దాశరథి సాహితీ పురస్కారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దాశరథి సాహితీ పురస్కారం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం దాశరథి కృష్ణమాచార్య (జూలై 22) జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యరంగంలో కృషిచేసినవారికి అందజేసే పురస్కారం.[1]

దాశరథి సాహితీ పురస్కారం వేదిక, రవీంద్రభారతి

రూపకల్పన[మార్చు]

నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చాటిన దాశరథి కృష్ణమాచార్య జన్మదిన వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంలో, సాహిత్యరంగంలో కృషిచేసిన వారికి ఈ పురస్కారంను అందజేయడం జరుగుతుంది. పురస్కార కమిటీ ఎంపిక చేసిన అవార్డు గ్రహీతకు 1,01,116 రూపాయల నగదుతోపాటు దాశరథి స్మారక అవార్డును అందిస్తారు.[2]

2018 దాశరథి సాహితీ పురస్కార ప్రారంభోత్సవం
వఝల శివకుమార్ కి 2018 దాశరథి సాహితీ పురస్కారం అందజేత
సీఎం కెసీఆర్ చేతులమీదుగా 2020 దాశరథి పురస్కారం అందుకున్న తిరునగరి రామానుజయ్య

2015[మార్చు]

2015 తొలి దాశరథి సాహితీ పురస్కారంను కవి ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్య కి అందజేయడం జరిగింది. 2015 పురస్కార ఈ కమిటీ చైర్మన్‌గా తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి, సభ్యులుగా విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ రావికంటి వసునందన్, ప్రొఫెసర్ మసన చెన్నప్పలు, కన్వీనర్‌గా సాంస్కృతికశాఖ సంచాలకులు ఉన్నారు.[3]

2016[మార్చు]

2016 దాశరథి సాహితీ పురస్కారంను కవి జె.బాపురెడ్డికి అందజేయడం జరిగింది.[4]

2017[మార్చు]

2017 దాశరథి సాహితీ పురస్కారంను కవి ఆచార్య ఎన్.గోపి కి అందజేయడం జరిగింది.[5]

2018[మార్చు]

2018 దాశరథి సాహితీ పురస్కారంను కవి వఝల శివకుమార్ కి అందజేయడం జరిగింది.[6][7]

2019[మార్చు]

2019 దాశరథి సాహితీ పురస్కారంను కవి డా. కూరెళ్ల విఠలాచార్యకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, సంగీత నాటక అకాడమి చైర్మన్ బాద్మి శివకుమార్, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.[8][9]

2020[మార్చు]

2020 దాశరథి సాహితీ పురస్కారంకు కవి డా. తిరునగరి రామానుజయ్య ఎంపికవ్వగా 2020, ఆగస్టు 15న ప్రగతి భవన్ లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పురస్కారం అందజేశాడు.[10]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ (18 July 2018). "ప్రముఖ కవి వజ్జల శివకుమార్‌కు దాశరథి అవార్డు". Archived from the original on 27 July 2018. Retrieved 27 July 2018.
  2. నమస్తే తెలంగాణ (16 April 2015). "దాశరథి కృష్ణమాచార్య అవార్డు కమిటీ ఎంపిక". Archived from the original on 27 July 2018. Retrieved 27 July 2018.
  3. The Hans India (7 December 2017). "The powerful four liners". Archived from the original on 27 July 2018. Retrieved 27 July 2018.
  4. నమస్తే తెలంగాణ (22 July 2016). "కవి బాపురెడ్డికి దాశరథి సాహిత్య పురస్కారం ప్రదానం". Archived from the original on 27 July 2018. Retrieved 27 July 2018.
  5. Telangana Today (22 July 2017). "Acclaimed poet Gopi conferred with Dasarathi Sahiti Puraskar". Archived from the original on 27 July 2018. Retrieved 27 July 2018.
  6. ఆంధ్రజ్యోతి (23 July 2018). "పీడిత ప్రజల గొంతుక దాశరథి". Archived from the original on 27 July 2018. Retrieved 27 July 2018.
  7. ఆంధ్రభూమి (23 July 2018). "హైదరాబాద్ : దాశరథి కవితలు ఉద్యమ కెరటాలు". Archived from the original on 26 July 2018. Retrieved 27 July 2018.
  8. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (23 July 2019). "దాశరథి ఉద్యమస్ఫూర్తి". Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  9. ఆంధ్రజ్యోతి, తెలంగాణ వార్తలు (23 July 2019). "తెలంగాణ ప్రజల గొంతుక దాశరథి". Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  10. నమస్తే తెలంగాణ, తెలంగాణ (15 August 2020). "ప్రముఖ సాహితీవేత్త తిరునగరికి దాశ‌ర‌థి అవార్డు". ntnews. Archived from the original on 15 August 2020. Retrieved 15 August 2020.