Jump to content

నరసరావుపేట పురపాలక సంఘం

వికీపీడియా నుండి
నరసరావుపేట పురపాలక సంఘం
నరసరావుపేట
నరసరావుపేట పురపాలక సంఘం
నరసరావుపేట పురపాలక సంఘం
స్థాపన1915 మే 18
వ్యవస్థాపకులుజమీందారు రాజా మల్రాజు వేంకట పెదగుండారాయణిం
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
నరసరావుపేట
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
చైర్‌పర్సన్‌నాగసరపు సుబ్బరాయ గుప్తా
వైస్ చైర్‌పర్సన్‌షేక్ మీరావలి
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికారక వెబ్సైట్

నరసరావుపేట పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఇది 1915 జూన్ 18 న ఏర్పడింది.మొదటి స్పెషల్ ఆపీసరుగా వి.పరబ్రహ్మశాస్త్రి బాధ్యతలు స్వీకరణతో పరిపాలన మొదలైంది. జమీందార్ వంశానికి చెందిన కొక్కు పార్ధసారథినాయుడు 1922 జనవరి 8న న తొలి పురపాలక సంఘం చైర్మెనుగా ఎన్నికైనాడు. అతను మొదటి థపా 1922 జనవరి 8 నుండి 1922 మే 27 వరకు, రెండవ థపా 1922 జూన్ 22 నుండి 1924 జనవరి 15 వరకు చైర్మెనుగా పనిచేసాడు.నరసరావుపేట పురపాలక సంఘానికి చైర్మెన్లుగా ఇప్పటివరకు 23 మంది పనిచేసారు. ప్రస్తుత మున్సిపల్‌ చైర్మన్‌గా నాగసరపు సుబ్బరాయగుప్తా 2014 జూలై 1 నుండి పనిచేస్తున్నాడు. ఇది1980 ఏప్రియల్ 28 న మొదటి తరగతి మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయబడింది.[1] దీని ప్రధాన కేంద్రం నరసరావుపేట పట్టణం.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం 1,17,489. అందులో పురుషులు 59,464 కాగా, స్రీలు 58,065. అక్షరాస్యత శాతం పురుషులు 86.08 కాగా, స్త్రీలు 72.07 శాతం. ఈ పట్టణం 7.65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది.[2]

ఇతర గణాంక వివరాలు

[మార్చు]
  • పురపాలక సంఘం పరిధిలో 34 వార్లుల ఉన్నాయి.
  • వందేళ్ల కాలంలో 24 మంది చైర్‌పర్సన్స్ పరిపాలన సాగించారు.
  • వందేళ్ల కాలంలో 55 సం.లు పాటు ప్రత్యేక అధికారులు,45 సం.లు పాటు చైర్మన్లు పరిపాలన సాగించారు.

ఇప్పటివరకు పనిచేసిన చైర్‌పర్సన్స్

[మార్చు]
ఇప్పటివరకు పనిచేసిన చైర్‌పర్సన్స్ వారి వదవీ కాలం వివరాలు.[3]
వ.సంఖ్య పనిచేసిన చైర్‌పర్సన్ పేరు పదవీ కాలం
1 కొక్కు పార్థసారథినాయుడు 08.01.1922 నుండి 27.05.1922 వరకు

22.06.1922 నుండి 15.01.1924 వరకు

2 సి.హెచ్.కోటేశ్వరరావు 01.11.1924 నుండి 01.11.1924 వరకు

27.07.1925 నుండి 27.07.1925 వరకు

3 జి.వి.కృష్ణయ్య పంతులు 22.11.1924 నుండి 25.06.1925 వరకు

11.09.1925 నుండి 02.11.1926 వరకు

4 రాజా మల్రాజు వేంకట నరశింహరావు బహద్దూర్ 31.01.1927 నుండి 30.10.1929 వరకు

11.11.1931 నుండి 31.08.1932 వరకు

06.12.1932 నుండి 05.03.1935 వరకు

5 నడింపల్లి వేంకట హనుమంతురావు 05.11.1929 నుండి 15.11.1929 వరకు
6 తాడేపల్లి సంపూర్ణ లక్ష్మీనారాయణ పంతులు 15.11.1929 నుండి 11.11.1931 వరకు
7 నాగసరపు సుబ్బరాయశ్రేష్ఠి 15.09.1932 నుండి 01.12.1932 వరకు
8 ఆర్.చంద్రమౌళి 12.03.1935 నుండి 12.03.1935 వరకు

