బండి ఆత్మకూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బండి ఆత్మకూరు
—  మండలం  —
కర్నూలు జిల్లా పటములో బండి ఆత్మకూరు మండలం యొక్క స్థానము
కర్నూలు జిల్లా పటములో బండి ఆత్మకూరు మండలం యొక్క స్థానము
బండి ఆత్మకూరు is located in ఆంధ్ర ప్రదేశ్
బండి ఆత్మకూరు
ఆంధ్రప్రదేశ్ పటములో బండి ఆత్మకూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°29′N 78°29′E / 15.48°N 78.48°E / 15.48; 78.48
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రము బండి ఆత్మకూరు
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,592
 - పురుషులు 24,379
 - స్త్రీలు 24,213
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.34%
 - పురుషులు 65.78%
 - స్త్రీలు 36.57%
పిన్ కోడ్ 518523
బండి ఆత్మకూరు
—  రెవిన్యూ గ్రామం  —
బండి ఆత్మకూరు is located in ఆంధ్ర ప్రదేశ్
బండి ఆత్మకూరు
అక్షాంశరేఖాంశాలు: 15°29′N 78°29′E / 15.48°N 78.48°E / 15.48; 78.48
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం బండి ఆత్మకూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 6,554
 - పురుషుల సంఖ్య 3,365
 - స్త్రీల సంఖ్య 3,189
 - గృహాల సంఖ్య 1,502
పిన్ కోడ్ 518 523
ఎస్.టి.డి కోడ్ 08514

బండి ఆత్మకూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము.

శ్రీ శ్రీ గాయత్రి విరాట్ విశ్వకర్మ వేద పాఠశాల[మార్చు]

ఆత్మకూరు పట్టణంలోని వడ్లపేట లోని కాళికాంబ దేవాలయము ప్రాంగణంలో,వేద పండితులు,అర్చకులు శ్రీ బాణాల లక్ష్మీ నారాయణాచార్యులు గారి ఆద్వర్యంలో శ్రీ శ్రీ గాయత్రి విరాట్ విశ్వకర్మ వేద పాఠశాల నడుస్తున్నది.

కోడ్స్[మార్చు]

  • పిన్ కోడ్: 518523
  • టెలిఫోన్ కోడ్: 08514
  • వాహనం రిజిస్ట్రేషన్: AP 21

గ్రామాలు[మార్చు]

గ్రామ చరిత్ర[మార్చు]

తెలుగులో తొలి యాత్రాచరిత్రకారునిగా ప్రఖ్యాతిచెందిన ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్ర చరిత్రలో ఈ గ్రామాన్ని గురించి వ్రాశారు. 1830 సంవత్సరంలో ఆయన చేసిన కాశీయాత్రలో ఈ గ్రామాన్ని సందర్శించిన నాటి వివరాలు కావడంతో చారిత్రిక విలువను సంతరించుకున్నాయి. గ్రంథంలో ఆయన బండి ఆత్మకూరును బండాతుకూరుగా వ్యవహరించారు. దగ్గరలోని మహానంది క్షేత్రం నుంచి ఈ ఊరికి ఆయన వచ్చినట్టు తెలిపారు. 1830 నాటికే ఇది బస్తీగ్రామం.[1] అప్పటికే ఇక్కడ అన్ని వస్తువులు దొరికేవి. ఇది అప్పటికి కందనూరు నవాబు పరిపాలనలో ఉండేది. వీరాస్వామయ్య ఒక ఆసక్తికరమైన పరిశీలనను తెలిపారు. ఆయన ఈ ప్రాంతంలోని చిత్రమైన ఒక అలవాటును గురించి ఆవులను పాలు పితుకుట లేదు. దూడలను ఆవులతో కూడా మేతకు తోలుచునున్నారు. అక్కడివారికి యెనప పాడి సహజముగా నున్నది. పశువులకు తాము కాపురముండే యిండ్ల కంటే చక్కగా కొఠములు కట్టి బాగా కాపాడుచున్నారు అని వ్రాశారు. ఆ ప్రాంతంలో వరి పండేది కాదనీ, పుంజధాన్యాలు బాగా పండేవని వ్రాశారు. బ్రాహ్మణులకు భూజీవనము పుష్కలంగా కలిగున్నదని, శూద్రులు బాగా కష్టపడి కృషిచేయుచున్నారని వ్రాసుకున్నారు.[2]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

19వ శతాబ్ది తొలి భాగంలో గ్రామానికి పేరు బండాతుకూరుగా ఉండేది[2]. ఈ గ్రామానికి తన కాశీయాత్రలో భాగంగా వచ్చి మజిలీ చేసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య గ్రామనామాన్ని పలుమార్లు బండాతుకూరుగానే ప్రస్తావించారు. ఐతే క్రమంగా ఈ గ్రామానికి 150 సంవత్సరాలలో బండి ఆత్మకూరు అన్న పేరు స్థిరపడింది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 48,592 - పురుషులు 24,379 - స్త్రీలు 24,213

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,554.[3] ఇందులో పురుషుల సంఖ్య 3,365, మహిళల సంఖ్య 3,189, గ్రామంలో నివాస గృహాలు 1,502 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. 2.0 2.1 వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014. 
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21

వెలుపలి లంకెలు[మార్చు]