Jump to content

చలపాక ప్రకాష్

వికీపీడియా నుండి
చలపాక ప్రకాష్
చలపాక ప్రకాష్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత, కార్టూనిస్ట్

చలపాక ప్రకాష్ తెలుగు రచయిత, [1] కార్టూనిస్టు, [2] కవి, రచయిత, వ్యాసకర్త, సంస్థ నిర్వాహకుడు. అతను రమ్యభారతి త్రైమాస పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకులు.[3] ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ప్రధానకార్యదర్శి.[4] అతను రాసిన కొన్ని కవితలు హిందీ, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను శివకన్య, వీరాచారి దంపతులకు 1971 జూన్ 9న విజయవాడలో జన్మించాడు.[5] అతను విజయవాడలోని విద్యాధరపురం వాస్తవ్యుడు. అతను తెలుగు భాష ప్రధానాంశంగా ఎం.ఎ. పట్టాను పొందాడు.[6] అతను వృత్తిరీత్యా స్వర్ణకారుడు.

రచనలు

[మార్చు]
  • హై!లో? (కవితా సంపుటి)
  • చప్రలు (చిన్న కవితలు)
  • చూపు[7]
  • మూడు ముక్కలాట[8] (దీర్ఘ కవిత)
  • కవినై .. కవితనై (కవితా సంపుటి)
  • మూడోకన్ను (కవిత్వం) : ఇందులో పలు కవితలు చాలా పత్రికలలో ప్రచురింపబడినవే. ఇందులో మొత్తం 98 కవితలున్నాయి.[9]
  • ప్రేమాభిమానాలు (కథల సంపుటి)
  • జీవితం (కథల సంపుటి) [10]
  • ఈ కాలమ్‌ కథలు :[11]
  • చలపాక నానీలు
  • నవ్య కవితా రూపం -నానీలు (వ్యాస సంపుటి)
  • అత్యాధునిక కవితా రూప ప్రక్రియ -నానీలు (సెంట్రల్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఫెలోషిప్ వ్యాస సంపుటి)
  • హాస్యాభిషేకం
  • సందడే సందడి (కార్టూన్లు)
  • చలపాక ప్రకాష్ కార్టూన్లు -1
  • చలపాక ప్రకాష్ కార్టూన్లు-2
  • ప్రళయం[12] (కథల సంకలనం)
  • ప్రేమ పోరాటం (నవల)
  • సభల్లో సరదాలు
  • రచయితలు ప్రచురణకర్తలు పాటించవలసిన ప్రాథమిక కర్తవ్యాలు
  • నా జీవన యాత్ర (దీర్ఘ కవిత)
  • విజయవాడ సందర్శనం (చరిత్ర పరిశోధన)
  • కరోనా నానీలు (తెలుగు)
  • కరోనా కెలమిటి (ఆంగ్లము)
  • కరోనా కా కోహ్రం (హిందీ)
  • ఇంకా 16 జోక్స్ పుస్తకాల రచన. కొన్ని కధ, వ్యాస, కవితా సంకలనాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించాడు.

పురస్కారాలు : ముఖ్యమైన అవార్డులు

[మార్చు]

పురస్కారాలు ముఖ్యమైనవి : 1999 సం||లో రాష్ర ్టప్రభుత్వంచే (జిల్లాస్థాయిలో) ఉత్తమ యువసాహితీవేత్త అవార్డు.

2008 సం||గాను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారినుండి "అత్యాధునిక లఘు కవితా రూపప్రక్రియ -నాని " అంశం పై (జూనియర్) ఫెలోషిప్‌.

2023 సం.లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారినుండి "తెలుగు సాహిత్యంలో కరోనా కల్లోలం" అంశం పై (సీనియర్) ఫెలోషిప్‌.

1999 సం||లో 'చెలిమి'సంస్థచే దేవులపల్లి కృష్ణశాస్త్రి స్మారక అవార్డు.

5-2-2000న 'చెలిమి'సాహితి సాంస్కృతిక సమితి వారిచే ' దాశరథి'స్మారకఅవార్డు.

అక్టోబరు 2, 2003 న 'జయంతి' కళాసమితి హైదరాబాద్‌ వారి 'జయంతి' పురస్కారం డా||సి.నారాయణరెడ్డి చేతులమీదుగా ప్రదానం.