10.03.1938 నుండి 30.05.1938 వరకు

9 మల్రాజు వేంకట రామకృష్ణకొండలరావు బహుద్దూర్ 30.03.1935 నుండి 30.07.1937 వరకు

28.09.1937 నుండి 03.03.1938 వరకు

28.10.1959 నుండి 30.11.1959 వరకు

31.12.1960 నుండి 31.10.1963 వరకు

30.05.1964 నుండి 22.04.1965 వరకు

10 సి.సాంబయ్య పంతులు 06.09.1937 నుండి 06.09.1937 వరకు
11 పాటిమళ్ల సుభ్బారావు 30.05.1938 నుండి 01.11.1941 వరకు
12 ఎం.పూర్ణచంద్రరావు 14.11.1941 నుండి 14.11.1941 వరకు
13 నాగసరపు కృష్ణమూర్తి 29.11.1941 నుండి 31.03.1947 వరకు

14.10.1947 నుండి 19.02.1952 వరకు

14.03.1952 నుండి 09.08.1952 వరకు

31.10.1952 నుండి 31.03.1956 వరకు

14 టి.రామమోహనరావు 14.10.1947 నుండి 14.10.1947 వరకు
15 బి.వి.గోవిందరాజులు 18.06.1956 నుండి 10.08.1956 వరకు
16 కొత్తూరి వేంకటేశ్వర్లు 10.08.1956 నుండి 30.09.1959 వరకు
17 తుమ్మల రామకోటయ్య 07.12.1959 నుండి 13.12.1960 వరకు

16.11.1963 నుండి 15.05.1964 వరకు

18 షేక్ ఫరీద్ 22.10.1981 నుండి 30.09.1983 వరకు
19 షేక్ మహబూబ్ సుభాని 30.11.1983 నుండి 28.02.1986 వరకు
20 క్రోసూరి రంగారావు 30.03.1987 నుండి 28.03.1992 వరకు
21 వనమా సుబ్బరావు 29.03.1995 నుండి 28.03.2000 వరకు
22 గోనుగుంట్ల జోగేశ్వరమ్మ 29.03.2000 నుండి 28.03.2005 వరకు
23 కుంచాల రోశమ్మ 30.09.2005 నుండి 29.09.2010 వరకు
24 నాగసరపు సుబ్బరాయ గుప్తా 01.07.2014 నుండి ...........

ప్రస్తుత పాలకవర్గం

[మార్చు]

చైర్‌పర్సన్‌ , వైస్ చైర్‌పర్సన్‌

[మార్చు]

16 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన నాగసరపు సుబ్బరాయగుప్తా మున్సిపల్ చైర్‌పర్సన్‌ గా,4 వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ గాఎన్నికైన షేక్ మీరావలి వైస్ చైర్‌పర్సన్‌గా 2014 నుండి పనిచేస్తున్నారు.[4]

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
Narasaraopet municipal office exterior

ఈ దిగువ వివరింపబడిన వారు పురపాలక సంఘం వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికై 2014 నుండి పనిచేస్తున్నారు.[5]

