కడప నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కడప నగరపాలక సంస్థ
స్థానిక ప్రభుత్వము
రాష్ట్రముఆంధ్రప్రదేశ్
నగరములుకడప
ప్రభుత్వం
 • కమీషనర్అలీం భాష
కాలమానంIST +5.5
Area code (phone)+91-8562
జాలస్థలిhttp://www.kadapamunicipalcorporation.org/

కడప నగరపాలక సంస్థ, వై.ఎస్.ఆర్ జిల్లా లోని ఏకైక నగరపాలక సంస్థ.

చారిత్రక నేపధ్యం[మార్చు]

కడప పట్టణం ఆంగ్లేయుల పాలనా కాలంలోనే పురపాలక సంస్థగా ఆవిర్భవించింది.1868లో కడప పట్టణాన్ని మూడో శ్రేణి పురపాలక సంస్థగా ప్రకటించారు. 90 సంవత్సరాలపాటు ఆ స్థాయి కొనసాగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1958లో ద్వితీయశ్రేణి పురపాలకగా అవతరించింది. మరో 22 సంవత్సరాల తర్వాత 1980లో స్పెషల్‌గ్రేడ్‌గా విస్తరించింది. అప్పటి నుంచి 24 సంవత్సరాల పాటు ప్రత్యేక స్థాయి పురపాలక సంస్థగా కడప కొనసాగింది. 2004 నవంబరు 13న ప్రత్యేకస్థాయి పురపాలక సంస్థగా ఉన్న కడపను నగరపాలక సంస్థగా ఉన్నతినిచ్చారు. పురపాలక పాలక వర్గం రద్దయ్యింది. 2005 సెప్టెంబరులో కడప నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించారు. నగరపాలక సంస్థ మొదటి మేయర్‌గా పి. రవీంద్రనాథ్ రెడ్డి ఎంపికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా మైనార్టీ వర్గానికి చెందిన నబీరసూల్‌ను ఎన్నుకున్నారు. నగరపాలక సంస్థ మొదటి కమిషనర్‌గా ఎస్.ఎస్.వర్మ పనిచేశారు. నగరపాలక సంస్థ మొదటి ప్రత్యేకాధికారిగా అప్పటి జిల్లా పాలనాధికారి జయేష్‌రంజన్ పాలనాపగ్గాలు చేపట్టారు. పురపాలక సంస్థ పాలక వర్గం రద్దయ్యేనాటికి బోలా పద్మావతి పురపాలక సంస్థ ఛైర్మెన్‌గా కొనసాగారు.

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]