ఆజాది కా కవి సమ్మేళన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. మామిడి హరికృష్ణ చేత సత్కారం అందుకుంటున్న జూకంటి జగన్నాథం
1993లో ఆయన సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. 2007- 2013ల మధ్య తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షునిగా వ్యవహరించారు. 2014 నుంచి ప్రస్తుతం అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. శ్రమదోపిడీ, రాచరిక వ్యవస్థ, ప్రభుత్వ వైఫల్యాలను తన కవితలు, రచనల ద్వారా ఎండగట్టారు. ప్రపంచీకరణపై మొదట్లోనే నిరసన గళం విప్పిన కవి ఆయన. స్థానిక మాండలికంతో సాగే ఆయన కవితలు కన్నడ, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువాదమయ్యాయి.[4]
జగన్నాథం ప్రధానంగా వచన కవిత్వం రాస్తారు. కథల సంకలనం కూడా వచ్చింది. వీరి కవిత్వంపై యం. నారాయణ శర్మ విశ్లేషణ చేసి ఊరి దుఃఖంపేరుతో ఒక వ్యాసాల పుస్తకాన్ని ప్రచురించారు.[5] అభ్యుదయ, విప్లవ, దళిత, బహుజన, మైనార్టీ వాదాల కవిత్వం రాశారు. ప్రధానంగా ప్రపంచీకరణ పరిణామాలను మొదటగా తెలుగు సాహిత్యంలో రాసిన కవిగా గుర్తింపు పొందారు.[6]
స్వతంత్ర భారత వజ్రోత్సవాల (2021) సందర్భంగా ఆజాది కా కవి సమ్మేళన కార్యక్రమంలో కవిత్వ పఠనం చేస్తున్న జూకంటి జగన్నాథంవలస (కథ) ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి కథల పోటీలో ద్వితీయ బహుమతి (1986)
సినారె కవితా పురస్కారం (1998)
నూతల పాటి గంగాధరం పురస్కారం (2000)
ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం 2000
గరికపాటి పురస్కారం (2004)
సృజనాత్మకత ప్రక్రియలకు తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి అవార్డు (2002)
రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథా పురస్కారం (2008)
కవిత్వం విభాగంలో తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారం (2011)
తెలంగాణ ఉత్తమ సాహితీవేత్త పురస్కారం (2015)
తెలంగాణ సారస్వత పరిషత్తు సినారె పురస్కారం (2019)[7]