ఆళ్లగడ్డ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆళ్లగడ్డ
—  మండలం  —
కర్నూలు జిల్లా పటములో ఆళ్లగడ్డ మండలం యొక్క స్థానము
కర్నూలు జిల్లా పటములో ఆళ్లగడ్డ మండలం యొక్క స్థానము
ఆళ్లగడ్డ is located in ఆంధ్ర ప్రదేశ్
ఆళ్లగడ్డ
ఆంధ్రప్రదేశ్ పటములో ఆళ్లగడ్డ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°04′25″N 78°16′57″E / 15.073518°N 78.282424°E / 15.073518; 78.282424
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రము ఆళ్లగడ్డ
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 79,126
 - పురుషులు 39,669
 - స్త్రీలు 39,457
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.57%
 - పురుషులు 68.02%
 - స్త్రీలు 40.91%
పిన్ కోడ్ 518543
ఆళ్లగడ్డ
—  రెవిన్యూ గ్రామం  —
ఆళ్లగడ్డ is located in ఆంధ్ర ప్రదేశ్
ఆళ్లగడ్డ
అక్షాంశరేఖాంశాలు: 15°04′25″N 78°16′57″E / 15.073518°N 78.282424°E / 15.073518; 78.282424
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం ఆళ్లగడ్డ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 26,375
 - పురుషుల సంఖ్య 13,245
 - స్త్రీల సంఖ్య 13,130
 - గృహాల సంఖ్య 5,738
పిన్ కోడ్ 518 543
ఎస్.టి.డి కోడ్

ఆళ్లగడ్డ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1] మరియు అదేపేరు గల మండలమునకు కేంద్రము. పిన్ కోడ్ : 518543.

చరిత్ర[మార్చు]

ఆళ్ళగడ్డ గ్రామానికి మొదట వాడుకలో వున్న పేరు "ఆవులగడ్డ".ఆళ్ళగడ్డ గ్రామం కళలకు,ప్రపంచ ప్రసిద్ధి చెందిన శిల్పాచార్యులకు పెట్టింది పేరు. ఆళ్ళగడ్డ గ్రామంలో విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన పారంపర్య శిల్పాచార్యులు దురుగడ్డ వంశీకులు శిల్పకళలో రాష్ట్రవ్యాప్తంగా పేరుపొందారు. వీరి వంశంలోని దురుగడ్డ బాలవీరాచారి (1926–1986),మహాశిల్పి బిరుదాంకితులు దురుగడ్డ బాలవీరాచారిని 1975 లో జరిగిన ప్రపంచ మొట్ట మొదటి తెలుగు మహా సభల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు విశిష్టంగా సత్కరించారు.అలాగే దురుగడ్డ రామాచారి (1935–2008) తెలుగు యూనివర్సిటీలో శిల్ప విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు.

ఆళ్ళగడ్డ సనాతన సాంప్రదాయ విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు

దేవాలయాలు[మార్చు]

  • ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్వరూప పారిశ్రామిక నగర్లో అతి పురాతనమైన,అత్యంత శక్తివంతమైన శ్రీ కాళికాంబ దేవాలయం ఉంది.ఆళ్లగడ్డ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వబ్రాహ్మణ రాతి శిల్పాచార్యులకు,దారు శిల్పాచార్యులకు కొలవు.అలాంటి ఈ గ్రామంలో వెలసిన శ్రీ కాళికామాత,విశ్వబ్రాహ్మణుల కులదైవంగా,పుర ప్రజల కోరికలు తీర్చే దేవతగా,విరాజిల్లుతూ ఉంది.

గాయత్రీ మాత దేవాలయం

  • ఆళ్ళగడ్డ పట్టణము RTC బస్టాండు నకు అతి సమీపంన అర్ద కిలోమీటరు దూరంలో ఆళ్ళగడ్డ నుండి కడప వెళ్ళు దారిలో పెట్రోలు బానికి దాటి 150మీటర్లు వెల్లి కడివైపు తిరిగి 100 మీటర్లు వెల్లినచో గాయత్రీ నగర్ యందు గాయత్రీ మాత దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతీ శుక్రవారము విశేష పూజలు నిర్వహింపబడును.

పాతకందుకూరు దర్శనీయ ప్రదేశాలు

గంగమ్మ తల్లి దేవాలయం

బ్రహ్మం గారి దేవాలయం

ఆళ్ళగడ్డ పట్టణము నకు అతి సమీపంలో 5కి.మీ దూరంలో ఆళ్ళగడ్డ నుండి జమ్మలమడుగు వెళ్ళు దారిలో పాతకందుకూరు గ్రామంలో గంగమ్మ తల్లి దేవాలయం నుండి 450 మీటర్ల దూరంలో ఉంది.

కాలభైరవ దేవాలయం

  • ఆళ్ళగడ్డ పట్టణము నకు అతి సమీపంలో 6.కి.మీ దూరంలోపాతకందుకూరు నుండి కోటకందుకూరు వెళ్ళుదారిలో పాతకందుకూరు గ్రామం పొలిమేర యందు కాలభైరవ (సోములభైరవ) ఆలయం ఉంది. ఈ కాలభైరవ (సోములభైరవ) దేవాలయంను ఈ మధ్యకాలంలో పునర్నిర్మాణం చేయబడింది. ఈ భైరవ ఆలయంలో ప్రతీ మాసమున బహుళ అష్టమి నాడు స్వామి వారికి విశేష పూజలు, అన్నదానం నిర్వహించబడుతున్నాయి. ఈ ఆలయంనకు అతిసమీపంన శివాలయం ఉంది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 79,126 - పురుషులు 39,669 - స్త్రీలు 39,457
జనాభా (2001) - మొత్తం 26,375- పురుషుల సంఖ్య 13,245 - స్త్రీల సంఖ్య 13,130- గృహాల సంఖ్య 5,738

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 26,375.[2] ఇందులో పురుషుల సంఖ్య 13,245, స్త్రీల సంఖ్య 13,130, గ్రామంలో నివాస గృహాలు 5,738 ఉన్నాయి.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదరిత వృత్తులు

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=ఆళ్లగడ్డ&oldid=2129771" నుండి వెలికితీశారు