డోన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
డోన్
—  మండలం  —
కర్నూలు జిల్లా పటములో డోన్ మండలం యొక్క స్థానము
కర్నూలు జిల్లా పటములో డోన్ మండలం యొక్క స్థానము
డోన్ is located in ఆంధ్ర ప్రదేశ్
డోన్
ఆంధ్రప్రదేశ్ పటములో డోన్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°25′00″N 77°53′00″E / 15.4167°N 77.8833°E / 15.4167; 77.8833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రము డోన్
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,20,232
 - పురుషులు 60,558
 - స్త్రీలు 59,674
అక్షరాస్యత (2011)
 - మొత్తం 57.00%
 - పురుషులు 69.94%
 - స్త్రీలు 43.67%
పిన్ కోడ్ 518222
డోన్
—  పట్టణo  —
డోన్ is located in ఆంధ్ర ప్రదేశ్
డోన్
అక్షాంశరేఖాంశాలు: 15°25′00″N 77°53′00″E / 15.4167°N 77.8833°E / 15.4167; 77.8833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం డోన్
ప్రభుత్వము
 - మునిసిపల్ కమిషనర్
జనాభా (2011)
 - మొత్తం 59,272
 - పురుషుల సంఖ్య 29,470
 - స్త్రీల సంఖ్య 29,802
 - గృహాల సంఖ్య 12,827
పిన్ కోడ్ 518 222
ఎస్.టి.డి కోడ్ 08516

ద్రోణాచలం లేదా డోన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము, మరియు పట్టణము. పిన్ కోడ్ : 518 222.

డోన్ వద్ద గుంటూరు-గుంతకల్ రైలు మార్గం

చరిత్ర[మార్చు]

డోన్ చరిత్రాత్మక పట్టణం. దీని పాతపేరు ద్రోణపురి. బ్రిటిష్ వారి కాలంలో దీనికి డోన్ అనే పేరు వచ్చింది. కాచిగూడ - గుంతకల్లు మరియు గుంటూరు - గుంతకల్లు మార్గాలు డోన్ పట్టణం గుండా పోతున్నది. ఈ పట్టణం విద్యాధికులు గల పట్టణం. నీలం సంజీవరెడ్డి ఈ ప్రాంతంనుండే ఎన్నికై ముఖ్యమంత్రి పదవిని అలంకరించాడు. ఓ చారిత్రాత్మక కథనం ప్రకారం, పాండవుల గురువైన ద్రోణాచార్యుడు, తీర్థయాత్రలకు పోతూ ఈ ప్రాంతంలోని కొండల శిఖరాలపై కొంత సమయం బసచేశాడు. ఈ చరిత్ర సంస్మణార్థం, ఈ ప్రాంతానికి ద్రోణపురి అనే పేరు వచ్చింది. కాలానుగుణంగా ఈ పేరు ద్రోణాచలంగా మారింది. బ్రిటిష్ హయాంలో దీని పేరు డోన్ గా స్థిర పడింది. ద్రోణపురి, ద్రోణాచలం మరియు డోన్ పేర్లు ఈ పట్టణానికి చెందినవే.

భౌగోళికం[మార్చు]

ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో గలదు. ఈ పట్టణం గుండా హైదరాబాదు మరియు బెంగళూరు మధ్యగల జాతీయ రహదారి-7 పోతున్నది. డోన్ నుండి హైదరాబాదు 270 కి.మీ. మరియు బెంగళూరు 340 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఈ పట్టణం గుండా పోయే రైలు మార్గాన్ని బ్రిటిష్ వారు 1870లో నిర్మించారు.

గణాంకాలు[మార్చు]

2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 59,272.[1] ఇందులో పురుషుల సంఖ్య 29,470, మహిళల సంఖ్య 29,802 గ్రామంలో నివాస గృహాలు 12,827 ఉన్నాయి.

రాజకీయాలు[మార్చు]

రాజకీయ చైతన్యంగల ఈ పట్టణం నుండే ఇద్దరు ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి మరియు కోట్ల విజయ భాస్కర రెడ్డి ఎమ్.ఎల్.ఏ.లుగా ఎన్నికైనారు. ప్రస్తుత శాసన సభ్యుడు [బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి] (వై సి పి)

పరిశ్రమలు[మార్చు]

డోన్ పట్టణ పరిసరాలలో అనేక ఖనిజాలు ఉన్నాయి.సున్నపురాయి, గ్రానైటు గనులు గలవు. వీటికి అనుబంధ పరిశ్రమలు కూడా నెలకొల్పబడ్డాయి. లఘు మరియు మధ్యతరహా పరిశ్రమలు మరియు సిమెంటు పరిశ్రమ అనేక మందికి జీవనోపాధిని కలిగిస్తున్నాయి.

