Jump to content

ఆళ్లగడ్డ పురపాలక సంఘం

వికీపీడియా నుండి
(ఆళ్లగడ్డ పురపాలకసంఘం నుండి దారిమార్పు చెందింది)

ఆళ్లగడ్డ పురపాలక సంఘం, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లాకు చెందిన ఆళ్లగడ్డ పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.

చరిత్ర

[మార్చు]

ఇది నగర పంచాయితీగా 2011 లో ఏర్పడింది. ఈ నగరపంచాయితీ లో 6 మండలాలు, 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 330 కి.మీ దూరంలోనూ జిల్లా ప్రధాన కేంద్రం 110 కి.మీ. దూరంలో ఉంది.[1]

జనాభా గణాంకాలు

[మార్చు]

2001 లో 37690 గా ఉన్న పట్టణ జనాభా 2011 లో 41697 కు పెరిగింది.[2].పిన్ కోడ్: 518543.

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా ఏడ్డుల కుమారి, ఉషా రాణి వైస్ చైర్మన్‌గా రామలింగ రెడ్డి పనిచేస్తున్నారు.[3]

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఆళ్లగడ్డలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషను గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు

[మార్చు]
  • ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్వరూప పారిశ్రామిక నగర్లో అతి పురాతనమైన,అత్యంత శక్తివంతమైన శ్రీ కాళికాంబ దేవాలయం ఉంది.

ఇతర వివరాలు

[మార్చు]

ఈ పురపాలక సంఘంలో 12544 గృహాలు ఉన్నాయి.15 రెవెన్యూ వార్డులు,20 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.1 కూరగాయల మార్కెట్ లు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-20. Retrieved 2020-07-31.
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]