-కళా సాహితీ ఛందఃపరిశీలన (విమర్శ) -2012
 8. ఈనాటి కవిత (కవిసంగమం కవుల కవిత్వంపై విశ్లేషణ) -2014[3][4]
 9. ఊరిదుఃఖం (జూకంటి జగన్నాథం కవిత్వం పై విమర్శ) -2016
 10. సాధారణ (కవిత్వ విమర్శ)2016
 11. వ్యక్తీకరణ (కవిత్వ విమర్శ) -2016
 12. జలగీతం సంస్కృతానువాదం(తెలుగు మూలం డా.ఎన్.గోపి(-2018.)
 13. .విశ్వమానవతా వీచికలు(తిరుమల శ్రీనివాసా చార్యుల రుబాయిల పరిశీలన)-2018
 14. .జలగీతం కావ్య సమాలోచనం -(కవిత్వ విమర్శ)2017)

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు[మార్చు]

 1. ఎం.వి.నరసింహారెడ్డి పురస్కారం (శాతవాహన విశ్వవిద్యాలయం) నాగార్జున సాగరం విమర్శకు.
 2. తేజ పురస్కారం- నాగార్జున సాగరం విమర్శకు.
 3. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం (విమర్శకు)-2018
 4. తెలుగు సాహిత్య కళాపీఠం విశిష్టపురస్కారం (విమర్శకు)2018
 5. సమైక్య సాహితి రావికంటి రామయ్య గుప్త స్మారక పురస్కారం-2019

మూలాలు[మార్చు]

 1. నవతెలంగాణ, దర్వాజ, స్టోరి. "ఉపాధ్యాయ వృత్తిపై తెలుగు కవిత్వం". Retrieved 24 January 2017. Cite news requires |newspaper= (help)
 2. నవతెలంగాణ, అంకురం, స్టోరి. "సాహితీ 'సోపతి'". Retrieved 24 January 2017. Cite news requires |newspaper= (help)
 3. నమస్తే తెలంగాణ. "వి సంగమం నుంచి కవిత్వ విమర్శ". Retrieved 24 January 2017. Cite news requires |newspaper= (help)
 4. నవ తెలంగాణ. "కవిత్వ రహస్యాల్ని చెప్పిన రచన". Retrieved 24 January 2017. Cite news requires |newspaper= (help)

ఇతర లంకెలు[మార్చు]