5-10-2003 న 'రోటరీ-2003' యూత్‌ అవార్డ్‌ ప్రదానం.

2005 న తారణ నామ సంవత్సర ఉగాది నాడు మచిలీపట్నంలో జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా కలెక్టర్‌ కె.ప్రభాకరరెడ్డిచే కవి సత్కారం.

21-8-2004 న 'రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ కోస్మో వారి నుండి 'రోటరీ సెంటేనియల్‌ యూత్‌ అవార్డ్‌'.

1999 సం||లో 'ఎక్స్‌రే' సాహితీ సాంస్కృతిక సేవా సంస్ధచే సత్కారం.

2-3-2006న  గుఱ్ఱం జాషువా స్మారక కళాపరిషత్‌ దుగ్గిరాల వారి 17 వవార్షికోత్సవం సందర్భంగా 'ఉత్తమ యువసాహితీవేత్త' అవార్డు, 'ఉగాది పురస్కారం'.       

17-9-2006 న 'రమ్యసాహితి' పెనుగొండ వారు నిర్వహించిన జాతీయస్థాయి కవితల పోటీ లలో 'వాదమెప్పుడు' కవితకు ఉత్తమ పురస్కారం.

25-2-2007 న 'చ.ప్ర.లు' సంపుటికి ప||గో||జిల్లా నల్లజెర్లలోని 'జగన్నాధ సాహితీ సమాఖ్య' వారిచే 'జగన్నాధ సాహితీ పురస్కారం'.

2008 సం|| అమెరిక 'ఆటా' వారు నిర్వహించిన కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

2008లో 'ఫ్రీగా మాట్లాడుకుందాం' కవితకు 'మంచి కవితగా 'రంజని- కుందుర్తి 2008' అవార్డు'

2010 సం||లో 'మూడు ముక్కలాట'' దీర్ఘ కవితా సంపుటికి 'సృజన - 2009' (నెల్లూరు)

2010 సం||లో 'చూపు' కవితా సంపుటికి 'మోదు గురుమూర్తి స్మారక పురస్కారం

2010 సం||లో 'విశ్వశాంతి సేవా సమితి' ఒంగోలు వారి 'విశ్వశాంతి' సాహితి పురస్కారం

2010 డిసెంబరు 25న  'పంపకాలు' అనే కవితకు 'ఎక్స్‌రే-2010' జాతీయస్థాయి కవితా అవార్డు

2013లో 'కవిత విద్యా సాంస్కృతిక సేవా సమితి, కడప వారి నుండి ''కవినై.. కవితనై'' కవితా సంపుటికి గాను ''శ్రీశ్రీ కవితా పురస్కారం-2013''

2013  'స్వప్న' మాసపత్రిక నిర్వహించిన కవితల పోటీలలో ప్రథమ బహుమతి

2013లో 'నవ్య వీక్లీ' - విశ్వపతి నిర్వహించిన  కథల పోటీలలో ఉత్తమ కథలలో 'మావవుడి 'అతి' తెలివి' కథకు పదిటిలో ఒక కథగా బహుమతి

2014లో 'నవ్య వీక్లీ' - నాటా నిర్వహించిన  కవితల పోటీలలో ఉత్తమ కవితలలో 'స'ముద్ర'ం' కవితకు ఇరవైలో ఒక కవితగా బహుమతి

2014లో 'సాహితీకిరణం' పత్రిక వారి కవితలపోటీలో ''డా|| ధర్మపురి మధుసూదన్‌ కవితా పురస్కారం' లభించింది.

