వి. శ్రీనివాస్‌ గౌడ్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి.శ్రీనివాస్ గౌడ్
వి. శ్రీనివాస్‌ గౌడ్‌


ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 ఫిబ్రవరి 19
నియోజకవర్గము మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం మార్చ్ 16, 1969
రాచాల గ్రామం, అడ్డాకల్ మండలం, మహబూబ్ నగర్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి శారద
సంతానము శ్రీహిత , శ్రీ హర్షిత.
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014, 2018 లో ఎమ్మెల్యే గా గెలుపొందాడు. ప్రస్తుతం అయన ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ లో ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖలకు మంత్రిగా ఉన్నాడు.[1][2][3]

జననం[మార్చు]

వి. శ్రీనివాస్ గౌడ్ 1969 మార్చి 16వ తేదీన మహబూబ్​నగర్​ జిల్లా, అడ్డాకల్ మండలం, రాచాల గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి నారాయణ గౌడ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి వి.శాంతమ్మ గృహిణి.[4] ఆయనకు ఒక చెల్లెలు శ్రీదేవి, తమ్ముడు శ్రీకాంత్ ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ కు 1991, మే 26వ తేదీన శారదతో వివాహం జరిగింది. వారికీ ఇద్దరు కూతుర్లు శ్రీహిత, శ్రీ హర్షిత.

వృత్తి జీవితం[మార్చు]

అయన 1988 లో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లో శానిటరీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగంలో చేరాడు. అతి తక్కువకాలంలో తన పనితనంతో ఉన్నతాధికారుల మన్నలను అందుకొని 1991 లో ఫుడ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతిని పొందాడు. అనంతరం వికారాబాద్, అల్వాల్, కూకట్ పల్లి, కాప్రా మున్సిపాల్టీలలో కమిషనర్ గా పదవి బాధ్యతలు నిర్వహించాడు. అనంతరం హైదరాబాద్ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జాయింట్ కమిషనర్ గా పని చేశాడు.2004 నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల తరఫున పోరాడాడు. ఉద్యోగుల సమస్యలపై పోరాటం కోసం 2006లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ను ఏర్పాటు చేశాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాజకీయ జేఏసీ కి కో - ఛైర్మన్ గా కూడా వ్యవహరించాడు.[5]

రాజకీయ జీవితం[మార్చు]

తెలంగాణ ప్రజల చిరకాల వాంచైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో ఉద్యోగానికి రాజీనామా చేసి మార్చి 13న టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పార్లమెంటరీ సెక్రటరీగా నియమించాడు. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుండి మరోసారి పోటీచేసి గెలిచాడు. 19 ఫిబ్రవరి 2019న కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రిగా ఉన్నాడు.[6][7][8][9]

ఎక్సైజ్ శాఖ మంత్రిగా[మార్చు]

వి.శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా భాద్యతలు తీసుకున్నాక ఆయన హయాంలో నీరా చట్టం వచ్చింది.[10][11][12][13][14]

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా[మార్చు]

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష్యురాలు కీ.శే. శ్రీమతి జె. ఈశ్వరి భాయ్ గారి 28వ వర్దంతి సభలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక & సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ.వి.శ్రీనివాస్ గౌడ్[15][16][17]

క్రీడా & యువజన సర్వీసుల శాఖ మంత్రిగా[మార్చు]

తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌(టీపీకేఎల్‌) సీజన్‌-3 ట్రోఫీని ఆవిష్కరించిన క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌[18][19]

మహబూబ్‌నగర్‌ అభివృద్ధి కార్యక్రమాలు[మార్చు]

మహబూబ్ నగర్ పట్టణాన్ని మోడల్ ప్లాన్డ్ సిటీగా అభివృద్ధి చేస్తా. [20][21][22]

కరోనా[మార్చు]

కరోనా కట్టడికి అందరం మరింత కష్టపడి పని చేద్దాం.[23]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