  • యర్రంశెట్టి రాములు. 1 వ వార్డు
  • కోవూరి శివప్రసాద్. 2 వ వార్డు
  • షేక్ మస్తాన్‌వలి. 3 వ వార్డు
  • నాగేంధ్రమ్మ దావల.5 వ వార్డు
  • లాం సోమయ్య, 6 వ వార్డు
  • చినకుమారి గేరా . (7 వ వార్డు)
  • షేక్ అబ్దుల్ సత్తార్. (8 వ వార్డు)
  • పాలపర్తి వెంకటేశ్వర్లు. (9 వ వార్డు)
  • మాగులూరి రమణారెడ్డి. (10 వ వార్డు)
  • పోకా శ్రీనివాసరావు.11 వ వార్డు)
  • శీలు బాబురావు. (12 వ వార్డు)
  • బెహరా విజయభారతి. (13 వ వార్డు)
  • కొట్టాపుల్లమ్మ. (14 వ వార్డు)
  • కదం నాగజ్వోతి. (15 వ వార్డు)
  • మున్నీ షేక్. (17 వ వార్డు)
  • కార్నె పాటి శ్రీలత. (18 వ వార్డు)
  • బత్తుల లక్ష్మీ పద్మలత. (19 వ వార్డు)
  • దేరంగుల శ్రీదేవి. (20 వ వార్డు)
  • నాగూర్‌బీ షేక్. 21 వ వార్డు
  • కాకుమాను రత్నకుమారి. (22 వ వార్డు)
  • రమాదేవి పూనూరు. (23 వ వార్డు)
  • రావెళ్ల విజయలక్ష్మి. (24 వ వార్డు)
  • కొండ్రగుట్ట లక్ష్మి. (25 వ వార్డు)
  • బత్తుల సరస్వతి. (26 వ వార్డు)
  • శంకరమ్మ గోగుల. (27 వ వార్డు)
  • గట్టుపల్లి సత్యనారాయణ (28 వ వార్డు)
  • మాడిశెట్టి మోహనరావు. (29 వ వార్డు)
  • షేక్ రహమాన్. (30 వ వార్డు)
  • కారుమంచి మీరావలి. (31 వ వార్డు)
  • షేక్ అబ్దుల్ గఫార్. (32 వ వార్డు)
  • కొలిపాక చంద్రశేఖర రావు. (33 వ వార్డు)
  • సయ్యద్ మహాబ్బీ. (34 వ వార్డు)

కో - అప్షన్ సభ్యులు

[మార్చు]
  • షేక్ మదీనా మస్తాన్బి
  • ఇత్తడి కిరణ్
  • కోటా దుర్గా

పురపాలకసంఘ శతవసంతోత్సవాలు

[మార్చు]
పురపాలక సంఘం శత వసంతోత్సవాల గుర్తుగా నిర్మించిన పైలాన్ (గుంటూరు వెళ్లు రోడ్డులో)

పురపాలక సంఘం శత వసంతోత్సవాల చిహ్నంగా గుంటూరు వెళ్లు రోడ్డులో పైలాన్ నిర్మించబడింది.

మొదటి రోజు (11.12.2015)

[మార్చు]

పురపాలక సంఘం 100 సంవత్సరాల వేడుకలు విభజనానంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో 2015 డిశెంబరు 11 నుండి 13 వరకు మూడు రోజులుపాటు నిర్వహించబడ్డాయి.ఈ ఉత్సవాలకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరై జరుపబడిన జ్వోతి ప్రజ్వలనతో ఉత్సవాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పురపాలక సంఘం చైర్ పర్సన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, అప్పటి మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెలకిశోరబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ జానీమూన్, ఇతర రాజకీయనాయకులు, అధికారులు, అనధికారులు, పుర ప్రజలు పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ సి. ప్రతాప్ రెడ్డి, సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తదితరులు చంద్రబాబుచే సన్మానించబడ్డారు.

రెండవ రోజు (12.12.2015)

[మార్చు]
వెంకయ్యనాయుడు, కోడెల శివప్రసాదరావు, కాశీ రామారావు, రాయపాటి సాంబశివరావు తదితరులు

