తలతోటి పృథ్విరాజ్
తలతోటి పృథ్విరాజ్ 9963299452 | |
---|---|
జననం | జూలై 6, 1970 కావలి,నెల్లూరుజిల్లా |
నివాస ప్రాంతం | విశాఖపట్నం |
ఇతర పేర్లు | పృథ్వి,కవితలతోటి,నవ్య |
వృత్తి | తెలుగు అధ్యాపకుడు |
ప్రసిద్ధి | హైకూ కవి |
పిల్లలు | సత్య సంకీర్తన, కీర్త్హన్ |
తండ్రి | సత్యానందం |
తల్లి | సామ్రాజ్యం |
వెబ్‌సైటు | |
TALATHOTI |
తలతోటి పృథ్విరాజ్ ప్రముఖ తెలుగు కవి. ఆధునిక కవిత్వ ప్రక్రియలలో ఒకటైన హైకూరచనలో విశేష కృషి చేస్తున్నాడు. హైకూను ఇంటిపేరుగా మార్చుకున్న పృథ్విరాజ్ ఇండియన్ హైకూ క్లబ్‌ను స్థాపించి, హైకూ ప్రక్రియా వ్యాప్తికి తోడ్పడుతున్నాడు.
జీవిత విశేషాలు
[మార్చు]సత్యానందం, సామ్రాజ్యం దంపతులకు 1970, జూలై 6న నెల్లూరు జిల్లాలోని కావలిలో జన్మించాడు. ప్రకాశం జిల్లా, అద్దంకిలోని రవీంద్ర భారతి పబ్లిక్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. గుంటూరు జిల్లాలోని తన స్వగ్రామం తుబదులో 6 వ తరగతి పూర్తిచేసిన అనంతరం, తిరిగి అద్దంకిలోని ప్రకాశం బాలుర పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేశాడు. బాల్యంలో మద్దులేటి మాస్టార్ ప్రోత్సాహంతో చదువును కొనసాగించాడు. తన బాల్య స్మృతులే అతడిని హైకూ కవిగా మార్చాయి. విజయవాడలోని లయోల కళాశాలలో బి.ఏ., హైదరాబాదుకేంద్రియ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., పూర్తిచేశాడు. ఆచార్య పర్వతనేని సుబ్బారావు మార్గదర్శకత్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆత్రేయ సినిమా సంభాషణల మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు.
వృత్తి జీవితం
[మార్చు]2000సంవత్సరంలో అనకాపల్లిలోని ఏ.ఎం.ఏ.ఎల్.లో తెలుగు అధ్యాపకులుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం తెలుగు శాఖాధ్యక్షుని హోదాలో పనిచేస్తున్నారు. అనేక జాతీయ వేదికల మీద తెలుగు సాహిత్యంపై పత్రాలు సమర్పించాడు.
సాహిత్య జీవితం
[మార్చు]10 వ తరగతి నుండే కవిత్వం రాయడం ప్రారంభించిన పృథ్విరాజ్, ఆంధ్ర సచిత్ర వార పత్రికలో తన మొదటి కవిత అచ్చయ్యాక, అదే స్ఫూర్తితో ఆ తర్వాత అనేక కవితలు, కథలు రాశాడు. వీటితో పాటు బొమ్మలు గీయడం వీరికి ఉన్న మరో అభిరుచి. ఇతని రచనలు అనేకం మయూరి వార పత్రికలో ప్రచురించబడ్డాయి.
రచనలు
[మార్చు]తలతోటి పృథ్విరాజ్ హైకూలు-హైకూ అనుబంధ ప్రక్రియలో ప్రధానంగా కవిత్వం రాసినా,వచన కవితలు, దీర్ఘ కవితలు, నానీలు, కూనలమ్మ పదాలు, ప్రపంచ పదులు, కొన్ని ఛందో పద్యాలు మొదలగు ఇతర కవిత్వ ప్రక్రియలలోనూ రచనలు చేశాడు.
హైకూ సంపుటులు
[మార్చు]- వెన్నెల
కొన్ని హైకూలు నెలవంక సంపుటి నుండి...
