కవిత్వం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు. కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చు. కవిత్వం అంటే అక్షర హింస కాదు. అక్షరాల కుంటి నడక అంతకంటే కాదు. కవిత్వం అంటే అక్షర తాండవం. కవిత్వం అంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన. సంకోచాలు, మొహమాటాలు కవిత్వానికి తీరని హాని చేస్తాయి. కవిత్వంలో చెప్పేదేదైనా బలంగా ఉండాలి. నంగి మాటలు, నత్తి చేష్టలు ఉండకూడదు. కవిత్వం రాసేవారిని కవులు/కవయిత్రులు అంటారు. వారి కీర్తి కాంక్ష అసలే ఉండొద్దు . ఇక ఈ క్షణంలో ఈ కవిత రాయకపోతే చచ్చిపోతాం అన్నంత ఆవేశం వస్తేగానీ ఒక మంచి కవిత జన్మించదు. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు. రసమయ ఘడియల్లో సృజించిన కవిత కొన్నాళ్ళాగి చదివితే రాసినప్పటి మానసికస్థితిలోకి తీసుకువెళ్తోందో లేదో చూసుకోవాలి. అలా తీసుకువెళ్ళినట్లైతే అది కవిత అయినట్లే.

కవిత్వంలో రకాలు[మార్చు]


కవిత్వం పై ప్రముఖుల వ్యాఖ్యలు[మార్చు]

  • కవిత్వ మొక తీరని దాహం --శ్రీశ్రీ
  • ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే--శ్రీశ్రీ
  • వడగాడ్పు నా జీవితం. వెన్నెల నా కవిత్వం --గుర్రం జాషువా
  • అబద్ధాలాడడమంత సులభం అవదు సుమూ! కవిత అల్లడం---దాశరథి కృష్ణమాచార్య
  • ఒకరు రాయమంటే రాయునది కవిత్వం కాజాలదు

ఆకలియే కవిత్వం ఆలోచనయే కవిత్వం కదిలించే ఘటనలు కవ్వించే ప్రతినలు కవితకు ప్రతిపాదికలు

"https://te.wikipedia.org/w/index.php?title=కవిత్వం&oldid=1765883" నుండి వెలికితీశారు