పురపాలక సంఘం శత వసంతాల వేడుకల రెండోరోజు శనివారం  స్థానిక భువన చంద్ర టౌన్ హాల్లో అప్పటి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధ్యక్షత జరిగిన కార్యక్రమానికి  అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరైయ్యారు.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజకీయాలకు రాజధాని, ఉద్యమాలకు ఊపిరి, ఉద్ధండుల కోట అని నరసరావుపేటను కొనియాడాడు.ఇక్కడ నుండి కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు వెంగళరెడ్డి రాజకీయాలను శాసించారని, చంద్రబాబునాయుడు తర్వాత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి అని అన్నాడు.పల్నాడు ప్రాంతం పౌరుషాల గడ్డ అని, గుంటూరు జిల్లాను శాసించేది నరసరావుపేట, పల్నాడు ప్రాంతమేనని ఈ సందర్భంగా గుర్తు చేసాడు. పట్టణంలోని సాహితీ వేత్తలు, కళాకారులు, విప్లవయోధుల గురించి కూడా ప్రస్తావించారు. తల్లి, తండ్రి, ఊరు, భాష, దేశాన్ని మరిచిన వారికి చరిత్రలో స్థానం ఉండదని చెప్పాడు. విగ్రహంలా వెయ్యేళ్లు జీవించడం కన్నా, విద్యుత్‌లా ఒక నిమిషం జీవించడం మేలని, పూర్వజన్మ సుకృతం వల్ల లభించిన పదవులను అందిపుచ్చుకుని ప్రజలకు సేవ చేయాలని చెప్పాడు.తాను ఒకప్పుడు చూసిన నరసరావుపేట పట్టణం ప్రస్తుతం కనిపించడం లేదని, చాలా అభివృద్ధి కనపడుతుందని చెప్పాడు.. వంద వసంతాల పండుగను చేసుకోవడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, ప్రజల భాగస్వామ్యం లేకపోతే  దేనికి అభివృద్ధి లేదన్నాడు..విప్లవాత్మకమైన మార్పులు రావడం అభివృద్ధికి నాంది అని చెప్పాడు. ఈ ప్రాంతానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదర్శమని చెప్పాడు.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యతని  వెంకయ్యనాయుడు గుర్తు చేసాడు.ప్రజాప్రాతినిధ్యం, పారదర్శకత, జవాబుదారీతనంతో పురపాలక సంఘాలు పనిచేయాలని అన్నాడు. నరసరావుపేట పట్టణం చిన్నది అయినప్పటికీ మనసు మాత్రం మంచిదని కితాబిచ్చాడు.

తొలుత స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి పట్టణంలో నిర్వహించిన అభివృద్ధి పనులను దగ్గరుండి చూపించారు. ఈ సందర్భంగా భువనచంద్ర టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన 1500 గృహాలకు సంబంధించిన శిలాఫలకం, భూగర్భ డ్రైనేజీ శిలాఫలకం, రైల్వే అండర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆవిష్కరించాడు.అనంతరం రైల్వే అండర్ బ్రిడ్జి, భూగర్భ డ్రైనేజీ-2, గృహ నిర్మాణాలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపనలు చేసాడు.

ఈ సమావేశంలో ఇంకా అప్పటి స్పీకరు కోడెల శివప్రసాదరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ఆరాధించే వ్యక్తుల్లో తానూ ఒకడినని అన్నాడు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ చక్రపాణి, మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, వైస్ చైర్మన్ మీరావలి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, మున్సిపల్ కమిషనర్ భానూప్రతాప్, ఆర్డీవో ఎం శ్రీనివాసరావు తదితరులు, ఇతర అధికారులు, అనధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

