తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీఎం కెసీఆర్ కు నివేదిక అందజేస్తున్న బీసీ కమీషన్ సభ్యులు

తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ బీసీల స్థితిగ‌తుల అధ్య‌య‌నం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్.[1] వెనుకబడిన కులాల సాధికారత, సంక్షేమంకోసం జిఓ నెం. 25 ప్రకారం 2016, అక్టోబర్ 10న ఈ కమీషన్ ఏర్పాటుచేయబడింది.

కమీషన్ సభ్యులు[మార్చు]

బీసీ కమీషన్ చైర్మన్‌, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమీషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. వీరికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్, సభ్యుల హోదాలతో సమానంగా సదుపాయాలు కల్పించబడుతాయి. [2][3]

విధులు[మార్చు]

వెనుకబడిన తరగతుల జాబితాలో తమ కులాన్ని చేర్చాలని వచ్చే అభ్యర్థనలను, బిసి జాబితా నుండి ఏ కులాన్నైనా తొలగించాలని వచ్చే ఫిర్యాదులను ఈ కమీషన్ పరిశీలించి విచారణకు స్వీకరిస్తుంది. 2017-18లో ఈ కమీషన్ కు రూ. 3.58 కోట్లు కేటాయించబడ్డాయి.

నివేదిక[మార్చు]

ముస్లింలలో వెనుకబడిన వర్గాల వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి రాష్ట్రమంతటా పర్యటించిన బీసీ కమీషన్ 21,435 ప్రాంతాల్లో పలువురిని కలిసి, వారి సామాజిక స్థితిగతులను పరిశీలించింది. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బీసీ-ఈకి చెందిన ముస్లింలు బాగా వెనుకబడి ఉన్నారని బీసీ కమిషన్ స్పష్టం చేస్తూ, మతం మారినా వెనుకబాటుతనం పోలేదని తెలియజేస్తూ ప్రభుత్వానికి 135 పేజీల నివేదికను సమర్పించింది.[4]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ (16 September 2017). "బీసీల స్థితిగ‌తుల అధ్య‌య‌నం కోసం క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌". Retrieved 9 June 2018.
  2. నమస్తే తెలంగాణ (22 October 2016). "బీసీ కమీషన్ చైర్మన్‌గా బీఎస్ రాములు". Retrieved 9 June 2018.
  3. ది హిందూ, తెలంగాణ (23 October 2016). "B.S. Ramulu is Chairman of TS BC Commission". SPECIAL CORRESPONDENT. Retrieved 9 June 2018.
  4. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (17 April 2017). "బీసీ-ఈలకు". Retrieved 9 June 2018.