2014లో 'సాహితీకిరణం' మాస పత్రిక వారు నిర్వహించిన దీపావళీ కథలపోటీలో అభినందన కథకు ''ముత్తూరి కమలమ్మ స్మారక పురస్కారం'' రూ.1000/-

12-1-2015 సాంస్కృతీ సమాఖ్య (యువ సాహితీ వికాస వేదిక) విజయవాడ వారి నుండి సంచలన కవి 'అలిశెట్టి ప్రభాకర్‌'  కవితా సృజన పురస్కారం

18-1-2015 చిత్తూరులో 'చిత్తూరు లలిత కళావేదిక' ఆధ్వర్యంలో సాహిత్యరంగంలో కృషి చేస్తున్నందుకు మొట్టమొదటిసారిగా ఇచ్చే 'హరివిల్లు-  కీ||శే|| శ్రీమతి శాంతాబాయి, శ్రీ శ్రీధర్‌రావు స్మారకసాహితీ పురస్కారం (నగదు- రూ.5000/-)

13-4-2015న మచిలీపట్నంలో 'ఆంధ్రసారస్వతసమితి' వారి 'శ్రీ గుత్తికొండ సుబ్బారావు ఉగాది సాహిత్య ప్రతిభా పురస్కారం' ( ప్రక్రియ: సాహిత్య కార్యకర్త) రూ.2000/-

6-9-2015న నెల్లూరులో పాతూరి మాణిక్యమ్మ స్మారక సాహిత్య 'కీర్తి' పురస్కారం- 2015

3-12-2016న మచిలీపట్నం 'ఆంధ్రసారస్వత సమితి' వారి స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన కథల పోటీలలో 'జీవితం' కథకు ప్రోత్సాహక బహుమతి

19-2-2017న చీరాలలో 'సహజసాహితి' సంస్థ ఆధ్వర్యంలో 'కొణికి సాలగ్రామ నరసింహమూర్తి- సహజసాహితి ప్రతిభా పురస్కారం'

20-2-2017న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహణలో 'పట్టిసీమ- పోలవరం' ప్రాజెక్ట్‌ల కవులు, రచయితల సందర్శన యాత్రలో అవకాశం.

22-2-2017న విజయవాడలో 'ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతిక శాఖ వారి నుండి 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ పురస్కారం.

29-8-2017న గుడివాడలో 'తెలుగు భాషా వికాస సమితి' ఆధ్వర్యంలో 'గిడుగు రామ్మూర్తి- తెలుగు భాషా పురస్కారం'

29-8-2017న విజయవాడ నిడమానూరులోని 'ఢిల్లీ పబ్లిక్‌ స్కూలు' ఆధ్వర్యంలో 'గిడుగు రామ్మూర్తి- తెలుగు భాషా పురస్కారం'

29-8-2017న ఉయ్యూరులో 'రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఉయ్యూరు- సరసభారతి' ఆధ్వర్యంలో 'గిడుగు రామ్మూర్తి- తెలుగు భాషా పురస్కారం'

24-12-2017న కడప జిల్లా ప్రొద్దుటూరులో 'దస్తగిరి సాహెబ్‌ సేవా సాహిత్య సంస్థ వారి 2వ రాష్ట్రస్థాయి ఎస్‌.దస్తగిరి సాహెబ్‌ సాహిత్య పురస్కారం.

21-03-2019న విజయవాడలో 'ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతిక శాఖ' ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవం' సందర్భంగా జరిగిన కవిసమ్మేళనంలో కవి సత్కారం.

11-1-2018న హైదరాబాద్‌లో సాహితీకిరణం మాసపత్రిక- జివిఆర్‌.ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన సంక్రాంతి-2018  కవితల పోటీలో 'అనుమానితుడు' కవితకు తృతీయ బహుమతి.

11-11-2018న ఖమ్మంలో 'అక్షరాల తోవ' సంస్థ నుండి జాతీయస్థాయి సింగిల్‌పేజీ కథల పోటీలలో ఐదు ఉత్తమ కథల పోటీలలో ప్రథమ 'ఉత్తమ కథ'గా పురస్కారం.....

1 సెప్టెంబరు 2019న మంచిర్యాల జిల్లా రచయితల సంఘం వారినుండి జాతీయస్థాయిలో 'అక్షరయోధ-2019' అవార్డు.

2020 ఫిబ్రవరి 9న చిలకలూరిపేటలో '2019- విడదల నీహారిక ఫౌండేషన్‌- సాహితీ కిరణం మాసపత్రిక' సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలలో అత్యుత్తమ కథగా రూ.2000/- బహుమతి.

2015 నుండి 2019 వరకు ప్రతి ఏడూ విజయవాడలో జరిగిన 'అంతర్జాతీయ బహు భాషా కవిసమ్మేళనం' 'అమరావతి పొయిట్రి ప్రిజమ్‌'లో పాల్గొనే అవకాశం లభించింది.

