శుభప్రద్ పటేల్
శుభప్రద్ పటేల్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 ఆగష్టు 2021 - 31 ఆగస్ట్ 2024 | |||
ముందు | జూలూరి గౌరీశంకర్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 27 జులై 1982 అలంపల్లి, వికారాబాదు జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | నూలి బసవలింగం, విమల దేవి | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, న్యాయవాది |
శుభప్రద్ పటేల్ నూలి తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అనుబంధ సంఘం టీఆర్‌ఎస్వీలో వివిధ హోదాల్లో పని చేసి, 23 ఆగష్టు 2021న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]శుభప్రద్ పటేల్ 27 జులై 1982లో తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, అలంపల్లి గ్రామంలో నూలి బసవలింగం, విమల దేవి దంపతులకు జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీసీఏ, ఎల్‌ఎల్‌బీ, కార్మిక & రాజ్యాంగ చట్టాల్లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసి 2006 నుండి వికారాబాద్ & రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు.
రాజకీయ జీవితం
[మార్చు]శుభప్రద్ పటేల్ మలిదశ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి తెలంగాణ స్టూడెంట్ జేఏసీ (టీఎస్‌జేఏసీ) రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ఉంటూనే టిఆర్ఎస్ పార్టీలో చేరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉద్యమంలో కీలకంగా పని చేశాడు. ఆయన 2003 నుండి 2006 వరకు వికారాబాద్ పట్టణ టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా, 2006 నుండి 2008 వరకు టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శిగా, 2008 నుండి 2010 వరకు టిఆర్ఎస్వీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, 2010 నుండి 2015 వరకు టిఆర్ఎస్వీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా [2] & రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్‌గా, 2015లో వికారాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం అడహాక్ కమిటీ ఇన్‌చార్జ్‌గా, హైదరాబాద్-రంగారెడ్డి-మహాబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంకు 2015లో జరిగిన ఎన్నికల్లో పార్టీ కోఆర్డినేటర్‌గా, 2016 నుండి టిఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2021లో జరిగిన హైదరాబాద్-రంగారెడ్డి-మహాబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి టికెట్ ఆశించి కొన్ని కారణాల వల్ల దక్కలేదు, శుభప్రద్ పటేల్ ను 23 ఆగష్టు 2021న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[3] ఆయన 1 సెప్టెంబర్ 2021న పదవీ బాధ్యతలు చేపట్టాడు.[4]
ఉద్యమ జీవితం
[మార్చు]శుభప్రద్ పటేల్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశాడు. ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేసీఆర్ సూచనలు పాటిస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక ఉద్యమాలు, దీక్షలు చేసి, అప్పటి ప్రభుత్వాలకు, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా పోరాటాల్లో పాల్గొన్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ఉన్న కేసులకు ఎత్తివేయాలని, ఉద్యమంలో భాగంగా ఉద్యోగాలు కోల్పోయినవారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా అప్పటి రాష్ట్ర డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు వినతిపత్రం అందజేశాడు. శుభప్రద్ పటేల్ పై ఉద్యమ సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ లో వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు 60 కు పైగా, దేశ రాజధాని ఢిల్లీలో 4 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.[5]
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (23 August 2021). "తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటు" (in ఇంగ్లీష్). Archived from the original on 26 August 2021. Retrieved 26 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (21 June 2015). "చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి: శుభప్రద్‌పటేల్". Archived from the original on 5 December 2021. Retrieved 5 December 2021.
- ↑ Andrajyothy (23 August 2021). "బీసీ కమిషన్ సభ్యుడిగా శుభప్రద్ పటేల్". Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.
- ↑ Namasthe Telangana (1 September 2021). "తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ పదవీ బాధ్యతల స్వీకరణ". Archived from the original on 1 September 2021. Retrieved 1 September 2021.
- ↑ Sakshi (23 August 2013). "సీమాంధ్రుల లాబీయింగ్‌కు తలొగ్గొదు: శుభప్రద్‌పటేల్". Archived from the original on 5 December 2021. Retrieved 5 December 2021.