తిరుపతి నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుపతి నగరపాలక సంస్థ
రకం
రకం
నాయకత్వం
నగర కమీషనర్
హరిత ఐ.ఏ.యస్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు

తిరుపతి నగరపాలక సంస్థ, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరాన్ని పరిపాలించే ఒక పౌరసంఘం.[1]స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో కనిపించే కాకినాడ, విశాఖపట్నాలతో పాటు రాష్ట్రంలోని మూడు సంస్థలలో ఇది ఒకటి.[2] తిరుమల ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి కొండల మధ్యనున్న ఒక ఆధ్యాత్మిక కేంద్రం. నగరపాలక సంస్థ పరిధిలో 50 ఎన్నికల వార్డులు ఉన్నాయి

చరిత్ర

[మార్చు]

మొదట ఇది పురపాలక సంఘం గా 1886 ఏప్రిల్ 1 న ఏర్పడింది. పురపాలక సంఘంగా వివిధ స్థాయిలను అధిగమించి 2007 మార్చి 2 న నగరపాలక సంఘం ఏర్పడింది.

మునిసిపాలిటి స్థాయి రకం తేది
పురపాలక సంఘం 1886 ఏప్రిల్ 1
మొదటి తరగతి 1965 జనవరి 12
రెండవ తరగతి 1962 అక్టోబర్ 1
ప్రత్యేక గ్రేడ్ 1970 ఫిబ్రవరి 13
ఎంపిక గ్రేడ్ 1998 అక్టోబర్ 7
నగరపాలక సంస్థ 2007 మార్చి 2


మొదట పురపాలక సంఘంగా ఉన్నప్పుడు విస్తీర్ణం 16.59 km2 (6.41 sq mi) కలిగి ఉంది.ఇది నగరపాలక సంస్థగా ఏర్పడిన తరువాత 27.44 km2 (10.59 sq mi) వరకు విస్తరించింది.

జనాభా

[మార్చు]

2001 లో 2, 28,202 ఉన్న పట్టణ జనాభా 2011 లో 3,74,260 కు పెరిగింది. గత దశాబ్దంలో 6.40% పెరిగింది. లింగ నిష్పత్తి 1000 మగవారికి 966 మహిళలు. అక్షరాస్యత రేటు 87.55%. పురుష జనాభాలో 92.74%, స్త్రీ జనాభాలో 82.21% అక్షరాస్యులు.

పరిపాలన

[మార్చు]

దీనిలో తిరుపతి, రేణిగుంట ప్రధాన ప్రాంతాలు కాగా, 42 అల్పాదాయ నివాస ప్రాంతాలున్నాయి. నగరంలో 50 ఎన్నికల వార్డులున్నాయి.[1]

అల్పాదాయ నివాస ప్రాంతాలు

[మార్చు]

పట్టణంలోని 3.81 లక్షల జనాభాలో, 1,18,990 మంది ప్రకటించబడిన మురికివాడలు, పేద ప్రాంతాలలో నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది రోజువారీ కూలీలు, ఉద్యోగ కూలీలు, కాలానుగుణ కార్మికులు వంటి వారు జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో 69 పేద స్థావరాలు ఉన్నాయి. వీటిలో ప్రకటించబడిన 42 మురికి వాడలునందు, 27 పేద స్థావరాల ప్రాంతాల నందు జీవిస్తున్నారు. [1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "About Tirupati Municipal Corporation | Tirupati Municipal Corporation". web.archive.org. 2019-12-30. Archived from the original on 2019-12-30. Retrieved 2019-12-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "A local touch to 'smart city' project - The Hindu". web.archive.org. 2019-12-28. Archived from the original on 2019-12-28. Retrieved 2019-12-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

[మార్చు]