22 జూన్‌ 2020న 'తానా' (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఆధ్వర్యంలో 'నాన్నా' అంశంపై ప్రపంచస్థాయిలో నిర్వహించిన కవితల పోటీలలో 'ప్రత్యేక బహుమతి'

6-12-2020న 'వురిమళ్ల ఫౌండేషన్‌- అక్షరాల తోవ' నిర్వహించిన 'వురిమళ్ల పద్మజ స్మారక జాతీయస్థాయి కవితల పోటీలలో కన్సోలేషన్‌ (రూ500/-)

22-02-2021న నెల్లూరులో 'నెల్లూరు జిల్లా రచయితల సంఘం' ఆధ్వర్యంలో 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ పురస్కారం' ప్రదానం

2021 మార్చి 13 న నెల్లూరులో 'రత్నమ్మ చారిటబుల్‌ సొసైటీ' ఆధ్వర్యంలో  'గురజాడ అప్పారావు జాతీయస్థాయి' పురస్కారం ప్రదానం

సెప్టెంబరు 2021న విశాలాక్షి మాసపత్రిక-శ్రీ ఆళ్ల థరథరామిరెడ్డి స్మారక కథల పోటీలో 'భూలోక నరకం' కథకు రూ.3000/- బహుమతి పొందినది.

15, సెప్టెంబరు 2022న 'ఓసారి చూడండి.. అంతే!'- వాట్సాప్‌ గ్రూప్‌ నిర్వహించిన దసరా కథల పోటీలో 'తీరని కోరిక' కథకు తృతీయ బహుమతి లభించింది.

25-9-2022న గుడివాడలో 'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం' కృష్ణాజిల్లా శాఖ ఆధ్వర్యంలో డా|| రాపాక ఏకాంబరాచార్యులు గారి స్మారక పురస్కార ప్రదానం.

26-3-2023 న నెల్లూరులో నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన శోభకృత నామ సంవత్సర ఉగాది సందర్భంగా 'సాహితీ సేవా పురస్కారం' ప్రదానం.

29-10-2023న నెల్లూరులో 'విశాలాక్షి-డా.రాయప్రోలు సుబ్రహ్మణ్యం'శతజయంతి కవితలపొటీలో ఉత్తమ కవితా బహుమతి

2023' తెలుగు తల్లి -కెనడా పత్రిక నిర్వహించిన శ్రీమతి ముదునూరు వసంత కుమారి, శ్రీరామమూర్తి రాజు గార్ల స్మారక కథల పొటీలో 1250/- ఉత్తమ బహుమతి

ఇంకా మరెన్నో .... పురస్కారాలు, సన్మానాలు...

మూలాలు

[మార్చు]
  1. http://www.sakshi.com/news/andhra-pradesh/thousand-landscape-thousands-of-years-of-knowledge-275199
  2. http://prasthanam.com/node/770[permanent dead link]
  3. http://kathanilayam.com/magazine/196[permanent dead link]
  4. http://www.sakshi.com/news/district/sahiti-sasti-poorthi-cermony-414804
  5. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-06-18.[permanent dead link]
  6. e paper, prajasakti.com, 2002 02 27
  7. "చూపు(Chupu) By chalapaka prakash - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige | Books, Telugu, Book cover". Pinterest (in ఇంగ్లీష్). Retrieved 2020-06-18.
  8. "మూడు ముక్కలాట(Mudu Mukkalata) By chalapaka prakash - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige | Book cover, Books, Mario characters". Pinterest (in ఇంగ్లీష్). Retrieved 2020-06-18.
  9. "తెరవని 'మూడోకన్ను'తో లోకం తీరు గమనిస్తున్న త్రినేత్ర సంచారి 'చలపాక' | సంచిక - తెలుగు సాహిత్య వేదిక" (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-06-14. Retrieved 2020-06-18.[permanent dead link]
  10. జీవితం(Jeevitham) By Chalapaka Prakash - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2020-06-20. Retrieved 2020-06-18.
  11. India, The Hans (2020-02-24). "Ee Kaalam Kathalu, story compilation released". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-06-18.
  12. "మానవీయ కోణంలో.. - Prajasakti". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-19. Retrieved 2020-06-18.