దూరంగా కొండ / ఉళ్ళోకి మోసుకొచ్చింది గాలి/ గుడిగంటల శబ్దాన్ని
01) తెలియని ఉరొచ్చే బాటసారికి / ఎవరో/ చుక్కాణిని చేశారు పచ్చికను.
02) శిశిర ఋతువు/ చెట్లలో దాగిన పక్షుల పొదరిళ్ళను/ ప్రదర్శిస్తోంది...
03) ఉదయాన్నే / పక్షులతోపాటు గిలకబావీ/ అరుస్తోంది...
04) వెన్నెల నిండినట్లుంది/ నురగలతో కుండ / పొంగి పొర్లుతూ ఈత చెట్టున ...
05) నన్నిలాగే ప్రేమించండి/ కలిసిన మట్టిలోనే మళ్ళీ పుడతా/ ఏ చెట్టుగానో ...దాని పువ్వుగానో ...
- చినుకులు
కొన్ని హైకూలు చినుకులు సంపుటి నుండి... 02) 03) 04) 05) 06) 07) 08) 09) 10) 11)
- వసంతం
కొన్ని హైకూలు వసంతం సంపుటి నుండి... 01) బడిపిల్లల థ్యాంక్స్/సెలవిప్పించిన/వర్షానికి. 02) కథ సగంలోనే/నిద్రలోకి జారుకుంది/ఊకొట్టే పాపాయి. 03) నగరానికి సర్కస్ కంపెనీ,/పిల్లలకీ-జంతువులకీ కాసేపు/బోన్ లనుంచి విడుదల! 04) ఇప్పటికీ పదిలమే/బాల్య స్మృతులు -పుస్తకాల్లో/దాచుకున్న నెమలి పించాల్లా 05) రోజూ ఇలానే.../ఎంతకీ చిక్కని సూరీడు/నిరాశతో తిరిగొచ్చే పక్షులు. 06) నూతిలోని తాబేలుకి/తోడుగా కప్పలు/వారికి తోడుగా జాబిలి! 07) వానాకాలం వచ్చింది./బావులూ చెరువుల్లో మర్లా/ఆకాశం పుట్టింది! 08) వర్షం వచ్చి/ రంగుల వంతెనేసింది/ నింగికీ నేలకు! 09) ఎంత బాగుండు/సొంత గూడైనా ఉండేది/పక్షినై ఉంటే! 10) ఓ ఇంట్లో చేరా/వర్షాకాలానికిగాని తెల్సింది/అద్దెంతివ్వొచ్చో! 11)
- రోజుకో సూర్యుడు...
కొన్ని హైకూలు రోజుకో సూర్యుడు... సంపుటి నుండి... 01) పూలవనం ఆ యింటాయనిదే!/సీతాకోక చిలుకలుమాత్రం/తోటమాలి నేస్తంలైనాయి. 02) జన్మనిచ్చిన ఋణం తీర్చుకుంటున్నాయి/రాలిపడిన ఆకులు/ఎరువై చెట్టుకు బలాన్నిస్తున్నాయి. 03) మింగేస్తుంది/నోరు తెరుచుకున్న కొండ/రోజుకో సూర్యుడ్ని... 04) రోజుకో సూర్యుడ్ని/మింగబట్టేనేమో.../అగ్నిపర్వతమయింది 05) చినుకు ముద్దుకు/ సిగ్గుతో ముడుచుకుంటోంది/ టచ్మీనాట్ 06) చలికి వణుకుతున్నా సరే.../తెల్లరేదాక నదిని ఈదుతూ/పున్నమి చంద్రుడు! 07) గూటికి చేరి/మళ్ళీ ఎగిరెళ్తూ పక్షులు-/సూర్య గ్రహణం! 08) ప్రత్యక్షమయ్యాయి/తప్పిపోయాయనుకున్న గొర్రెలు/దిగుడు బావిలోంచి! 09) ఆస్వాదించేందుకు/వచ్చి వెళ్తున్నాయి పక్షులు-మంచెపై/డబ్బా గలగలల సంగీతం కోసం! 