అక్షాంశ రేఖాంశాలు: 15°51′33″N 78°15′48″E / 15.85924°N 78.26329°E / 15.85924; 78.26329

నందికొట్కూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
పటం
Coordinates: 15°51′33″N 78°15′48″E / 15.85924°N 78.26329°E / 15.85924; 78.26329
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండలంనందికొట్కూరు మండలం
విస్తీర్ణం
 • మొత్తం23.14 కి.మీ2 (8.93 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం46,953
 • జనసాంద్రత2,000/కి.మీ2 (5,300/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1004
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)518401 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata


నందికొట్కూరు, ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా పట్టణం, నందికొట్కూరు మండలానికి ఇది కేంద్రం. దీని పరిపాలన నందికొట్కూరు పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

చరిత్ర

[మార్చు]

నందికొట్కూరు గ్రామం నకు చుట్టు ప్రక్కల తొమ్మిది నంది విగ్రహాలు ప్రతిష్ఠించడం వల్ల ఈ గ్రామం నకు మొదట నవ నందికొట్కూరుగా పిలువబడింది. కాల క్రమేణా ఈ గ్రామం నందికొట్కూరుగా మారింది.

భౌగోళికం

[మార్చు]

ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 32 కి. మీ. దూరంలో ఉంది.

జనగణన గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 10691 ఇళ్లతో, 46953 జనాభాతో 2314 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 23435, ఆడవారి సంఖ్య 23518.[2]

2001వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 40,210. ఇందులో పురుషుల సంఖ్య 20,545, మహిళల సంఖ్య 19,665, గ్రామంలో నివాస గృహాలు 8,098 ఉన్నాయి.

పరిపాలన

[మార్చు]

నందికొట్కూరు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో రెండు ప్రైవేటు బాల బడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 16, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 12, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు నాలుగు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, 2 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.

సమీప ఇంజనీరింగ్ కళాశాల, సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్, సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కర్నూలులో ఉన్నాయి.

భూమి వినియోగం

[మార్చు]

నందికొట్కూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 483 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 44 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 29 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 85 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 315 హెక్టార్లు
  • బంజరు భూమి: 545 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 809 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1519 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 151 హెక్టార్లు
    • బావులు/బోరు బావులు: 151 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

శనగలు, మొక్కజొన్న, కందులు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

నవ నందీశ్వరాలయం: 13 వ శతాబ్దానికి పూర్వం ప్రస్తుత గ్రామం ఉన్న ప్రాంతం దట్టమైన ఆడవులతో నిండి ఉండేది. కాకతీయ ప్రభువు శ్రీ ప్రతాపరుద్రుడు తన సైన్యంతో శ్రీశైలం సందర్శించుటకు వెళ్ళుతూ కొంత సేపు అచ్చట సేద తీర్చుకొనుటకు విడిది చేయుచుండెడివాడు. రాజు కోరికపై సిరిసింగడు ఆనుసేన సామంతుడు ఈ ప్రాంతమును శైవ సంప్రదాయముగా గ్రామం ఏర్పాటు చేసినట్లు ప్రస్తుతము ఉన్న కోట ప్రాంతము పురాతన 8వ వీరభద్ర సూర్యనారాయణ ఆలయాలు శిథిలమైన కోట బురుజుల చుట్టూ కంధకము శిలాశాసనము పరిశీలనను బట్టి తెలియుచున్నది.

  • తూర్పు దిక్కున: ఆత్మకూరు వెళ్ళెదారిలో ఉంది. (జమ్మిచెట్టు దగ్గర)
  • పడమర దిక్కున: మల్యాల గ్రామం వెళ్ళు రహదారిలో ఉంది. అయితే ప్రస్తుతం నంది అక్కడి పొలాలలో బూడిపోయింది.
  • ఉత్తరం దిక్కున: ఈ నంది సి.యస్.ఐ. పాలెంలో నంబర్ పొలంలో ఉంది. ప్రస్తుతం ఈ నంది శిథిలావస్థలో ఉంది.
  • దక్షిణ దిక్కున: వీపనగండ్ల గ్రామం వెళ్ళే దారిలో ఈ నంది ప్రతిష్ఠించబడింది. ఈ తొమ్మిది నవనందులపై ప్రజల అభిప్రాయం నమ్మకం:
  • ఆప్పటి రాజులు ఈ నందుల క్రింద తమ వెండి, బంగారం, ధనం ఆన్నింటిని ఈ నందుల క్రింద ఉంచారని ఇక్కడి వారి ఆభిప్రాయం.
  • ఈ నందులను దాటి ఊరు (ప్రాంతం) నిర్మిస్తే ఈ ఊరు నశిస్తుందని ఈ ఊరికే ఆరిష్టం అని ఇక్కడి ప్రజల నమ్మకం.
  • ఈ నందికొట్కూరు ప్రాంతాన్ని అప్పటి నైజాం నవాబులు పరిపాలించారు. ఈ నందికొట్కూరు ప్రాంతంలోని మద్దిగట్ల అను గ్రామంలో ఎత్తైన బురుజును నిర్మించారు, శివుని గుడి, అంజనేయ స్వామి గుడి నిర్మించారు. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉంది. నందికొట్కూరు ప్రాంతంలోని సూర్యనారాయణ దేవాలయంను, అంజనేయ స్వామి దేవాలయంను అప్పటి రాజులు నిర్మించారు, ఈ ప్రాంతంలో చౌడేశ్వరి దేవి ఆలయం ముఖ్యమైనవి.

శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం:ఈ దేవాలయము సా.శ. 1300 వందల సంవత్సరములలో చోళ రాజులలో, సిరిసింగరాజు అనే సూర్యవంశ రాజు, ఈ సూర్యనారాయణ దేవాలయమును నిర్మించెను. ఈ చోళరాజులలో సిరిసింగరాజు అలంపూరును పరిపాలిస్తుండేవాడు. గర్భాలయంలోని మూల మూర్తి కుడి చేతిలో తెల్లని పద్మం, ఎడమ చేయి అభయ ముద్రలో కనిపిస్తుంది.

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:నందికొట్కూరు పట్టణం నుంచి కొణిదేల గ్రామం నకు వెళ్ళే దారిలో అతి సుందరమైన, ప్రాచీనమైన ఈ దేవాలయము ఉంది.

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

[మార్చు]