పురపాలకసంఘ పరిధిలోని ప్రాంతాలు, వీధులు

[మార్చు]
  1. రంగావారివీధి
  2. గానుగల బజారు
  3. ఆంజనేయస్వామి వీధి
  4. సత్తెనపల్లి రోడ్డు
  5. చంద్రబాబునాయుడు కాలనీ
  6. సాయినగర్.
  7. బాబా సాహెబ్ రోడ్డు
  8. పురుషోత్తమాచారి వీధి
  9. ఐలా బజారు
  10. వేణుగోపాలస్వామిగుడి వీధి.
  11. వినుకొండ రోడ్డు
  12. చిలకలూరిపేట రోడ్డు
  13. మేదర బజారు
  14. కుమ్మరబజారు
  15. పెద్ద మసీదు రోడ్డు
  16. నిమ్మతోట
  17. గుంటూరు రోడ్డు
  18. పనసతోట
  19. క్రిష్టియన్ పాలెం
  20. శివసంజీవని కాలనీ
  21. బాబాపేట
  22. రంహతుల్లానగర్
  23. మొహిద్దీన్ నగర్
  24. వెంకటరెడ్డి నగర్
  25. ఇస్లాంపేట
  26. వెంగళరెడ్డి నగర్
  27. కోటప్పకొండ రోడ్డు
  28. ఎరుకలకాలనీ
  29. శ్రీనివాసనగర్
  30. సాంబశివపేట
  31. ప్రకాశ్ నగర్
  32. బాపనయ్యనగర్
  33. షాలెంనగర్
  34. కోడెల శివప్రసాదరావు రోడ్డు
  35. పాత పోష్టాపీసు రోడ్డు
  36. కంబంపాలెం
  37. వివేకానందరోడ్డు
  38. వరవకట్ట వీధి
  39. వరవకట్ట బావి
  40. హనుమయ్య సందు
  41. దివ్వెలవారి వీధి
  42. పరిమివారి వీధి
  43. కొండలరావుపేట
  44. పల్నాడురోడ్డు
  45. మల్లమ్మ సెంటరు
  46. శ్రీరాంపురం
  47. శివుడు బొమ్మ సెంటరు
  48. మాజేటివారి వీధి
  49. కాకుమానువారివీధి
  50. అరకాలవారి వీధి
  51. నంబూరివారి వీధి
  52. ఆంధ్రరత్నరోడ్డు
  53. రావిపాడువారి వీధి
  54. రామరాజువారి వీధి
  55. సీతమ్మరాజు వీధి
  56. పంగనామాలవారి వీధి
  57. రైల్వేస్టేషన్ రోడ్డు
  58. తాడేపల్లివారి వీధి
  59. గట్టిపాటివారి వీధి
  60. చర్చి వీధి
  61. మందవారి వీధి
  62. రూపెనగుంట్లవారి వీధి
  63. అరండల్ పేట
  64. మహ్మద్ మొహిద్దీని రోడ్డు
  65. పి.వి.నరసింహారావు రోడ్డు
  66. రామిరెడ్డిపేట
  67. రాయపాటివారి వీధి
  68. ప్రింటింగ్ ప్రెస్ వారి వీధి
  69. వీరేశలింగంగారి వీధి
  70. పాతపెద్దపోష్టాపీస్ రోడ్డు
  71. ఇక్కుర్తి రోడ్డు
  72. డొంకరోడ్డు
  73. నవోడయనగర్
  74. పాలపాడురోడ్డు
  75. ప్రశాంతినగర్
  76. బరికృష్ణ నగర్
  77. పాత సమితి ఆఫీస్ రోడ్డు
  78. ఎన్.జి.ఓ.కాలనీ
  79. పెద్ద చెరువు
  80. చెరువుకట్ట రోడ్డు
  81. ప్రత్తిపాటివారి వీధి
  82. రాళ్లబండివారి వీధి
  83. భీమలింగేశ్వరస్వామి వారి వీధి
  84. ఆంజనేయస్వామి గుడి వీధి
  85. వంగలవారి వీధి
  86. శిఖాకొల్లివారి వీధి
  87. మండవవారి వీధి
  88. రెడ్లబజారు
  89. అట్లూరివారి వీధి
  90. నౌరోజీరోడ్డు
  91. పట్టాబిరామస్వామి గుడి వీధి
  92. మౌళిపేట
  93. గుండురావుపేట
  94. బైపాస్ రోడ్డు
  95. బరంపేట
  96. సత్యనారాయణపురం
  97. చాకిరాల మిట్ట
  98. ఇందిరానగర్
  99. రామానగర్
  100. బి.సి.కాలనీ

గమనిక:పై వీధులు, ప్రాంతాలు కాకుండా పురపాలక సంఘం గుర్తించని మరికొన్ని వీధులు, ప్రాంతాల ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. http://www.censusindia.gov.in/2011census/dchb/2817_PART_B_DCHB_GUNTUR.pdf
  3. నరసరావుపేట పురపాలక సంఘం శత వసంతోత్సవ సంచిక
  4. https://web.archive.org/web/20190906162345/http://www.apsec.gov.in/ELECTIONRESULTS/RESULTS%202014/List%20of%20Elected%20Municipal%20Chairpersons,%202014%20(Andhra).pdf
  5. https://web.archive.org/web/20190906174718/http://www.apsec.gov.in/ELECTIONRESULTS/RESULTS%202014/Andhra%20Elected%20councilors%20List,%202014.pdf

ఇవి కూడా చూడండి

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]