చర్చ:డోన్
స్వరూపం
ధోన్ అనేది అసలు పేరు కాదు. తెలుగు పేరు ద్రోణాచలం మరొయు ఆంగ్లములో డోన్ గా పిలుస్తారు. వ్యాసాన్ని ఆ పేరుకు తరలించండి.--గండర గండడు (చర్చ) 12:02, 19 ఫిబ్రవరి 2013 (UTC)
- తరలించాను. ఇంకా గ్రామాల పేర్లలో ధోన్ ఉన్నవి కూడా తరలించాలి. — వీవెన్ (చర్చ) 16:20, 19 ఫిబ్రవరి 2013 (UTC)
- మహబ్బాద్, పాలమురు లాగా ఇది పాత పేరు కొత్త పేరా? ఎందుకడుగుతున్నానంటే ఈనాడు పేపర్లో ఎప్పుడూ డోన్ అనే చదివిన గుర్తు. అధికారకంగా ఆ ఊరు పోస్టాఫీసు, బ్యాకుల బోర్డులపై ఏమి వ్రాసి ఉంటుంది? Chavakiran (చర్చ) 00:00, 20 ఫిబ్రవరి 2013 (UTC)
ద్రోణాచలము అనునదే అసలైన పేరు.రైల్వే స్టేషను బోర్డులో కూడా ద్రోణాచలం(40సంవత్సరంక్రితము)అనేపేరువుండేది.ఆంగ్లంలో Dronachalam అని వుండటంవలన 'ద 'ను 'డ 'గా వుచ్చరించడం మొదలై డ్రోన్ తరువాత డొన్ గా రూపాంతరం చెందినది.రాజమహేంద్రము వాడుకలో రాజమండ్రిగా మారినట్లు. పాలగిరి (చర్చ) 01:50, 20 ఫిబ్రవరి 2013 (UTC)
- చరిత్ర పరంగా ద్రోణాచలం అసలుపేరయి ఉండవచ్చు. కానీ అధికారికంగా ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తున్నారు అనేదే మనకు ముఖ్యమైనది. ఉదాహరణకు కడప ఆంగ్ల స్పెల్లింగును అధికారికంగా మార్చనంతవరకు బ్రిటీషువారు వాడిన వింత స్పెల్లింగే మనం వాడుకున్నాము(cuddapah --> Kadapa) . వికీలో కూడా వ్యాసం పేరు అధికారిక పేరు ఉండి, మిగతా పేర్లు దారిమార్పు పేర్లగా, పేర్ల గురించిన చర్చ వ్యాసంలో వివరంగా వ్రాయాలి. Chavakiran (చర్చ) 11:41, 20 ఫిబ్రవరి 2013 (UTC)