Jump to content

చీరాల పురపాలక సంఘం

వికీపీడియా నుండి
చీరాల పురపాలక సంఘం
చీరాల
చీరాల పురపాలక సంఘం
స్థాపన1948
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
చీరాల
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చీరాల పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లాకు చెందిన చీరాల పట్టణ స్థానిక సంస్థ.

చరిత్ర

[మార్చు]

చీరాల పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని మునిసిపాలిటీ. ఈ పురపాలక సంఘాన్ని 1948లో మునిసిపాలిటీగా స్థాపించబడింది. [1]బ్రిటిష్ వారి కాలంలో చీరాలను 1920 మున్సిపాలిటీగా ప్రకటించింది. అప్పటి వరకు పంచాయితీ రూ. 4 వేలు ఉన్న పన్ను రూ. 40 వేలకు పెరిగింది. దీన్ని స్థానిక ప్రజలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ 1921 ఏప్రిల్‌ 6న చీరాల వచ్చి మున్సిపాలిటీ రద్దుకు పన్నుల బహిష్కరణ పిలుపునిచ్చారు. అందులో పురబహిష్కరణకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మొగ్గు చూపారు.అప్పట్లో చీరాల, పేరాలలో మొత్తం 15,326 జనాభా ఉండేవారు.దుగ్గిరాల పిలుపు మేరకు 1921 ఏప్రిల్‌ 25న అర్ధరాత్రి పేరాల నుంచి రామ్‌నగర్‌కు, చీరాల నుంచి పొలిమేరకు (నేటి సాల్మన్‌ సెంటర్‌)కు 13,572 మంది తరలి వెళ్లారు. పన్ను చెల్లించమని బ్రిటిష్‌ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. మున్సిపాలిటీని రద్దు చేసి తిరిగి చీరాల, పేరాలను పంచాయితీలుగా చేయాలని డిమాండ్‌ చేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వం వెంటనే పురపాలక సంఘాన్ని రద్దు చేసి రుస్తుంసింగ్‌ అనే వ్యక్తిని తహసీల్దార్‌గా నియమించారు.

జనాభా గణాంకాలు

[మార్చు]

చీరాల పురపాలక సంఘం లో 26 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2011 భారత జనాభా లెక్కల ప్రకారం 87,200 జనాభా ఉండగా అందులో పురుషులు 42,927, మహిళలు 44,273 మంది ఉన్నారు.అక్షరాస్యత రేటు 78.80% ఉంది.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 8,389 ఉన్నారు.ఈ పురపాలక సంఘం లో మొత్తం 23,070 గృహాలు ఉన్నాయి.

చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

[మార్చు]

2019 స్థానిక సంస్థల ఎన్నికల తరువాత చైర్‌పర్సన్‌గా‌ యమ్. రమేష్ బాబు, వైస్ చైర్మన్‌గా కోరబండి సురేష్ బాబు ఎన్నికయ్యారు.[2]

మూలాలు

[మార్చు]
  1. ":: CHIRALA Municipality". web.archive.org. 2014-08-10. Archived from the original on 2014-08-10. Retrieved 2020-06-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]