 1. సాక్షి, క్రీడలు (23 Feb 2019). "ప్రతిభగల వారికే పెద్దపీట". Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019. CS1 maint: discouraged parameter (link)
 2. సాక్షి, వీడియోలు (24 Feb 2019). "కేసీఆర్‌ ప్రధాని కావాలని మొక్కుకున్నా." Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019. CS1 maint: discouraged parameter (link)
 3. ఆంధ్రప్రభ, మహబూబ్ నగర్ (6 April 2020). "ఉద్యమ దీప్తి..ఆయనలో అదే స్ఫూర్తి". Archived from the original on 6 April 2020. Retrieved 6 April 2020. CS1 maint: discouraged parameter (link)
 4. Namasthe Telangana (9 May 2021). "ఎన్నో సుగుణాలను తల్లి నుంచే నేర్చుకుంటాం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌". Namasthe Telangana. Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021. CS1 maint: discouraged parameter (link)
 5. సాక్షి, తెలంగాణ (20 Feb 2019). "మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి మంత్రి వరకు..." Archived from the original on 30 March 2019. Retrieved 30 March 2019. CS1 maint: discouraged parameter (link)
 6. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019. CS1 maint: discouraged parameter (link)
 7. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019. CS1 maint: discouraged parameter (link)
 8. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019. CS1 maint: discouraged parameter (link)
 9. నమస్తే తెలంగాణ, ఎడిటోరియల్ (2 April 2020). "కేసీఆరే ఓ మెడిసిన్‌". ntnews. Archived from the original on 2 April 2020. Retrieved 2 April 2020. CS1 maint: discouraged parameter (link)
 10. నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ (27 July 2019). "తెలంగాణలో నీరా చట్టం". ntnews.com. Archived from the original on 30 October 2019. Retrieved 30 October 2019. CS1 maint: discouraged parameter (link)
 11. నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ (26 September 2019). "హైదరాబాద్‌లో నీరా స్టాల్". ntnews.com. Archived from the original on 30 October 2019. Retrieved 30 October 2019. CS1 maint: discouraged parameter (link)
 12. నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ (29 October 2019). "గౌడలకే నీరా స్టాళ్లు". ntnews.com. Archived from the original on 30 October 2019. Retrieved 30 October 2019. CS1 maint: discouraged parameter (link)
 13. నమస్తే తెలంగాణ, యాదాద్రి న్యూస్ (29 October 2019). "కులవృత్తులకు జీవం". ntnews.com. Archived from the original on 30 October 2019. Retrieved 30 October 2019. CS1 maint: discouraged parameter (link)
 14. Andhrajyothy (8 May 2021). "గీత కార్మికుల సంక్షేమం, అభివృద్దే లక్ష్యం: శ్రీనివాస్ గౌడ్". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021. CS1 maint: discouraged parameter (link)
 15. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (25 February 2020). "'తెలంగాణ'కు స్ఫూర్తి ఈశ్వరీబాయి". www.andhrajyothy.com. Archived from the original on 25 February 2020. Retrieved 25 February 2020. CS1 maint: discouraged parameter (link)
 16. నమస్తే తెలంగాణ, తెలంగాణ (25 February 2020). "భావితరాలకు స్ఫూర్తి ఈశ్వరీబాయి". www.ntnews.com. Archived from the original on 25 February 2020. Retrieved 25 February 2020. CS1 maint: discouraged parameter (link)
 17. నమస్తే తెలంగాణ, తెలంగాణ (4 February 2020). "కళాకారులకు సంక్షేమ పథకాలు". www.ntnews.com. Archived from the original on 25 February 2020. Retrieved 25 February 2020. CS1 maint: discouraged parameter (link)
 18. నమస్తే తెలంగాణ, తెలంగాణ (25 February 2020). "కబడ్డీకి ఆదరణ భేష్‌". www.ntnews.com. Archived from the original on 25 February 2020. Retrieved 25 February 2020. CS1 maint: discouraged parameter (link)
 19. నమస్తే తెలంగాణ, తెలంగాణ (24 January 2020). "హైదరాబాద్‌లో జాతీయ టీటీ టోర్నీ". www.ntnews.com. Archived from the original on 25 February 2020. Retrieved 25 February 2020. CS1 maint: discouraged parameter (link)
 20. Namasthe Telangana (5 May 2021). "పాలమూరును మోడల్‌ సిటీగా తీర్చిదిద్దుతాం". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021. CS1 maint: discouraged parameter (link)
 21. Namasthe Telangana (6 May 2021). "సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021. CS1 maint: discouraged parameter (link)
 22. Namasthe Telangana (4 May 2021). "అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021. CS1 maint: discouraged parameter (link)
 23. Andhrajyothy (15 May 2021). "కరోనా కట్టడికి మరింత కష్టపడదాం". www.andhrajyothy.com. Archived from the original on 15 మే 2021. Retrieved 15 May 2021. CS1 maint: discouraged parameter (link)

ఇతర లింకులు[మార్చు]

హెచ్ ఎం టి వి లో శ్రీనివాస్ గౌడ్ కు సంబందించిన వార్తలు, వీడియోలు