మతపర విషయాలు[మార్చు]

డోన్ పట్టణం మతసామరస్యానికి నిలయం. హిందువులు, ముస్లింలు మరియు క్రైస్తవులు సోదరభావంతో సామరస్యంగా జీవిస్తారు. డోన్ పట్టణంలోగల మూడు కొండలపై ఓ దేవాలయం, దర్గా, చర్చి నిర్మించారు. ఈ తరహా దృశ్యం మతసామరస్యాలకు ప్రతీక. డోన్ పట్టణ చరిత్రలో ఎన్నడునూ మతపరమైన వివాదాలు తలెత్తలేదు. ధార్మిక ప్రదేశాలు:

 • శ్రీరామ దేవాలయం (ప్రాచీనమైనది)
 • కొత్తబుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం (ప్రాచీనమైనది)
 • మాలిక్ బాబా దేవాలయం
 • శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము (నెహ్రూనగర్) - ఇచ్చట వెలసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము చూడచక్కగా అధ్యాత్మిక ప్రవచనాలతో విరజిల్లుతూ వుంటుంది. ఈ దేవాలయములో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఆరాధన మహోత్సవాల సందర్భంగా తిరునాల నిర్వహిస్తారు.ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు దేవాలయాన్ని దర్శించుకుంటారు.
 • శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము (కొత్తపేటలో రాజా థియేటర్ వెనుక)

విద్యా విజ్ఞాన విషయాలు[మార్చు]

డోన్ పట్టణం విద్యాసాంకేతికరంగాల నిపుణులు కల పట్టణం. ఇక్కడివారు అనేక ప్రభుత్వ, ప్రైవేటుసంస్థలలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో నిపుణులుగా రాణిస్తున్నారు. అనేక మల్టీనేషనల్ కంపెనీలలోనూ, దేశవిదేశాలలోనూ పనిచేస్తున్నారు. డోన్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. అందులో జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి.

పండుగలు[మార్చు]

కులమత తారతమ్యాలు లేకుండా ప్రజలు ఇక్కడ అనేక పండుగలు జరుపుకుంటారు. దీనికి మంచి ఉదాహరణ శివరాత్రి ఉత్సవాలు. స్థానిక దేవాలయ ఉత్సవాలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. పాత బుగ్గ వద్ద శివరాత్రి సందర్భంగా తిరుణాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

ఇతరములు[మార్చు]

 • డోన్ పట్టణం సాధారణ జీవనానికి అనువైనది. వస్తువులు చౌకథరలు ఇందుకొక కారణం. డోన్ పట్టణం వేగవంతంగా పెరుగుతున్నది.
 • రాజకీయ బలాలు చాలా ఉత్సాహకరంగా వుంటాయి.
 • ఇక్కడి రైల్వేస్టేషను రాష్ట్రంలోగల పెద్ద స్టేషనులలో ఒకటి, రద్దీగానూ వుంటుంది, జిల్లాలోనే అతిపెద్ద స్టేషను మరియు ప్రధాన కూడలి.
 • డోన్ పేరు ద్రోణాచలం అయిననూ రైల్వే వారు ఇప్పటికీ డోన్ పేరుతోనే వ్యవహారికాలను జరపదం జరుగుతున్నది.
 • ఈ పట్టణంలో పెరిగిన మర్రి రాఘవయ్య గారు ఆఖిల భారత స్థాయిలో రైల్వే కార్మికుల ప్రదాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,20,232 - పురుషులు 60,558 - స్త్రీలు 59,674
అక్షరాస్యత (2011) - మొత్తం 57.00% - పురుషులు 69.94% - స్త్రీలు 43.67%

రవాణా వ్యవస్థ[మార్చు]

డోన్ పట్టణం నుండి భారత దేశంలోని బెంగుళూర్, చెన్నై, విశాఖపట్నం, తిరుపతి, ఢిల్లీ,లక్నో,జైపూర్ మొదలైన ముఖ్య పట్టణాలకు రైలు మార్గం అందుబాటులో ఉంది. 7వ నంబర్ జాతీయ రహదారి ఈ పట్టణం గుండా పోవుచున్నది.

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు] • abbireddy palli
"https://te.wikipedia.org/w/index.php?title=డోన్&oldid=2099519" నుండి వెలికితీశారు