10) పోటా పోటీతో/మేల్కొల్పు గీతం/కాకులూ ...కోళ్ళూ. 11) మంటలతో అడవి./పాపం గడ్డి పొదల్లో/పక్షుల పొద రిళ్ళూ...పిల్లలు 12) చినుకుల రాయబారితో/నింగికి నేలతల్లి ప్రత్యుత్తరం/పుడమి పరిమళం! 13) వానొచ్చిందంటే/అజ్ఞాతవాసం ముగిసినట్లే-/వానబాములు. 14) కక్ష్యలో తిరుగుతూ గ్రహాలు/కక్ష్యతప్పి కక్షలతో/మనుషులు! 15) బాహ్య సౌందర్యానికి/బ్యూటీ క్లీనిక్ లు.../ఆత్మ సౌందర్యానికి?! 16) మేస్తోంది మేక/సభ్యతను పాటించమంటూ-/గోడమీది అశ్లీల పోస్టర్లని... 17) జననమొక దు:ఖారంభం/మరణమొక సుఖారంభం/సగటు మనిషి 18) వరికుప్పల నూర్పిడి/పక్షుల్తో పాటు పేదలు-/పరిగెల కోసం 19) తల్లిదాచిన లడ్డూలకై/ వెదికే పసి కళ్ళకు దోవచూపుతూ/నల్ల చీమలు 20) పల్లె పిల్లలకు/తూగుడు బల్ల/బందికానుమానే 21) 22) 23) 25) 26) 27) 28) 29) 30)
- నీలాకాశం
కొన్ని హైకూలు నీలాకాశం సంపుటి నుండి... 02) 03) 04) 05) 06) 07) 08) 09) 10) 11)
- కలువలు
కొన్ని హైకూలు కలువలు సంపుటి నుండి... 02) 03) 04) 05) 06) 07) 08) 09) 10) 11)
- చంద్ర కిరిటీ
కొన్ని హైకూలు చంద్ర కిరిటీ సంపుటి నుండి... 02) 03) 04) 05) 06) 07) 08) 09) 10) 11)
- ఋతు భ్రమణం
కొన్ని హైకూలు ఋతు భ్రమణం సంపుటి నుండి...
- పృథ్వి సెన్‌ర్యూ
కొన్ని హైకూలు పృథ్వి సెన్‌ర్యూ సంపుటి నుండి... 02) 03) 04) 05) 06) 07) 08) 09) 10) 11)
- పృథ్వి తంకాలు
కొన్ని హైకూలు పృథ్వి తంకాలు సంపుటి నుండి... 01) జీవిత తీరం/ అజ్ఞాతం లోకి జీవం/ గూడువిడిచి /నత్తగుల్లల్లా ఎన్నో /తీపి స్మృతు లొదిలి 02) వదలలేక/ 03) 04) 05) 06) 07)చేతుల్తో ముద్దాడొచ్చా 08) 09) 10) 11)
- పృథ్వి ఫోటో హైకూలు
కొన్ని హైకూలు పృథ్వి ఫోటో హైకూలు సంపుటి నుండి... 02) 03) 04) 05) 06) 07) 08) 09) 10)
11)దీర్ఘ కవితలు
[మార్చు]- మనిషి
- నల్ల దొరలు
ఇతర రచనలు
[మార్చు]- మనసు కవి ఆత్రేయ నాటక సాహిత్యం - సంభాషణలు (విమర్శా గ్రంథం)
- మనిషిలో... (నిర్వచానాత్మక కవితా సంపుటి)
- అడుగులు (నానీలు)
సంకలనాలు
[మార్చు]- నెలవంక (హైకూ సంకలనం)
02) 03) 04) 05) 06) 07) 08) 09) 10) 11)
- అరటి కుటీరం (హైకూ జాతీయ సంకలనం)
02) 03) 04) 05) 06) 07) 08) 09) 10) 11)
- నలుదిక్కుల నానీలు (నానీల తొలి సంకలనం)
02) 03) 04) 05) 06) 07) 08) 09) 10) 11)