అద్దంకి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


అద్దంకి
పట్టణం
అద్దంకి is located in Andhra Pradesh
అద్దంకి
అద్దంకి
అక్షాంశ రేఖాంశాలు: 15°48′40″N 79°58′26″E / 15.811°N 79.9738°E / 15.811; 79.9738Coordinates: 15°48′40″N 79°58′26″E / 15.811°N 79.9738°E / 15.811; 79.9738 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఅద్దంకి మండలం
విస్తీర్ణం
 • మొత్తం25 కి.మీ2 (10 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం43,850
 • సాంద్రత1,800/కి.మీ2 (4,500/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08593 Edit this at Wikidata)
పిన్(PIN)523201 Edit this at Wikidata
జాలస్థలిhttps://addanki.cdma.ap.gov.in/ Edit this at Wikidata

అద్దంకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక పట్టణము (నగర పంచాయితీ), మండల కేంద్రము. రెడ్డిరాజుల తొలిరాజధానిగా ప్రఖ్యాతి. తొలి తెలుగు పద్య శాసనము అద్దంకిలోనే వెలుగు చూసినది.

అద్దంకి చరిత్ర[మార్చు]

ఒక కథ ప్రకారం, అద్దంకిలో అద్ద, అంకి అనే ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ కోసం, ప్రాణలను సమర్పించుకొన్నారు. అందుకే ఈ ప్రాంతానికి అద్దంకి అని పేరు వచ్చింది.

పాండురంగడు వేయించిన ప్రముఖమైన అద్దంకి శాసనం తొలి తెలుగు పద్య శాసనము అద్దంకిలోనే వెలుగు చూసినది. తెలుగు ఛందస్సులో మొదటి తరువోజ పద్య శాసనము చారిత్రకముగా చాలా విలువైనది. దీనిని తొమ్మిదవ శతాబ్దానికి సంబంధించినవిగా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి ప్రకటించారు[1]. ఈ శాసనం వేయి స్తంభాల దేవాలయం దగ్గర త్రవ్వకాలలో బయటపడింది. ఇది సాహిత్య గ్రంథాలు వెలువడక ముందే తెలుగు సాహిత్యానికి నిదర్శనంగా భావిస్తారు. క్రీ.శ. 849లో అద్దంకి పండరంగడు తనకు గురువైన ఆదిత్య భట్టారకుడికి 8 పుట్లు భూమిని దానమిచ్చిన వివరాలు తెలిపే శాసనమిది. ఇది చెన్నై మ్యూజియంలో భద్రపరచబడింది. దీని నకలు ప్రతిని అద్దంకిలో సృజనసాహితీప్రియుులు ప్రతిష్ఠించారు.[2]

రెడ్డిరాజుల కాలంలో ఇది ప్రఖ్యాతిగాంచిన పట్టణము.[3] గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న అద్దంకిని 1324లో ప్రోలయ వేమారెడ్డి తన రాజధానిగా చేసుకొని పాలించాడు. తరువాత వారు తమ రాజధాని కొండవీటికి మార్చారు. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న ఎర్రాప్రెగడ మహాభారతా న్ని ఇక్కడే పూర్తిచేశాడు.

టంగుటూరి ప్రకాశం పంతులు బాల్యంలో ఇక్కడ చదువుకొన్నారు.

భౌగోళికం[మార్చు]

2011 జనగణన ప్రకారం జనాభా 43,850 జన సాంద్రత1,800/కి.మీ2 (4,500/చ. మై.).[4]

అద్దంకి పట్టణం, చుట్టు గల గ్రామాల హద్దులు తెలుపు పటం (భువన్, ఇస్రో ద్వారా)

విద్య[మార్చు]

ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాల, బధిరుల ఆశ్రమ పాఠశాల కొన్ని విశిష్ట పాఠశాలలు.

సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

రాళ్ళపల్లి చెరువు.

దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

రంగనాయకులస్వామి దేవాలయం స్వామి వారి ఊరేగింపు
చారిత్రక దేవాలయాలు
  1. 1000 స్తంభాల దేవాలయం ( భవానీ సెంటర్ దగ్గర)
  2. ఈ ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో, సింగరకొండ అనే మహా పుణ్య శేత్రం ఉంది. ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం (5కిమీ), ఇతర దేవాలయాలున్నాయి. ఇక్కడ రు. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామివారి విగ్రహాన్ని, 2014, మే-19 సోమవారం నాడు, వైభవంగా ఆవిష్కరించారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం

మూలాలు[మార్చు]

  1. ప్రభాకరశాస్త్రి, వేటూరి (2009). సింహావలోకనము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. p. 13. మూలం నుండి 6 మార్చి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 7 December 2014.
  2. "ప్రకాశం జిల్లాచరిత్ర". ఈనాడు. మూలం నుండి 2012-05-24 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)
  3. ఆంధ్రప్రదేశ్ దర్శిని. 1982. p. 80.
  4. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడులో జనగణన గణాంకాలు". Cite web requires |website= (help)

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అద్దంకి&oldid=2870432" నుండి వెలికితీశారు